ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికాలోని అయోవా నగరంలో జరిగిన వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ సదస్సుకు హాజరయ్యారు. మన దేశం నుంచి హాజరయిన ఏకైక ప్రతినిధి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రికి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుని సదస్సుకి ఇంట్రాడ్యుస్ చేస్తూ, "చంద్రబాబు గారు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు... ఇక్కడ ఉన్న గెస్ట్స్ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఇవాళ వారి దేశంలో దీపావళి పండుగ, అక్కడ పండుగ జరుపుకోకుండా ఇక్కడ దాకా వచ్చారు... చంద్రబాబు గారు మీరు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ" ఆ ప్రతినిధి అన్నారు.

america 20102017 1 2

అయోవా యూనివర్సిటీ నిర్వహిస్తున్న వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ సదస్సులో ముఖ్య వక్తగా చంద్రబాబు పాల్గున్నారు. నదులు అనుసంధానం, ఇరిగేషన్ ప్రాజెక్ట్లు, వ్యవసాయంలో ఆధునికత, ఇలా అన్ని విషయాల పై చంద్రబాబు ప్రసంగించారు. వ్యవసాయరంగానికి సంబంధించి వివిధ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అయోవా యూనివర్సిటీకి కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

america 20102017 1 3

1987 నుంచి వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ ప్రముఖులకు అవార్డులను అందజేస్తున్నది. వ్యవసాయరంగంలో, ఆహార పంపిణీలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ఫౌండేషన్‌ అందజేస్తోంది. అయోవా విశ్వవిద్యాలయ ప్రతినిధి దిలీప్‌కుమార్‌ స్వయంగా మే నెలలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అప్పుడే ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలియజేశారు.

మన రాష్ట్రంలో, మన ముఖ్యమంత్రిని కొంత మంది కనీస స్థాయి, అర్హత లేని వాళ్ళు, ఆయన్ను ఎలా విమర్శలు చేస్తున్నారో చూస్తున్నాం... ఒకడు ఇంగ్లీష్ రాదు అంటాడు.. ఇంకొకడు, నీ మొఖం చూసి ఎవడు పెట్టుబడులు పెడతాడు అంటాడు... కూలికి, కాంట్రాక్టుకి పని చేసే, పైడ్ బ్యాచ్ అయితే, ఆయన్ను ఎలా అవమానపరుస్తూ, సోషల్ మీడియాలో హేళన చేస్తున్నారో చూస్తున్నాం... కాని ఆయన సమర్ధత ఏంటో తెలిసిన వారు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు.. అందుకే ఆయన మంది రోజు రోజుకి నమ్మకం రెట్టింపు అవుతుంది... విదేశాల్లో అయితే చంద్రబాబుకి ఇచ్చే గౌరవం చెప్పనవసరం లేదు... ఎన్నో దేశాలు, కార్పొరేట్ దిగ్గజాలకు ఆయన అంటే అభిమానం... ఎన్నో సందర్భాల్లో చూసాం... అలాంటి సంఘటన ఇవాళ అమెరికాలో మరోసారి జరిగింది.

america 20102017 2

అమెరికాలోని అయోవా నగరంలో జరిగిన వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబుకి యా వేదిక మీద ఘన స్వాగతం లభించింది. అక్కడ చంద్రబాబు గురించి చెప్తూ, మీకు దీపావళి పండుగ అయినా, ఇక్కడ దాక వచ్చి, మా కోసం మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ముఖ్యమంత్రిని అభినందించారు. అయోవా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ సదస్సులో ముఖ్య వక్తగా చంద్రబాబు పాల్గున్నారు. నదులు అనుసంధానం, ఇరిగేషన్ ప్రాజెక్ట్లు, వ్యవసాయంలో ఆధునికత, ఇలా అన్ని విషయాల పై చంద్రబాబు ప్రసంగించారు. వ్యవసాయరంగానికి సంబంధించి వివిధ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అయోవా యూనివర్సిటీకి కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

america 20102017 3

1987 నుంచి వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ ప్రముఖులకు అవార్డులను అందజేస్తున్నది. వ్యవసాయరంగంలో, ఆహార పంపిణీలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ఫౌండేషన్‌ అందజేస్తోంది. అయోవా విశ్వవిద్యాలయ ప్రతినిధి దిలీప్‌కుమార్‌ స్వయంగా మే నెలలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అప్పుడే ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలియజేశారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పనున్న మెగా సీడ్ పార్కు కార్యకలాపాలలో తమకు సహకరించాలని ‘పయనీర్’ సంస్థ శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. సీడ్ పార్కులో పయనీర్ సంస్థను భాగస్వామిగా చేసే అంశంపై సమన్వయం చేయాల్సిందిగా ఐయోవా అధికారి దిలీప్‌కు బాధ్యతలను అప్పగించారు. దిగుబడులను పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ఉమ్మడి లక్ష్యమని, ఈ దిశగా పరస్పరం సహకరించుకుని ఇరు ప్రాంతాల రైతాంగ శ్రేయస్సుకు పాటుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన రెండోరోజు ఐయోవాలోని జాన్స్టన్ లో ఉన్న ‘పయనీర్’ సంస్థ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ సందర్శనతో ప్రారంభమైంది. ప్రామాణిక విత్తనాల ఉత్పత్తి, మార్కెటింగ్‌లో ప్రాచుర్యం గడించి, 90 దేశాలకు ఉత్పత్తులను పంపిణీ చేస్తున్న ఈ సంస్థ విశ్వకేంద్రంలోని ఆవిష్కరణల విభాగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి శాస్త్రవేత్తలతో సవివరింగా మాట్లాడారు. ఉత్పత్తుల విశేషాలను, విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు.తమ పరిశోధక ప్రాజెక్టుల ప్రత్యేకతలను పయనీర్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ బ్రాడ్ లాన్స్ ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.

cbn harvestor 20102017 2

ఐయోవాలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి పర్యటించ హార్వెస్టర్ ను స్వయంగా నడిపారు. విత్తనాలు, వాతావరణం, నేల స్వభావం, యాజమాన్య పద్ధతులు తదితర అంశాలు, ఉత్పాదకత పెంపుపై అవి ఎటువంటి ప్రభావం చూపుతాయో ముఖ్యమంత్రి చంద్రబాబు కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలో గరిష్టస్థాయిలో వ్యవసాయ దిగుబడుల పెంపుదల కోసం ఆయా అంశాలలో అవలంభించిన అన్ని పద్ధతులను అందిపుచ్చుకునే అవకాశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. తొంభై సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో తాము సముపార్జించిన అనుభవాన్ని పయనీర్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తాము గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో విస్తృతంగా పనిచేశామని వివరించిన శాస్త్రవేత్తలు. వ్యవసాయ పరిశోధన, మొక్కల జన్యుశాస్త్రం, పరిశోధనా రంగాలలో తమ అధ్యయనాలపై పయనీర్ శాస్త్రవేత్తలు చంద్రబాబుకు వివరించారు.

cbn harvestor 20102017 3

అధిక నాణ్యమైన మొక్కజొన్న, సోయాబీన్స్, జొన్న, ప్రొద్దుతిరుగుడు, అల్ఫల్ఫా (పశుగ్రాసం), కనోల (కెనాడాలో అభివృద్ధి చేసిన నూనెగింజలు), గోధుమ, బియ్యం, పత్తి, సజ్జలు (పెర్ల్ మిల్లెట్), ఆవపిండి తదితర విత్తనాలు, పశుగ్రాస మూలాలను అభివృద్ధి చేసి పంపిణీ చేస్తున్నట్టు ‘పయనీర్’ శాస్త్రవేత్తల బృందం ముఖ్యమంత్రికి వివరించింది. అక్కడి క్షేత్రాలలో అధునాతన సాంకేతికతను, యంత్ర పరికరాలతో నవీన సేద్యపు విధానాలను అనుసరిస్తున్న తీరును ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పయనీర్ సంస్థ పరిశోధనశాలను సందర్శించారు. మొక్క జన్యుకణంలోని అనువంశిక పదార్ధాన్ని (డీఎన్ఏ) విశ్లేషించే విధానం, జన్యువులను సవరించే పద్ధతులపై ముఖ్యమంత్రి బృందానికి శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ప్రక్రియలు నిర్వహించే తీరును, సంబంధిత పరికరాలపై సందేహాలకు సమాధానాలిచ్చారు. మొక్కల జన్యు అభివృద్ధి, విత్తనాలు, ఉత్పత్తుల సరఫరాదారుగా బహుళ ప్రాచుర్యం పొందిన సంస్థ పయనీర్. 1926 నుంచి ఐయోవా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘పయనీర్’ ఉత్పాదకత, లాభదాయకత, సుస్థిరత అంశాల్లో గణనీయ ఫలితాలు సాధించింది. రైతాంగ విశ్వాసాన్ని చూరగొన్న సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

ఇవాళ శుక్రువారం... ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి స్పెషల్ డే... ఎన్ని పనులు ఉన్నా, ఏ మూడ్ లో ఉన్నా, నాంపల్లి కోర్ట్ కి హాజరు కావాల్సిందే... ఆ క్రమంలో, ఇవాళ కూడా జగన్ నాంపల్లి కోర్ట్ కి బయలుదేరి వెళ్లారు... ఈ క్రమంలో, జగన్ అక్కడ తన దేవుడు ఇచ్చిన అన్నయ్య గాలి జనార్ధన రెడ్డి, తన వల్ల కేసులో ఇరుకున్న మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా హాజరయ్యారు...

jagan court 20102017 2

అదే సమయంలో అక్కడకి జగన్ కూడా రావటంతో, అందరూ ఎదురు పడ్డారు.. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జగన్ నవ్వుకుంటూ అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు... మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మాత్రం, జగన్ మొఖం వైపు కూడా చూడలేదు... జగన్ వల్ల, తనకు ఈ పరిస్థితి వచ్చింది అనే కోపంతో, అప్పటి నుంచి, ఆమెకు జగన్ అంటే అసహ్యం... కాని, మూడో వ్యక్తి జగన్ కు దేవుడు ఇచ్చిన అన్నయ్య గాలి జనార్ధన రెడ్డి మాత్రం, జగన్ దగ్గరకు వెళ్లి, చాలా సేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు... గాలి జనార్ధన రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసులో కోర్ట్ కి హాజరుకాగా, జగన్ తన అక్రమాస్థుల కేసులో కోర్ట్ కి హాజరయ్యారు...

jagan court 20102017 3

ఇంకో విషయం ఏమిటి అంటే, జగన్ కు ఇవాళ, పాదయత్ర పై క్లారిటీ రానుంది... పాదయాత్ర చేస్తున్నాని, ఆరు నెలలు పాటు, ప్రతి శుక్రువారం కోర్ట్ కి రాను అని, జగన్ సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేశారు... అయితే పోయిన వారం కోర్ట్, సిబిఐ తరుపు వాదనలు విన్నది... ఆ సమయంలో, సిబిఐ జగన్ కు పర్మిషన్ ఇవ్వటానికి అసలు ఒప్పుకోలేదు... జగన్ కు బెయిల్ ఇచ్చిందే, ప్రతి శుక్రువారం కోర్ట్ కి రావాలి అనే షరతుతో అని, అదీను జగన్ కేసు తీవ్రత చాలా ఎక్కువ అని, ఇలాంటి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకూడదు అని సిబిఐ వాదించింది... ఆ పిటీషన్ తీర్పు, కోర్ట్ 20వ తారీఖుకి వాయదా వేసింది, అంటే ఇవాళ... ఆ ఆ పిటీషన్ మీద తీర్పు కోసం, జగన్ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read