ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, అంటే ఈ రాష్ట్రంలో తెలీనివారు ఉండరు... ఈ రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఒకరు... శాసనసభాపతిగా, ఇటు నియోజకవర్గ ఎమ్మల్యేగా, రెండు పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు... కోడెల రాజకీయంగానే కాక, అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ, సమాజానికి తనదైన సేవలు అందిస్తూ వస్తున్నారు...
ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఎదో ఒక సామాజిక సేవ చెయ్యటం కోడెల ఆనవాయితీ. క్రిందటి ఏడాది, పుట్టినరోజు సందర్భంగా 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి అప్పుడుకూడా ఒక చరిత్ర సృష్టించారు. ఈ సంవత్సరం కూడా, తన పుట్టినరోజు సందర్భంగా, మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా, నరసరావుపేటలో మే 2న పదివేల మంది అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించారు.
అయితే, ఇప్పుడు కోడెల చేస్తున్న మరో మంచి పని, ప్రజల మన్ననలు అందుకుంటుంది... కార్తీకమాస వన సమారాధన అంటే, కులాల వారీగా చేసుకునే కార్యక్రమం అనే ముద్ర అందరిలోనూ ఉంది... కమ్మ అని, రెడ్డి అని, కాపు అని, ఇలా ఎవరకి వారు, కులాల వారీగా విడిపోయి, చేసుకుంటూ వస్తున్నారు... ఈ ట్రెండ్ కు భిన్నంగా, సమాజంలో మార్పు కోసం, మనుషుల్లో నాటుకుపోయిన కుల జాడ్యాన్ని చెరిపేస్తూ, కోడెల కులమతాలకి అతీతంగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గునే విధంగా, అక్టోబర్ 22 ఆదివారం నాడు ,శరభయ్యగ్రౌండ్స్ వేదికగా, కార్తీకమాస వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుల,మత వర్గాల భావనకు దూరంగా నవసమాజ నిర్మాణమే జీవిత లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిత్యం శ్రమించి అసెంబ్లీ సభాపతి కోడెల ఆధ్వర్యంలో ఆనందంగా ఈ కార్తీక వనమహోత్సవంలో పాల్గొని తామంతా ఒకటే అని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.