అనగనగా ఒక దొంగ ఉన్నాడు... మామూలు దొంగ కాదు 420లు కూడా ఈ దొంగోడి కింద పనికిరారు... ఈ దొంగ ఒక ఘరానా మోసం చేశాడు... వింత ఏంటి అంటే, దొంగతనం చేసి, దొంగా దొంగా అని అరుస్తూ, ప్రజలని పిచ్చోళ్ళను చేద్దాం అనుకున్నాడు... కాని, ఈ దొంగోడి కేడి బుద్ధులు చూసి, జనాలు దొంగతనం చేసింది ఈ 420 గాడే అని గుర్తించి ఇరగోట్టారు...
పైన చెప్పిన కధ లాగే, మన రాష్ట్రంలో కూడా జరిగింది... రాష్ట్రంలో చేసే ప్రతి మంచి పనికి, అడ్డు పడే ప్రతిపక్షం ఉన్న సంగతి అందిరికీ తెలిసిందే... అయితే, చివరకి రెక్కలు ముక్కలు చేసుకుని, కూలి పని చేసే, నిరు పేదల నోటి కాడ కూడు లాగేసే ప్రతిపక్షం ఉంది అంటే, మన రాష్ట్ర దౌర్భాగ్యం అలాంటిది...
ట్విస్ట్ ఏంటి అంటే, వీళ్ళే ఉత్తరాలు రాసి, కేంద్రం నుంచి డబ్బులు రాకుండా ఆపి, మళ్ళీ వీరే వారి సొంత పత్రికలో, కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు అని, చంద్రబాబు వైఫ్యల్యం అంటూ రాసుకున్నారు.. ఇప్పుడు అర్ధమైందా మనం పైన చెప్పుకున్న కధ...
కేవలం రాజకీయం కోసం, ఉపాధి హామీ పధకంలో రావాల్సిన డబ్బులు ఆపేసింది ప్రతిపక్షం... అంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నా, పారదర్శకత పాటిస్తున్నా, ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నా ఇలాంటి పరిస్థితి తలెత్తడంపై రాష్ట్ర యంత్రాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది...
క్లిష్టమైన ప్రాంతాల్లో యంత్రాలతో పనులు చేయించేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. కొన్ని నిబందనలకు లోబడి ఉపాధి నిధుల కింద సిమెంటు రోడ్లు కూడా వేసేందుకు కేంద్ర ప్రభుత్వమే అనుమతించింది... అయినా సరే, ఉపాధి హామీ పధకంలో యంత్రాలు వాడుతున్నారు, మొత్తం డబ్బులు ఆపెయ్యండి అని, జగన్ తన ఎంపీల చేత, కేంద్రానికి ఉత్తరాలు రాసి, నిధులు నిలుపుదల చేయించాడు...
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేక పోయినా, కేంద్ర ఆలస్యం చెయ్యటంతో, తానే కొన్ని నిధులు విడుదల చేసింది... అయినా బాకీలు చాలా ఉండటంతో, అందరికీ డబ్బులు ఇవ్వలేకపోతుంది.. దీంతో కూలీల్లో హాహాకారాలు మొదలయ్యాయి... రోజుల తరబడి కష్టం చేసుకున్నా డబ్బులు రావట్లేదు అని, పిల్లకు తిండి కూడా పెట్టలేకపోతున్నాం అని, ఈ పాపం ఊరికే పోదు అని, జగన్ ని శాపనార్ధాలు పెడుతున్నారు... మీ రాజకీయాలు మీరు చూసుకోండి, మా లాంటి రెక్కాడితే కాని, డొక్కాడని వాళ్ళ మీద మీ క్షుద్ర రాజకీయాలు ఎందుకు, మా నోటి కాడ కూడి లాక్కున్నారు, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అంటూ, జగన్ పై నిప్పులు కక్కుతున్నారు, ఉపాధి హామీ కూలీలు...