కేంద్రం పై చంద్రబాబు స్వరం మారుతుంది... ఎన్ని తక్కువ కేటాయింపులు చేసినా మిత్ర ధర్మం పాటిస్తూ వస్తున్న చంద్రబాబు, పోలవరం విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయం తట్టుకోలేకపోతున్నారు... తాను స్వయంగా వచ్చి, కలిసి, నాలుగు ప్రత్యామన్యాలు చెప్పినా, కేంద్రం వాటిని పట్టించుకోకుండా, మేము కాంట్రాక్టర్ ని మార్చేది లేదు అని తెగిసే చెప్పటంతో, కేంద్రానికి పోలవరం త్వరగా పూర్తి చెయ్యాలి అనే ఉద్దేశం లేదు అని అర్ధమవుతుంది...

polavaram 29102017 2

ఇక చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు... పోలవరం విషయంలో అన్యాయం చేస్తే, మిత్ర ధర్మం కూడా పక్కన పెట్టేస్తాను అనే సంకేతాలు ఇచ్చారు...నిన్న ప్రెస్ మీట్ లో కేంద్రం పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు... ముందుగానే డబ్బు సర్దుబాటు చేస్తే తప్ప ప్రాజెక్టును నిర్మించలేమంటూ ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ చెబుతుంటే.. కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ నిధులు ఇవ్వనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు... అలాగే అమరావతి మీద గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసులు వెయ్యటం పై కూడా మండిపడ్డారు... నాపై కక్ష ఉంటే నేరుగా తీర్చుకోవాలే గాని, రాష్ట్ర ప్రజలేం పాపం చేశారు అంటూ ప్రతిపక్షాలకి విజ్ఞప్తి చేసారు...

polavaram 29102017 3

ఈ సంక్లిష్ట పరిస్థుతుల్లో, చంద్రబాబు మరోసారి కేంద్రం దగ్గరకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు.... ఆదివారం దయం 10 గంటలకు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులపై తన నివాసం నుంచి వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహిం చనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుని అక్క డ్నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లి బయలుదేరి వెళ్ళనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల విడుదల, కడప ఫాతిమా మెడికల్‌ విద్యార్ధుల అం శంపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ప్రతి సోమవారం జరిగే పోలవరం రివ్యూ, ఈసారి ఆదివారం నాడే పెట్టుకుని, వాస్తవ పరిస్థితి తెలుసుకుని, కేంద్రం దగ్గర సమర్ధవంతమైన వాదన వినిపించాలి అని చంద్రబాబు ఉద్దేశం... మరి కేంద్రం తన మొండి పట్టు వీడుతుండా, లేక రాష్ట్రానికి సహకరిస్తుందా అనేది చూడాలి...

పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కుతున్న చిత్తూరు జిల్లా శ్రీ సిటీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతున్నది. సామాన్యులకు సైతం కనీసావసరంగా మారిపోయిన మొబైల్ ఫోన్లు ఇప్పటికే మేడిన్ ఆంధ్రా బ్రాండ్‌తో తయారవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాలు ఇతర దేశాల్లోనే ఉన్నాయి. కానీ.. భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే..

sony 28102017 2

ప్రపంచంలో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ "సోనీ ఇండియా" భారతదేశంలోనే ఫోన్లు తయారు చేసి మార్కెట్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. సోనీ ఇండియా రెండు మోడల్స్ లో, Xperia R1 Plus and R1, రూ. 12,000 నుంచి రూ. 15,000 రేంజ్ లో, మన దేశ మార్కెట్ లో ప్రవేశించనుంది. ఈ ఫోన్స్ తయారు చెయ్యటానికి మన రాష్ట్రంలో, శ్రీ సిటీలో ని ఫాక్స్కాన్ కంపెనీ సహాయం తీసుకోనుంది... నవంబర్ నుండి "సోనీ ఇండియా" మేడ్ ఇన్ ఆంధ్రా ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి...

sony 28102017 3

ఫాక్స్‌కాన్‌, మైక్రోమాక్స్‌, లావా, సెల్‌కాన్‌, కార్బన్‌ మొబైల్‌ కంపెనీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో శ్రీసిటీ సెజ్‌లో సెల్‌కాన్‌, ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ లో తయారైన షామీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే విస్తృతంగా మార్కెట్ లో ఉన్నాయి. ఫాక్స్‌కాన్‌ ఆధారంగా భవిష్యత్తులో సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో నిమగ్నమైన ఇతర కంపెనీలు ఇక్కడకు వస్తాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. మరోపక్క అనంతపురం- హిందూపురం మధ్య గల ప్రదేశంలో ఎలక్ట్రానిక్‌ పరిశ్రమను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బెంగుళూరుకు దగ్గరగా ఉండటం, స్థలం లభ్యత తదితర సానుకూలతలు అక్కడ ఉన్నాయి. జపాన్‌, కొరియా, సింగపూర్‌ కంపెనీలను ఈమేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరినట్లు అధికార వర్గాలు వివరిస్తున్నాయి.

ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న పాదయాత్ర, ప్రశాంత్ కిషోర్ ఫేక్ బ్యాచ్ , జగన్ సోషల్ మీడియా పైడ్ బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారాల పై, తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఎటాక్ కు సిద్ధమవుతుంది. మొన్నటి వరకు వీటిని పెద్దగా పట్టించుకోకుండా పలాన చేస్తూ వెళ్తున్న అధికార పక్షం, ఇక గట్టి కౌంటర్ ఎటాక్ ఇవ్వటానికి సిద్ధమైంది... టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ అంశం పై దృష్టిసారించారు. ఎత్తుకు పైఎత్తు వేసే క్రమంలో టీడీపీ కూడా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాలనే యోచనలో ఉంది. ఇందులో టీడీపీ అధినేత మినీ పాదయాత్రలు బహిరంగ సభలు కూడా నిర్వహించాలనే ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉంది.

cbn jagan 27102017 2

నవంబర్ నెలలో కొత్త కార్యాచరణకు తెర లేపే దిశగా కసరత్తు సాగుతోంది. విపక్ష నేత సభలంటే తెలుగుదేశం పార్టీ పై అధినేత పై పెద్ద ఎత్తున విమర్శలు ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే విరుగుడుగా లబ్ధి పొందిన రైతాంగం, సానిక ప్రజానీకాన్ని మమేకం చేస్తూ, వారి చేతే నిజాలు చెప్పించి పోజిటివ్ వేవ్ క్రియేట్ చేస్తారు... జగన్ స్పీడ్ కు బ్రేక్లు వేయడం కోసమే పాలకపక్షం కొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. వివిధ జిలాల్లో నిర్వహించనున్న పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తావించే అంశాలకు వెంటనే సమాధానం ఇచ్చే విధంగా కార్యక్రమాలను రూపొందించే అవకాశాలున్నాయి.

cbn jagan 27102017 3

చంద్రబాబు మినీ పాదయాత్రలు, బహిరంగ సభలో భాగంగా మూడున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి... పై విస్తృతంగా వివరిస్తారు. అన్ని జిలాల్లో పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయాలని. అవి అర్ధవంతంగా ఉండాలనేది పార్టీ అధినేత వ్యూహంగా మారింది. వచ్చే ఎన్నికలో విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాడర్ను అప్రమత్తం చేయడంలో ముందున్నారు. ఏయే ప్రాంతాలోపార్టీ బలహీనంగా ఉన్నది. ఇంటింటికీ తెలుగుదేశం పురోగతి పై లోతుగా చర్చిస్తున్నారు. 80 శాతం తగ్గకుండా ప్రజల ఆమోదం టీడీపీ పాలన పై ఉండాలని చంద్రబాబు ఉద్దేశం. దానికి తగ్గట్టుగా, చేసిన మంచి చెప్పుంటే చాలు, ప్రజలు మనవైపే ఉంటారు అనేది చంద్రబాబు ప్రధాన ఉద్దేశం...

పార్టీలు మారేప్పుడు అమ్మనా బూతులు తిట్టి బయటకు వెళ్ళే వారిని చూశాం... భవిషత్తునిచ్చిన తల్లి లాంటి పార్టీని, తండ్రి లాంటి నాయకుడిని అనరాని మాటలు అనే వాళ్ళని చూశాం... తనకు అండగా ఉన్న కార్యకర్తలని నిలువునా ముంచి వెళ్ళిపోయే వారిని చూశాం... కాని రేవంత్ రెడ్డి వీటన్నిటికీ అతీతం... అమరావతిలో ఇవాళ తెలంగాణా తెలుగుదేశం నాయకుల పంచాయితీ జరిగింది... రేవంత్ రాజీనామా లేఖ ఇచ్చి వెళ్ళిపోయారు... కాని ఆ రాజీనామా లేఖ అందరూ ఇచ్చినట్టు బూతులు తిడుతూ లేదు... చాలా ఎమోషనల్ టచ్ ఉంది...

revanth 28102017 2

ముందుగా ఎన్టీఆర్ స్పూర్తి గురించి రాసారు రేవంత్... తరువాత చంద్రబాబుని, పార్టీని, కార్యకర్తలని ఉద్దేశిస్తూ, ‘‘మీతో నా ప్రయాణం మరిచిపోలేనిది. మీ నాయకత్వంలో చేసిన పోరాటాలు గొప్ప అనుభవాన్నిచ్చాయి. మీ అనుచరుడిగా, టీడీపీ నేతగా గుర్తింపు పొందడం గర్వకారణం. తక్కువ సమయంలో పార్టీలో మంచి గుర్తింపు ఇచ్చారు. సీనియర్లు ఉన్నా నాకు కీలక అవకాశాలిచ్చారు. నా శక్తిమేరకు సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించా. కార్యకర్తలతో నా అనుబంధం విడదీయరానిది. టీడీపీతో బంధం తెంచుకోవడం నాకు గుండె కోతతో సమానం’’

revanth 28102017 3

అంతే కాదు, నేను పార్టీ మారటానికి ప్రధాన కారణం, నా లక్ష్యం అయిన కెసిఆర్ ని దించటం కోసం అంటూ, కెసిఆర్ చేసిన, చేస్తున్న అరచాకలు, కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాబిన్నమయ్యాయని, ఇలా అన్నీ లేఖలో రాశారు... ఎమ్మల్యే పదవికి కూడా రాజీనామా చేసున్నా అని చెప్పారు... ఇంతకంటే నైతికత ఏమి ఉంటుంది... చివరగా చంద్రబాబుని ఉద్దేశిస్తూ, "పార్టీ అధ్యక్షుడుగా, మార్గదర్శిగా మీరు ఇచ్చిన పోరాట పటిమ, స్పూర్తి గుండెల నిండా నింపుకుని తెలంగాణ సమాజ హితం కోసం మరింత విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను."

Advertisements

Latest Articles

Most Read