మల్టీప్లెక్స్‌... ఏదైనా సినిమాకి వెళ్తే చాలు దోచేస్తారు... ఇది ఒక మాఫియా... ప్రజలను దోచేస్తారు... నియంత్రణ లేక, అడిగేవారు లేక చలరేగిపొతూ ఉంటారు... కనీసం మంచి నీళ్ళు కూడా లోపలకి తీసుకు వెళ్ళనివ్వరు... లోపల కొందాం అంటే MRP మీద, నాలుగు అయిదు రెట్లు ఎక్కువ అమ్ముతారు.. ఏదైనా తిందాం అంటే, కనీసం 250 రూపాయలు పెట్టాలి... అయితే ఇప్పుడు ఈ దోపిడీకి చెక్ పెట్టనుంది ప్రభుత్వం... పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీల్లో, ఈ విచ్చల విడి దోపిడీ గుర్తించారు...పరిస్థితిని నియంత్రణలోకి తేవాలని, మాల్స్‌లో జరుగుతున్న దోపిడీ అరికట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు...

multiplex 23102017 2

దీంతో కృష్ణా జల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెంటనే ఆదేశాలు జారీ చేశారు...వెంటనే జాయింట్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో మాట్లాడుతూ నగరంలోని మల్టీప్లెక్స్‌ నిర్వాహకులతో అధిక ధరల నియంత్రణపై సమావేశం ఏర్పాటు చేసి గట్టిగా హెచ్చరికలు చేయమని ఆదేశించారు... నగర ఆర్డీవో హరీష్‌, తహసీల్దార్‌ ఆర్‌.శివరావులతో కూడిన బృందాలు మల్టీప్లెక్స్‌ల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నాయి... ప్రజల నుంచి ఈ దోపిడీ పై ఫిర్యాదులు వస్తే, ఆ మల్టీప్లెక్స్‌ పై భారీ జరిమానాలు విధించనున్నారు. రెండోసారీ ఫిర్యాదు వస్తే ఏకంగా లైసెన్స్‌లనే రద్దు చేస్తారు.

multiplex 23102017 3

అంతే కాదు, బయటి నుంచి వాటర్‌, ఫుడ్‌ వంటివి లోపలికి తప్పనిసరిగా అనుమతించాలి. మార్కెట్‌లో వాటర్‌ బాటిల్స్‌, కూల్‌ డ్రింక్స్‌, ఇతర పానీయాల ధరలు ఎలా ఉంటాయో, ఆదే విధంగా మాల్స్‌లో కూడా ఉండాలి. కాంబో పేరుతో సందర్శకులను బలవంతంగా దోపిడీ చేసే విధానాన్ని కూడా మానుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ ఇవాల్టి నుంచి (సోమవారం నుంచి), అమలులోకి రానున్నాయి... ప్రభుత్వం, అధికారాలు ఎంత వరకు, ఈ దోపీడి అరికట్టగలరో చూద్దాం... ప్రజలు కూడా, ఇక ఫిర్యాదులు చెయ్యాలి... అప్పుడే అధికారులు కూడా చర్యలు తీసుకోగలరు... ఇప్పటికైనా ఈ మల్టీప్లెక్స్‌ దోపిడీకి చెక్ పడుతుంది అని ఆశిద్దాం...

అది ప్రపంచంలోనే ఒక పెద్ద ఎయిర్ లైన్స్ కార్యాలయం... ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్... దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడకి చేరుకొని వారితో సమావేశం అయ్యారు... నిజానికి, దుబాయ్ షేక్ లు,ఏ ఎవర్నీ అంత తేలికగా పొగడరు... చివరకి అమెరికాను కూడా లెక్క చెయ్యరు... అందునా ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లాంటి అతి పెద్ద ఎయిర్ లైన్స్ కలిగినవారు అయితే, వారి పని వాళ్ళు చూసుకుని, వెళ్ళిపోతారు... స్ట్రిక్ట్ గా బిజినెస్ కు పరిమితమై మీటింగ్ ఉంటుంది... అందునా మన వైపు నుంచి వెళ్లి, వాళ్ళని పెట్టుబడులు పెట్టమని అడిగినప్పుడు సహజంగా వాళ్ళు కొంచెం బెట్టుగా ఉంటారు... కాని ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో వేరు... ఆయన గ్లోబల్ లీడర్ అనటానికి ఇది ఒక ఉదాహరణ...

cbn emirates 23102017 2

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంచార్జ్ అద్నాన్ ఖాజిమ్, ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్ అల్ ఘయిత్ లతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా, ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇంచార్జ్ అద్నాన్ ఖాజిమ్ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎమిరేట్స్ ను మొదటిసారి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎంతో చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. ఒక పని తలపెడితే చంద్రబాబు కార్యదీక్ష ఎటువంటిదో తమకు ఇంకా జ్ఞాపకం ఉందన్నారు. ఇప్పటికీ చంద్రబాబులో అదే ఉత్సాహాన్ని చూస్తున్నామని ప్రశంసించారు. ఆ సందర్భంలో, అక్కడే ఉన్న ఇతర ప్రతినిధులు, చంద్రబాబుని అలా పొగుడుతుంటే షాక్ అయ్యారు... చంద్రబాబు గురించి తెలీని కొందరు, ఆయన సమర్ధత గురించి అరా తీసారు... మా బాస్ ఒక రాజకీయ నాయకుడుని, ఇలా పొగడటం ఎప్పుడూ చూడలేదు అంటున్నారు...

cbn emirates 23102017 3

ఆంధ్రప్రదేశ్‌ను ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్‌గా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమిరేట్స్ విమానయాన సంస్థలకు సూచించారు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్సు, రిపేర్, ఓవర్ హల్ సదుపాయాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మధ్య ప్రాచ్య, దక్షిణాసియాలకు మధ్యలో ఉందని చంద్రబాబు చెప్పారు. అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలను దుబాయ్ కి అనుసంధానం చేయవచ్చని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎమిరేట్స్ హబ్‌గా తీర్చిదిద్దటం ద్వారా ఉభయ దేశాల స్నేహబంధం మరింత బలపడుతుందని చంద్రబాబు అన్నారు. తమకు ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్స్, పోర్ట్స్ ల ప్రతినిధుల బృందంతో ఒక టాస్క్ ఫోర్స్ ఉందని, ఇరువురం సంయుక్తంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని పని చేద్దామని ముఖ్యమంత్రి కి ఫ్లై దుబాయ్ సీఈఓ ఘయిత్ ప్రతిపాదించారు.

వాళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యేలు... నిత్యం ప్రజలు వారిదగ్గరకు వచ్చి కావలసిన పనులు చేసుకుంటూ ఉండేవారు... ఆ ఎమ్మెల్యేలు కూడా, వారికి చేతనైన సహాయం చేస్తూ, ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేసేవారు.. మరి కొంత మంది ఎమ్మెల్యేలు దగ్గర పనులు అవ్వక, వారికి కావాల్సిన డబ్బులు ఇవ్వలేక, కొంత మంది ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి... ఏదైతేనేమి అధికార దర్పం చూపిస్తూ, రేషన్‌కార్డులు.. పెన్షన్‌లు.. భూ రికార్డులలో తప్పులు సరిచయటం లాంటి పనులు చేపించే ఎమ్మెల్యేలు, ఇప్పుడు చంద్రబాబు చేసిన ఒక పని వల్ల, విచిత్ర పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. చంద్రబాబు ఇంత పని చేస్తాడు అనుకోలేదు అంటూ బాధపడుతున్నారు ఎమ్మెల్యేలు...

cbn 1100 22102017 2

ప్రజా సమస్యల తక్షిణ పరిష్కారానికి, అలాగే ఎవరైనా లంచం అడిగినా ఫిర్యాదు చెయ్యటానికి, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవటానికి, చంద్రబాబు 1100 అనే నంబర్‌తో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు.. ప్రజలు ఏ సమస్య అయినా, వెంటనే ఫోన్‌ చేసి చెబితే సమస్య పరిష్కారం అయిపోతుంది... ఈ 1100 కాల్‌సెంటర్‌, ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతూ ఉండటం, సమస్యలు పరిష్కారం అవుతున్న తీరు... అవినీతి సొమ్మును కాల్‌సెంటర్‌ కక్కిస్తున్న వైనంతో ప్రజల్లో కూడా భరోసా ఏర్పడింది... కొంతమంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా అసలు కాల్‌సెంటర్‌ ద్వారా పనులు అవుతున్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సమస్యలు పరిష్కారం కావడంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

cbn 1100 22102017 3

అయితే ఈ కాల్ సెంటర్ వచ్చిన దగ్గర నుంచి, ప్రజలు ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళటం మానేసారు... ఇది వరకు ఎమ్మెల్యేల దగ్గర, ద్వితీయ శ్రేణి నేతల వద్దకు వెళ్లి పనులు చేపించుకునే వారు. ప్రస్తుతం ప్రతి సమస్యను కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి పరిష్కరించుకుంటున్నారని.. తమ దగ్గరకు ఎవరూ రావడం లేదని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని పనులు కాల్‌సెంటరే చేస్తే ఇక తాము ఎందుకని మరో ఎమ్మెల్యే ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్యాష్‌బోర్డుతో ఈ కాల్‌సెంటర్‌ కనెక్ట్‌ అయి ఉండటంతో, ఎమ్మెల్యేలు కూడా ఏమి అనలేని పరిస్థితి... ఆ ఎమ్మెల్యేల బాధ పక్కన పడితే, చంద్రబాబు చేసిన ఈ పని వల్ల, సామాన్య ప్రజలు అయితే, చాలా సంతోషంగా ఉన్నారు... ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా, పనులు జరుగుతున్నందుకు సంతోషిస్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పని తీరులో, ఈ దఫా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది... వయసుతో వచ్చే మార్పు కావచ్చు, ఆయన పాదయాత్ర అనుభవాలు కావచ్చు, కష్టం అని ఎవరు వచ్చినా, సహాయం చేసి పంపిస్తున్నారు చంద్రబాబు... అంతే కాదు, వారి యోగక్షేమాలు కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు... ఎప్పుడో చేసిన సాయం కూడా గుర్తు తెచ్చుకుని, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అడిగి తెలుసుకుంటున్నారు... నిజానికి చంద్రబాబు ఏది తొందరగా మర్చిపోరు... అన్నీ గుర్తు ఉంటాయి ఆయనకు... పార్టీలో కూడా, గ్రామ స్థాయి కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలిచే అంట జ్ఞాపకశక్తి ఆయనకు ఉంటుంది... ఇలాంటి అనుభవమే, ఇప్పుడు మంత్రి నక్కా ఆనందబాబుకి ఎదురైంది.. స్వయానా అయానే అనుభూతి పొందటంతో అవాక్కయారు మంత్రి...

nakka ananda babu 2210207 2

గుంటూరు జిల్లా, చుండూరుకు చెందిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్‌ గుదేటి బ్రహ్మారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆర్ధిక పరిస్థితి అంతఅంత మాత్రమే కావటంతో, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం అర్జీ పెట్టుకున్నారు. మంత్రి నక్కా ఆనంద బాబు నియోజకవర్గం కావటంతో, ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరకు ఈ విషయం కొన్ని రోజుల ముందు తీసుకెళ్ళారు... అయితే, కొన్ని సాంకేతిక కారణాలతో ముఖ్యమంత్రి ఆమోదించటం లేట్ అయ్యింది... ఇది ఇలా ఉండాగానే, ముఖ్యమంత్రి పది రోజుల విదేశీ పర్యటన నిమిత్తం, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే సమయంలో, అక్కడే ఉన్న మంత్రి నక్కా ఆనంద బాబు, ముఖ్యమంత్రికి వీడ్కోలు పలకటానికి వచ్చారు... 

nakka ananda babu 2210207 3

ఆ సందర్బంలో, విదేశాలకు వెళ్ళే ముందే, అనుకోకుండా పోలవరం పనుల నిమిత్తం, నాగపూర్ పర్యటన పెట్టుకున్న ముఖ్యమంత్రి చలా హడావిడిగా ఉన్నారు.. అయినా సరే, మంత్రి అడిగిన సాయం గుర్తుకువచ్చి, ఆ బాధితుడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.. ఇంకా పరిస్థితి అలాగే ఉందని తెలుసుకుని, రిపోర్ట్ లు అన్నీ పరిశీలించి, వెంటనే రూ.8 లక్షలు వైద్య ఖర్చుల కోసం విడుదల చెయ్యాలని ఆదేశాలిచ్చారు. 10 రోజుల దాకా రాను అని, ఈ లోప ఆ బాధితుడికి వైద్యం లేట్ అయితే ఇబ్బంది అని, చంద్రబాబు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు... చంద్రబాబు ఇంత హడావిడిలో కూడా, ఒక సామాన్య ప్రజలు గురించి పట్టించుకుని, వెంటనే సమస్య పరిష్కారం చెయ్యటంతో, మంత్రి నక్కా ఆనంద బాబు ఆశ్చర్యపోయారు.. అంతే కాదు, తెల్లారే సరికి, 8 లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్ రెడీ అయిపోయింది. మంత్రి, ఆ చెక్కును బ్రహ్మారెడ్డి కుటుంబ సభ్యులకు అందిస్తూ సీఎం పని తీరును వారికి వివరించారు.

Advertisements

Latest Articles

Most Read