ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ దేశవ్యాప్త గుర్తింపు పొందింది. దేశంలోనే అత్యున్నత దర్యాప్త సంస్థగా పేరొందిన సీబీఐ అంతర్గత సమావేశాల్లో అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారంలో ఏపీ ఏసీబీ వ్యవహరిస్తున్న తీరు పై ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం విజయవాడలో ఏసీబీ అధికారులతో భేటీ సందర్భంగా సీబీఐ దక్షిణ ప్రాంత జాయింట్ డైరెక్టర్ ఏవైవీ కృష్ణ వెల్లడించారు.

ఏపీ ఏసీబీ కేసుల పై వివరాలు సేకరించడంతో పాటు సీబీఐలో ఆ తరహా విధానాల అమలు పై అనేక సందర్భాల్లో చర్చించినట్లు ఆయనపేర్కొన్నారు. తరుచూ తమ ఉన్నత స్థాయి సమావేశాల్లో ఏపీ ఏసీబీ నిర్వహిస్తున్న పాత్ర పై చర్చిస్తున్నామని చెప్పడంతో ఏసీబీ అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సైతం ఏసీబీ నిర్వహిస్తున్న విధానాలను తీసుకొని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నా రు. అక్రమాస్తుల కేసుల్లో పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో సీబీఐ తరుపన సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయనపేర్కొన్నారు.

ఇటీవల రూ.వందల కోట్ల అక్రమ ఆస్తులతో పట్టుబడిన డాక్టర్ పాము పాండురంగారావు, రఘు, జగదీశ్వరరెడ్డి, ఎం.గంగాధర్ వంటి అధికారుల కేసుల్లో తాము దర్యాప్తు చేసిన విధానాన్ని సీబీఐ అధికారులకు వివరించారు.

అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చూపిస్తున్న చొరవ, ఏసీబీ కి అన్ని రకాలుగా సహకరించటం, ఎంత వరకైనా వెళ్ళాలి అని చెప్పటం, ఇవి కూడా ఏసీబీ అధికారులు, సీబీఐ అధికారులకు వివరించారు. 1100తో ప్రజలే నేరుగా ఫిర్యాదులు చేస్తున్న వైనాన్ని కూడా వివరించారు.

మన రాష్ట్రం పోలవరం ప్రాజెక్ట్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, తెలంగాణా రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం కోసం, ఎంత తపన పడుతున్నారో తెలిసిందే... అటు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ, ప్రతి వారం సమీక్ష చేస్తూ, ఇటు భూములు ఇచ్చిన రైతులను సంతృప్తి పరుస్తూ వస్తున్నారు...

తెలంగాణా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో, ప్రభుత్వం అందరినీ తప్పుదోవ పట్టిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి... ఏ అనుమతి లేకపోయినా, ఏకపక్షంగా ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు పెట్టారు... అయితే ఈ ప్రాజెక్ట్ విషయం పై గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళగా, ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ ఆపెయ్యమని స్టే ఇచ్చింది... అనుమతులు వచ్చే వరకు తట్టెడు మట్టి కూడా ఎత్తద్దు అని తీర్పు ఇచ్చింది....

ఈ విషయంలో ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అందరూ, చంద్రబాబు విజన్ ని మెచ్చుకుంటున్నారు.... పోలవరం అనేది ఒక మహా యజ్ఞం.. మనకు పూర్తి చెయ్యాలి అనే ఎంత చిత్తసుద్ధి ఉన్నా, దాన్ని ఆపేందుకు రాక్షసులు ప్రత్నిస్తూనే ఉంటారు... ఆ దిశగా జరిగిన కుట్రలు కూడా మనం చూసాం... ఒక్కసారి కేంద్రం కాని, గ్రీన్ ట్రిబ్యునల్ కాని ఏదన్న కారణం చూపించి, పోలవరం ఆపెయ్యమని ఆదేశాలు ఇస్తే, ఇక అంతే సంగతులు...

అందుకే చంద్రబాబు ముందు చూపుతో అలోచించి మూడు సంవత్సరాల క్రితమే పట్టిసీమ కట్టారు... పై నుంచి చుక్క నీరు లేకపోయినా, కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరం పచ్చగా చేశారు... కాళేశ్వరం ప్రాజెక్ట్ తీర్పు చూసిన అందరూ, చంద్రబాబు ముందు చూపుని మరోసారి ప్రశంసిస్తున్నారు...

సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పై ఆంధ్రప్రదేశ్ ఘనతను అంతర్జాతీయ కంపెనీలు గుర్తించాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పనిచేస్తూ అంతర్జాతీయ ఖ్యాతిపొందిన సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థలు ఆంధ్రప్రదేశ్ లోని సోలార్ పార్కుల పై ఆసక్తి చూపుతున్నాయి. సంప్రదాయేతర విద్యుదుత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్‌ఆర్డీసీ) కర్నూలులోని 1000 మెగావాట్ల సోలార్ పార్కుపై అధ్యయనానికి సిద్ధమైంది.

ఎన్‌ఆర్డీసీ డైరెక్టర్ జైస్వాల్ తన బృందంతో శుక్రవారం ఇంధన మంత్రి కళా వెంకట్రావును కలిశారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని సోలార్ హబ్‌గా మార్చే ఉద్దేశ్యతో ఉన్నారని మంత్రి కళా వెంకట్రావు ఎన్‌ఆర్డీసీ బృందానికి తెలిపారు. దీంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాలను ఐదు శాతం దిగువకు తగ్గించడమే లక్ష్యంగా మైక్రో గ్రిడ్ వ్యవస్థ నిర్మాణంపైనా సిఎం దృష్టి పెట్టారని వివరించారు. ఆ ప్రయోజనాలతో రైతులకు పగలే 7 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారన్నారు.

ఆంధ్రను దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో అగ్రగామిగా మార్చుతున్నట్లు మంత్రి ఆయనకు వివరించారు. మొత్తం 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుండడమే ఇందుకు తార్కాణమన్నారు. వీటిలో ఇప్పటికే కర్నూలులోని 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పూర్తయిందన్నారు. దీన్ని రికార్డు స్థాయిలో కేవలం 24 నెలల్లోనే నిర్మించామన్నారు. మిగిలిన సోలార్ పార్కుల్లో అనంతపురం జిల్లాలోని 1500 మెగావాట్ల అనంతపురం-2 అల్ట్రా మెగా సోలార్ ప్లాంటును కూడా త్వరలో పూర్తిచేస్తామన్నారు.

దీనిపై స్పందించిన జైస్వాల్ సమర్థ ఇంధన వినియోగం, ఇంధన పరిరక్షణ, సౌర, పవన విద్యుత్‌ను ప్రోత్సహించడంలో సిఎం చంద్రబాబు అమలు చేస్తున్న విధానాలు ప్రశంసనీయంగా ఉన్నాయన్నారు. కర్నూలు జిల్లాలో ఒకేచోట వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దదని, దీని తరువాతి స్థానంలో చైనాలోని లోంగ్యాగ్జియాలో మాత్రమే 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఉందని జైస్వాల్ అన్నారు.

పేదల కోసం కాన్సర్ చికిత్స చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. అత్యంత ఖరీదైన కాన్సర్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. ఒక్కసారి కాన్సర్ వ్యాధి వచ్చింది అంటే, ట్రీట్మెంట్ కోసం 4-5 లక్షలు ఖర్చు అవుతుంది... అంత డబ్బు పెట్టుకోలేక, చాలా మంది పేదలు అలాగే ఆ బాధ అనుభవిస్తున్నారు... ఇవన్నీ చుసిన చంద్రబాబు ప్రభుత్వం పేదల కోసం, రాష్ట్ర వ్యాప్తంగా కాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కర్నూలులో రాష్ట్ర స్థాయి పెద్దాసుపత్రి, నెలూరులో ప్రాంతీయ ఆసుపత్రి రాబోతున్నాయి. తిరుపతిలో కాన్సర్ ఆసుపత్రి.. పరిశోధన సంస్థ టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్నాయి. అలాగే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో నాట్కో సహకారంతో కాన్సర్ వైద్య సేవల భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతు న్నాయి.

తిరుపతిలో ఇప్పటికే ఉన్న స్విమ్స్ రుయా, బర్డ్ ఆసుపత్రుల తరహాలోనే కాన్సర్ ఆసుపత్రి రాబోతోంది. టాటా ట్రస్ట్ ఆధ్వ ర్యంలో అలిమేలు చారిటబుల్ ఫౌండేషన్ దీనిని నిర్మించనున్నాయి. రూ.140 కోట్ల వరకు ఈ ఆసుపత్రికి వ్యయం చేయనున్నారు. ఇందులో ట్రస్తు రూ.100 కోట్ల వరకు వ్యయం చేయనుంది. మిగిలిన డబ్బును దాతల నుంచి సేకరించనున్నారు. అమెరికాకు చెందిన ఓ భక్తుడు రూ.33 కోట్లు, మరో భక్తుడు రూ.7 కోట్లను అందించేందుకు ఇప్పటికే ముందుకొ చ్చారు. టాటా ట్రస్తు ద్వారా నిర్మించే ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు సామాన్యులకు ఉపశమనాన్ని కలిగించనున్నాయి.

వీటితో పాటు హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ అమరావతి పరిధిలో ఓ శాఖను ఏర్పాటు చేయనుంది. వైజాగ్ లో ఇప్పటికే హోమీబాబా కాన్సర్ ఆసుపత్రి-పరిశోధన కేంద్రం ద్వారా వైద్య సేవలు తక్కువ రుసుముతో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో భారీగా కాన్సర్ చికిత్సా కేంద్రాలు రాబోతున్నందున మధ్య తరగతి, పేద కుటుంబాలకు ఉపశమనం లభించనుంది.

Advertisements

Latest Articles

Most Read