చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం, కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి, వారిని ఆదుకుంటున్నారు... అయితే ఈ కార్పొరేషన్ చైర్మన్ లు, ఎండిలు వారి సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు...
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఐవైఆర్ కృష్ణా రావు ఉదంతం అందిరికీ తెలిసిందే... ఇప్పుడు తాజాగా, కాపు కార్పోరేషన్ ఎండీ అమరేంద్ర పై అవినీతి ఆరోపణలు రావటంతో, చంద్రబాబు వెంటనే ఆయన్ను తప్పించి, మాతృశాఖ పశుసంవర్థకశాఖకు బదిలీ చేస్తూ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.ఉదయలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
అవినీతి ఆరోపణల కారణంగా ఆయన్ను మాతృశాఖకు పంపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఎంతటి అవినీతి ఆరోపణలున్నా సాధారణంగా బదిలీ ఉత్తర్వుల్లో అవినీతి ఆరోపణలను కారణంగా చూపరు. కానీ అసాధారణంగా అమరేంద్ర బదిలీ ఉత్తర్వుల్లో అవినీతి ఆరోపణలను కారణంగా చూపడం ఆయన అవినీతి తీవ్రతను చాటుతోంది.
పేద కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తే, కాపు కార్పొరేషన్‌కు దిశానిర్దేశం చేస్తూ నిధులు సద్వినియోగమయ్యేలా చూడాల్సిన వ్యక్తే అవినీతి అక్రమార్కుడిగా మారటంతో అందరూ అవాక్కయ్యారు...
పట్టించిన బయోమెట్రిక్ :
రెండేళ్ళ నుంచి అవినీతి చేస్తున్నా, పక్కగా దొరక్క పోవటంతో, ప్రభుత్వం చర్యలు తీసుకోవటానికి ఆలోచిస్తూ వస్తుంది.. ఈయన ప్రభుత్వ అధికారి కావటంతో, అన్నీ పక్కాగా ఉంటేనే చర్యలుకు వీలు ఉంటుంది... అయితే, విద్యోన్నతి పథకం కింద పేద కాపు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు ఇన్స్టిట్యూట్లను ఎంపిక చేశారు. గ్రూప్స్, సివిల్స్, బ్యాంకింగ్, ఇతర పోటీ పరీక్షలకు వాటి ద్వారా కోచింగ్ ఇప్పిస్తున్నారు. అసలు అభ్యర్థులు లేకపోయినా బయోమెట్రిక్ హాజరులో అక్రమాలకు పాల్పడి నిధులు స్వాహా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అసలు కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోనివారి పేర్లను కూడా కోచింగ్ తీసుకుంటున్న వారి జాబితాలో చేర్చారు.
ఇటీవల బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉదయలక్ష్మి బాధ్యతలు చేపట్టిన అనంతరం కాపు కార్పొరేషన్ ద్వారా కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల జాబితాలోని కొందరికి ఫోన్ చేసి మాట్లాడారు. కోచింగ్ ఎలా ఉందని వారిని ఆరా తీయగా... తాము ఎలాంటి కోచింగ్ తీసుకోవడం లేదని సమాధానం రావడంతో ఆమె కంగుతిన్నారు.
దీంతో, ప్రభుత్వం, కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్ పై వేటు వేసి, ఎంక్వయిరీకి ఆదేశించింది...