ఐఎఎస్ రత్నప్రభ... రత్నప్రభ గారు, ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి... కర్ణాటకతో పాడు, ఇతర కేంద్రీయ సర్వీస్ లలోను మంచి పేరు సంపాదించుకున్నారు .. నిజాయితీపరురాలిగ కూడా పేరుండేది .... కాని ఆమె దురదృష్టం, వైఎస్ జగన్, రాజశేఖర్ రెడ్డి రూపంలో వచ్చింది... డిప్యూటేషన్ పై ఏ ముహూర్తాన ఆంధ్ర కి వచ్చిందో ... రాజశేఖర్ రెడ్డి దోపిడీ హయాంలో ఇందుటెక్ జోన్ విషయంలో రాజశేఖర్ రెడ్డి నిర్ణయానికి తలొగ్గి, కేబినెట్ పాస్ చేసిందని దానికి అంగీకరించంది.. ఆమె నిబంధనలు విరుద్ధంగా నడవలేదు.. కాని, అప్పటి ప్రభుత్వం చెప్పిన దానికి తలూపడంతో... జగన్ తో పాటు సిబిఐ కోర్ట్ చుట్టూ తిరగవలసి వచ్చింది...

ఒకానొక సందర్భంలో, కోర్ట్ లో జగన్ ఎదురు పడినప్పుడు, జగన్ ని దుమ్ము లేపింది... అంతా మీ నాన్నే చేసారు... నువ్వు చెప్పినట్టు ఆడారు... మేము ఇలా కోర్ట్ లు చుట్టు, తిరిగితే మా పరువు మర్యాదలు ఏం కావాలి, ఎక్కడకెల్లినా తల ఎత్తుకోలేక పోతున్నాం.. ఇంతకాలం మాపైన మచ్చపడలేదు .నిజాయితీగా బతికాం .. మీ కారణంగా మేమందరం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.. నీ వల్ల అందరం నరకం అనుభవిస్తున్నారని దుమ్మెత్తి పోశారు...

అయితే రత్నప్రభ కోర్ట్ లో పోరాడారు... నా పాత్రలేదు, అంతా అప్పటి క్యాబినెట్ ముఖ్యమంత్రి చేసిన కుట్రలే అని కోర్ట్ కి చెప్పారు... 2014లో, అన్నీ విన్న కోర్ట్, రత్నప్రభ పాత్రలేదు అని తేల్చి, ఇందూ టెక్‌లో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు అని స్పష్టం చేసింది హైకోర్టు.... దీంతో, ఆమెకు జగన్ అక్రమాస్తుల కేసు నుంచి విముక్తి లభించింది... జగన్ మాత్రం తన అక్రమాస్తుల కేసులో ఇంకా ఉన్నాడు... ప్రతి శుక్రువారం కోర్ట్ కి వెళ్తున్నాడు...

అయితే రత్నప్రభ, 2014లో మళ్ళీ సర్వీస్ లో చేరారు... రాజశేఖర్ రెడ్డి హయంలో తాను పని చేసిన కాలం, ఒక పీడా కలగా మర్చిపోయి, మళ్ళీ సర్వీస్ ప్రారంభించి, తన సర్వీస్ లో మంచి పేరు తెచ్చుకున్నారు.. ఆవిడ పని తీరుకి మెచ్చి, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆమెను, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చీఫ్‌ సెక్రటరీ)గా నియమించనుంది. హైదరాబాద్‌కు చెందిన రత్నప్రభ 1981 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. 2016 మే నుంచి ఆమె కర్ణాటక అదనపు ముఖ్యకార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక వాణిజ్య పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత కర్ణాటక చీఫ్‌ సెక్రటరీ సుభా్‌షచంద్ర కుంటియా ఈనెల 21న పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆ స్థానంలో రత్నప్రభ నియామకం జరగనుంది.

ఒకప్పుడు, జగన్ స్వార్ధానికి బలైన ఐఎఎస్ అధికారిణి... అవన్నీ తట్టుకుని, ఇప్పుడు ఏకంగా, కర్ణాటక లాంటి పెద్ద రాష్ట్రానికి చీఫ్‌ సెక్రటరీ అవుతున్నారు...

పనికిమాలిన దర్శకుడు, ఒక పనికిమాలిన రాజకీయవేత్త డబ్బులుతో, తెలుగు ప్రజలు మాహనుభావుడిగా కొలుచుకునే అన్న ఎన్టీఆర్ ను కించ పరుస్తూ, తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్‌ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు...

మంగళవారం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతలతో మాట్లాడుతూ, ఈ సినిమా విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, చంద్రబాబు స్పందిస్తూ, ఎన్టీఆర్‌ బయోపిక్‌పై టీడీపీ శ్రేణులు అతిగా స్పందించవద్దు అన్నారు... వైసీపీ నేతలు, స్వయానా జగన్ బావ, రామ్‌గోపాల్ వర్మను కలవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.శ్రేణులకు చెప్పారు. వైసీపీ నేతలతో కలిసి వర్మ సినిమా ఎందుకు తీస్తున్నాడో ప్రజలకు కూడా తెలుసు అని అన్నారు.

ఎన్టీఆర్ కారణజన్ముడు అని, సినిమా, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను తెలుగుజాతి మరువదు అని కీర్తించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ సినిమా పై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆహార ఉత్పత్తిలో అగ్రపథాన ఉన్న భారతదేశం పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోవడం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పెద్దఎత్తున ఉద్యాన పంటలు సాగవుతున్నా తగినంత సంఖ్యలో ఆహారశుద్ధి పరిశ్రమలు లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. ఆహారశుద్ధి రంగంలో ప్రసిద్ధి చెందిన 23 సంస్థలతో ఎంవోసీ కుదుర్చుకుని ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో కలిసి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ 23 ప్రముఖ సంస్థలు, 110 మంది పెట్టుబడిదారులతో సోమవారం సాయంత్రం ఎంఓసీ (మెమోరాండం ఆఫ్ కో-ఆపరేషన్) కుదుర్చుకుంది.

గత పాలకులు రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినా గడచిన మూడేళ్లుగా అత్యుత్తమ విధానాలను అనుసరించి ఈ రంగంలో ప్రగతి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సదస్సులో గుర్తుచేశారు. సూక్ష్మపోషకాలు, భూసార పరీక్షలు, సాయిల్ హెల్త్ కార్డులతో రాష్ట్రంలో వ్యవసాయదారులకు ఊతం అందించామని, ఈ రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రోత్సహించేందుకు మిలిందాగేట్స్ ఫౌండేషన్ ముందుకొచ్చిందని చెప్పారు. వ్యవసాయరంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆధునిక సేద్యపు విధానాలు, ప్రపంచంలో అమలులో ఉన్న అత్యుత్తమ పద్ధతులను ప్రవేశపెట్టామని చెప్పారు. ముఖ్యంగా నవీన సాంకేతికతను, యంత్ర పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహారపు అలవాట్లలో అనూహ్య మార్పులు వచ్చాయని అంటూ, వాటికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు జరగాలని ముఖ్యమంత్రి చెప్పారు. దానికోసమే ఏపీలో పెద్దఎత్తున ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలలో సాగు చేయడమే లక్ష్యంగా తీసుకున్నామన్నారు. ఆహారశుద్ధి పరిశ్రమ రాష్ట్రంలో మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిలీనియం మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం తగు ప్రయత్నాలు చేస్తోందని ప్రస్తావించారు. దేశంలో ఆహారశుద్ధి రంగానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఉత్తమ నమూనాగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

‘ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్’ పేరుతో సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రూ.855 కోట్ల విలువైన ఎంఓసీలు జరిగాయి. ఇవి అమలులోకి వస్తే మొత్తం 9477 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఆహార శుద్ధి ప్రక్రియలో, పంట నష్టాల తగ్గుదల విధానాల అమలులో, నవీన ఆహార పదార్ధాల అభివృద్ధిలో ఈ 23 సంస్థలకు మంచి అనుభవం ఉండటం విశేషం.

విశాఖలో జరిగిన గత భాగస్వామ్య సదస్సుల్లో ఆహార శుద్ధి విభాగం మొత్తం 245 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిల్లో ఈ ఏడాది 140 యూనిట్లను ఇప్పటికే ఏర్పాటుచేశారు. రూ.1600 కోట్ల విలువైన ఈ పారిశ్రామిక యూనిట్ల స్థాపనతో 25,000 ఉద్యోగావకాశాలు లభించాయి. ఇప్పుడు కుదిరిన ఎంవోసీల ద్వారా రానున్న కాలంలో ఈ రంగంలో అభివృద్ధి ఊపందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.

వృద్ధి పై దృష్టి నిలపడమే కాకుండా వ్యయ నియంత్రణలో పట్టు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. జీతభత్యాలకే సరిపోయేలా కొన్నిశాఖలలో వృద్ధి మందగమనంలో ఉండటం ఇబ్బందికరమని అన్నారు. ఖర్చులను అదుపుచేయడం అన్నింటికంటే పెద్ద కసరత్తు అని వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి ఆదాయాన్ని ఆర్జించేశాఖలలో పురోగతిని సమీక్షించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించాలని, అదే సమయంలో వివిధ శాఖలలో ఆదాయం సక్రమంగా లేక ఖర్చులు పెరిగిపోవడం మంచి సంకేతం కాదని, తక్షణం దానిపై నియంత్రణ సాధించాలని చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకు సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం సమీక్షించారు.

రాష్ట్ర ఆదాయ ఆర్జిత శాఖలు 13.26 శాతం వృద్ధితో రూ. 25,834 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వృద్ధి సాధించిన శాఖలలో 140.63 శాతం వృద్ధితో రూ.64.19 కోట్ల ఆదాయంతో అటవీశాఖ అగ్రస్థానంలో ఉంది. ఐతే, ఆదాయపరంగా చూస్తే మిగిలిన అన్ని శాఖలతో పోల్చితే రూ. 64.19 కోట్ల ఆదాయంతో ఈ శాఖ చివరిస్థానంలో నిలిచింది. అత్యధిక ఆదాయం ఆర్జించిన శాఖలలో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ రూ. 18,090.84 కోట్ల ఆదాయం (9.03 శాతం వృద్ధి)తో ముందువరుసలో ఉంది. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో ఆదాయ వృద్ధి 1.48 శాతం తగ్గింది. ఈ శాఖ సెప్టెంబరు వరకు రూ.2,024 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ల్యాండ్ రెవిన్యూ శాఖలో వృద్ధి తిరోగమనంలో ఉంది. వృద్ధిలో ఈ శాఖ 24.08 శాతం వెనకబడివుంది. ఆదాయం రూ. 99.76 కోట్లు ఉంది. భూగర్భ గనుల శాఖ రూ. 862 కోట్ల ఆదాయంతో, 16 శాతం వృద్ధి సాధించింది. రవాణా శాఖలో వృద్ది 27.10 శాతంగా వుంది. రూ. 1,532.10 కోట్ల ఆదాయాన్ని సాధించింది.

రాష్ట్రంలో ఈ సెప్టెంబరు వరకు ఆదాయ ఆర్జనలో కృష్ణాజిల్లా రూ. 8,471.87 కోట్ల ఆదాయంతో తొలిస్థానంలో ఉంది. రూ. 6,842.35 కోట్ల ఆదాయంతో విశాఖపట్నం జిల్లా రెండవస్థానంలో నిలిచింది. రూ. 364.46 కోట్ల ఆదాయంతో విజయనగరం జిల్లా చివరిస్థానంలో ఉంది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలను అరికట్టి ప్రజలకు మేలు చేయాలని, ముఖ్యంగా ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేటు భూమి అనేది స్పష్టంగా తెలిసేలా సమగ్ర వివరాలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. గంజాయి నిర్మూలనకు స్పష్టమైన కార్య ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నెలరోజులలో దీనిపై ఫలితాలు సాధించి చూపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీఎస్‌టీ అమలు తరువాత రాష్ట్రంలో 81782 మంది డీలర్లు కొత్తగా నమోదయ్యారని అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలో డీలర్ల సంఖ్య 2,92,000కు చేరిందని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read