నిత్యం పచ్చ పత్రిక అంటూ హేళన చేసే జగన్, ఇప్పుడు ఆ పచ్చ పత్రిక అధినేత దర్శనం కోసం వెళ్లారు... స్వామీజీలు లాగా, ఆయన దగ్గర కూడా, కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారో లేదో తేలేదు కాని, ఆయనతో 40 నిమషాలు మంతనాలు జరిపారు... వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావుతో, దాదాపు 40 నిమషాలు భేటి అయ్యారు... జగన్ తో పాటు, భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు... ఒక పక్క సిబిఐ కోర్ట్ పాదయాత్రకు శక్రువారం పర్మిషన్ నిరాకరించటంతో డీలా పడ్డ జగన్, వెంటనే రామోజీ రావు దగ్గర ప్రత్యక్షమవటం చర్చనీయాంశం అయ్యింది...
వీరి కలయిక రాజకీయమా ? వ్యక్తిగతమా ? లేక పాదయాత్ర కోసం, రామోజీ ఆశీర్వాదం తీసుకోవటానికి జగన్ వెళ్ళరా అనేది తెలియాల్సి ఉంది. తెర వెనుక రాజకీయ తంత్రాన్ని నడిపిన వ్యక్తిగా, ఒక కింగ్ మేకర్ గా రామోజీరావుకున్న క్రేజ్ ఎంతన్నది కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. రామోజీ, చంద్రబాబు తొత్తు అని, జగన్ గ్యాంగ్ ఎన్నో సార్లు ఆయన పై విమర్శలు చేసింది... బట్టలు లేకుండా, రామోజీ పై కార్టూన్ లు కూడా వేసింది... రాజశేఖర్ రెడ్డి అయితే, ఆ రెండు పత్రికలూ అంటూ, ఈనాడుని బహిష్కరించమని పిలుపు కూడా ఇచ్చారు.. చివరకు ఈనాడుకి పోటీగా, సాక్షి కూడా కొడుకు చేత పెట్టించారు...
మరి, జగన్ సడన్ గా రామోజీ దగ్గరకు ఎందుకు వెళ్లారు ? చంద్రబాబు తర్వాత అంత శత్రువుగా భావించే రామోజీతో, జగన్ కు పని ఏంటి ? మోడీతో రామోజీకి ఉన్న సాన్నిహిత్యాన్ని జగన్ ఎమన్నా ఉపయోగించుకుని కేసుల్లో ఊరట పొందుతారా ? లేక తెలుగుదేశం పార్టీని వదిలించుకుని, మాతో పొత్తుకు బీజేపి పార్టీని ఒప్పించమని అడగటానికి వెళ్ళాడా ? నా సాక్షి, నా అభిమానులు తప్ప ఎవరూ చూడరు, మీ ఈనాడులో నాకు స్పేస్ ఇవ్వండి అని అడగటానికి వెళ్ళాడా? జగన్ గ్యాంగ్ ఇప్పుడు ఏమని సమాధానం చెప్తుంది ? అమ్మనా బూతులు తిట్టిన రామోజీ, ఇప్పుడు జగన్ కు రాజ గురువు అని చెప్తుందా ? లేక ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు అని చెప్తుందా... చూద్దాం...