తెలంగాణా రాష్ట్రం మరోసారి అబద్ధాలు ఆడుతూ దొరికిపోయింది... తెలంగాణా రాష్ట్రంతో పాటు, హైదరాబాద్ లో కూర్చున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పత్రిక సాక్షి కూడా ఇదే విషం చిమ్మింది... రాయలసీమ రైతులు నోట్లు మట్టి కొట్టే ప్రయత్నంలో, వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకాలు మరోసారి బయటపడ్డాయి...
అంధ్రప్రదేష్ టెలీమెట్రీ సాధనాలు టాంపరింగ్ చేసి పోతిరెడ్డిపాడు నుండి ఎక్కువ నీరు వాడుతుంది అని తెలంగాణా ఆరోపించింది... విషయం ఏమిటి అంటే, అసలు టెలిమెట్రీ ఎక్విప్మెంట్ మేము వాడటం లేదు ఇంక ట్యంపర్ చేసే అవకాసం ఎక్కడిది అని,సాక్షాత్తు కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ తేల్చి చెప్పాడు. కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ ఆంధ్రా వాడో, తెలంగాణా వాడో కాదు...
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్, రాయలసీమ రైతులకి నీళ్ళు ఇస్తుంది... ఈ విషయం నచ్చని జగన్, తెలంగాణా ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్ నీటి చౌర్యం చేస్తుంది అనే ప్రచారం చేస్తున్నారు. టేలిమెట్రీ స్టేషన్ నమోదు చేస్తున్న ప్రవాహ సమాచారాన్ని మొత్తంగా ట్యామ్పర్ చేసి, టేలిమెట్రీ ద్వారా జరుగుతున్న ప్రవాహ లెక్కలను తారు మారు చేసినట్టు కృష్ణా బోర్డుకి తెలంగాణా ఫిర్యాదు చేసింది...
పోతిరెడ్డి పాడు వద్ద టెలీమెట్రీ యంత్రాలను ఏపీ ఆధికారులు ట్యాంపరింగ్ చేస్తున్నారన్న తెలంగాణ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఏపీ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. జలాశయాల్లో టెలీమీటరీ వ్యవస్థ, ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని, ఈ మొత్తం వ్యవహారాన్ని కృష్ణా బోర్డే చూసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. " ఎక్కడెక్కడ టెలీమీటరీలు ఏర్పాటు చేయాలనేది బోర్డు సమావేశంలోనే నిర్ణయించి తదనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు. వాటికి టెండరు పిలిచి ఏజన్సీని ఖరారు చేసింది స్వయంగా కృష్ణా బోర్డే. వీటి ఏర్పాటు పర్యవేక్షణ, తదితర అంశాలన్నీ బోర్డే చూసుకుంటోంది. వీటిని పరిశీలించి సరైన రీడింగులు నమోదయ్యేలా ఎప్పటికప్పుడు మార్పులు చేసూ వస్తుంటారు. అవన్నీ ఒక్కసారిగా చేపట్టే ప్రక్రియ కాదు. ఇలా మార్పులు చేసుకుంటూ వెళ్లిన తర్వాత బోర్డు ధ్రువీకరించిన తర్వాతే లెక్కలు పక్కాగా అంగీకరిస్తున్నట్లు అర్థం. అంతవరకు ప్రయోగ దశలో ఉన్నట్లే, ఈ దశలో లెక్కలు తారుమారు చేయడమేమిటి.. ? " అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సమావేశంలోను బోర్డు చైర్మన్ ఇదే విషయం స్పష్టం చేశారు. అసలు ధ్రువీకరణ పూర్తి కాకుండా ఆ లెక్కలు పక్కా కావనే విషయం సాంకేతిక నిపుణులకు ఎవరికైనా తెలుసని పేర్కొన్నారు. ధ్రువీకరణ పొందని (సర్టిఫై) వ్యవస్థ పై వివాదం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం నుంచి ఆక్రమంగా నీటిని తరలించుకుపోతున్న తెలంగాణ, దాన్ని కప్పిపుచ్చు కునేందుకే బ్యాంపరింగ్ ఆంశాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి తోడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడి కుట్రలతో తెలంగాణా ఆటలు సాగిస్తుంది.