అది ప్రకృతి విపత్తయిగాగానీ, మానవ వైఫల్యం గానీ, ప్రజలను విషాదంలో ముంచిన దుర్ఘటన గానీ.. జనం కష్టాల్లో ఉంటే అందరికంటే ముందు వారి ముంగిట వెళ్లి, భుజం తట్టి భరోసా ఇచ్చే నాయకుడు చంద్రబాబు. అధికారంలో ఉన్నా, లేక పోయినా విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అక్కడికి వెళ్లి, బాధితులను ఓదార్చి, ఆర్థిక సాయం చేయడమో, వారిని ఆదుకోవడమో కొత్తేమీ కాదు. ఆయనకి పగలు రాత్రి తేడా లేదు... ఎప్పుడూ ఇబ్బంది ఉంటే, అప్పుడు రంగంలోకి దిగుతారు... డిజాస్టర్ మ్యానేజ్మెంట్ లో చంద్రబాబుని కొట్టే వాడు, ఈ దేశంలోనే లేడు అంటారు... అంత ఫాస్ట్ గా, ఎఫెక్టివ్ గా రియాక్ట్ అవుతారు చంద్రబాబు...
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి సహకరించకపోయినా అక్కడే తిష్ఠవేసి, సహాయ చర్యలను స్వయంగా సమీక్షించిన సంగతి ఎలా మర్చిపోగలం. 2000 ఆగస్ట్, హైదరాబాద్ లో ఒక్క రోజే 24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ సగం మునిగిపోయింది. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటూ, మోకాళ్ళ లోతు నీటిలో తిరుగుతూ, సహాయక చర్యలు చేసిన సంగతి ఎలా మర్చిపోగలం... వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లోని గాంధీనగర్ ప్రాంతంలో కలుషిత నీరు తాగి 12మంది చనిపోతే వైఎస్ పట్టించుకోకుండా గోవాలో జన్మ దిన వేడుకలకు హాజరయితే చంద్రబాబు బాధితులకు అండగా నిలిచారు. పాద యాత్ర సందర్భంగా వరదలు వచ్చిన సందర్భంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి రైతులను పరామర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా, ఉత్తరాఖండ్ విషాదంలో మన తెలుగువారు కూడా ఉండటం, ఇంకా అక్కడే సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు వారికి భరోసా ఇచ్చేందుకు అమెరికా నుంచీ వచ్చీరాగానే ఉత్తరాఖండ్‌కు వెళ్ళటం, సొంత ఖర్చులతో వారి ఇంటి ముందు దింపిన సంగతి ఎలా మర్చిపోగలం... నిన్న కాక మొన్న, మన సుందర విశాఖని హుడ్ హుడ్ అతలాకుతలం చేస్తే, వారం రోజుల్లో సామాన్య స్థితికి తీసుకురావటం ఎలా మర్చిపోగలం...
ఈ సందర్భంగా ఇంకో సంఘటన గుర్తుచేసుకుందాం... 2015 నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి... నెల్లూరు జిల్లాలో అంచనాలకి మించి నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజులపాటు జిల్లాలోనే ఉండిపోయారు. రాష్ట్ర మంత్రులు, అధికారులందర్నీ నెల్లూరుకి పిలిపించి హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రాంతాల్లో ముమ్మరంగా తిరిగి బాధితులకి వెంటనే సహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఇక మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావులు నిన్నమొన్నటి వరకూ జిల్లాలోనే ఉండిపోయారు. దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, పల్లె రఘునాథరెడ్డి తదితర మంత్రివర్గ సహచరులంతా జిల్లాలో వాలిపోయి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మూడు రోజులుపాటు చంద్రబాబు పర్యటిస్తే ప్రతిరోజూ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు, విలేకరుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకునేవారు.... వరద నీటిలోనే ఉంటున్న, బాధితుల దగ్గరకు వెళ్లి భరోసా ఇచ్చారు...
ఇక్కడితో ఆయన పని అయిపోదు... సమస్య ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది అని రివ్యూ మీటింగ్ పెడతారు.... లాంగ్ టర్మ్ ప్లాన్... షార్ట్ టర్మ్ ప్లాన్ రెడీ చెయ్యమంటారు.... ఇంకోసారి ఇంత నష్టం జరగకూడదు అని టార్గెట్ ఇస్తారు... అసలు ఈ సమస్యే మరో సారి రాకూడదు, మీ ప్రణాళికలు ఏంటో చెప్పండి అని అధికారలుని ఆదేశిస్తారు...
నాయకుడు అంటే ఇలా ఉండాలి... ఇప్పుడు హైదరాబాద్ వరదలు చూస్తున్నాం... మూడు సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది.. ఈ పరిస్థుతుల్లో తప్పు ఒప్పులు కాదు... ప్రజలకి కావాల్సింది భరోసా... మరి అక్కడ ఒక్క నాయకుడు అన్నా ప్రజల మధ్యకి వచ్చారా ? భరోసా ఇచ్చారా ? ట్విట్టర్ లో ఆంధ్ర రాష్ట్రం గురించి ఎగతాళి చేసే KTR, కనీసం ఒక్క ట్వీట్ చేశారా ? ఎదో సమీక్షలు అంటే, వార్తల్లో న్యూస్ కోసం హడావిడి తప్ప, ఇప్పటి వరకు, వీళ్ళు అక్కడ ప్రజలకు ఇచ్చిన భరోసా ఏంటి ? అమరావతి వరదలకి కొట్టుకుపోతుంది అని ఎడిటోరియల్ రాసే ఒకడు... ఒక బిల్డింగ్ లో నీళ్ళు వస్తే, ఆ బిల్డింగ్ కూలిపోయింది అని వార్తలు రాసే ఇంకొకడు.. వీళ్ళంతా ఉన్నారా ? హైదరాబాద్ వరదల్లో కొట్టుకు పోయారా ? లేక కెసిఆర్ కి భయపడి, హైదరాబాద్ వరదలు గురించి చెప్పలేకపోతున్నారా ?
మా రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి, విపత్తుల్లో ప్రజలకి ఎలా భరోసా ఇవ్వాలో నేర్చుకోండి...