చెడు పై మంచి విజయం సాధించిన రోజు విజయదశమి అని, సత్‌సంకల్పాలకు దేవతల ఆశ్వీర్వచనాలు లభించే శుభసమయం ఇదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశ,విదేశాల్లో తెలుగువారికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కష్టపడుతూనే మరోవైపు అమ్మవార్ల ఆశీస్సులు కోరుకుంటున్నట్లు తెలిపారు.

నవరాత్రులలో విజయపరంపరకు నిదర్శనంగా దశమిరోజు విజయదశమి పండుగ నిర్వహించటం అనాదిగా సంప్రదాయంగా వస్తోందన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అమేయశక్తిగా తీర్చిదిద్దటమే తమ ధ్యేయమని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణానికి దుష్టశక్తులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కుతంత్రాలు పన్నుతున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివద్ధిని అడ్డుకోవటం కూడా రాక్షసత్వమేనని, అభివృద్ధి నిరోధక శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఇటు కనకదుర్గమ్మ ఆశీస్సులు అటు శ్రీశైలం బ్రమరాంబిక, ద్రాక్షారామ మాణిక్యాంబ, పిఠాపురం పురుహూతిక దేవి ఆశీస్సులతో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

మూడేళ్లుగా ఎగువ నుంచి నీళ్లురాక తడారిన కృష్ణా డెల్టా ఎడారిలా మారకుండా పట్టిసీమ ద్వారా గోదావరి నీరు తెచ్చి పంటలు కాపాడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇటు గోదావరి జలాలు తెచ్చి, కృష్ణా డెల్టాకు వచ్చే కృష్ణా జలాలను రాయలసీమకు ఇస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

కృష్ణానదీజలాలు రాష్ట్రం ఆర్ధిక సంక్షోభ స్థితిలో ఉన్నప్పటికీ అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమాన్ని విడిచిపెట్టలేదని, పెన్షన్లు, రైతు రుణ ఉపశమన పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
విజయదశమి జానపద కళారూపాలను కళ్లముందుంచే పండుగ అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. చిన్నారులు, విద్యార్ధులు విజయదశమి వేళ బొమ్మల కొలువు పెడతారని, బొమ్మలకొలువులు వారి సృజనాత్మకతను ప్రతిబింబిస్తాయని అన్నారు. చదువుతో వచ్చే ఒత్తిళ్ల నుంచి విముక్తమై బొమ్మలకొలువు ద్వారా ఉపశమనం పొందుతారని ముఖ్యమంత్రి వివరించారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన రెడ్డి చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరరంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఫౌండేషన్ ప్రతినిధులతో కలసి మీడియాతో మాట్లాడారు. నవంబర్ 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు విశాఖలో జాతీయ స్థాయి వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సు ముగింపు రోజు 17న బిల్ గేట్స్ వస్తారని చెప్పారు. 1996లో బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చారని, 21 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ ఏపీకి వస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో పంటల సమాచార సేకరణ, భూసార పరిక్షల నిర్వహణ వంటి వాటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ రాష్ట్రం ముందుండి ఓ రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు.

సాగు చేసే భూమిలో దాదాపు 95 శాతం భూసార పరిక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పరిశీలించి, టెక్నాలజీ వినియోగంలో ఏపీ ముందుందని చెప్పినట్లు పేర్కొన్నారు. విశాఖ సదస్సులో వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు, సాంకేతిక సంస్థల వారు పాల్గొంటారని చెప్పారు. ఈ సదస్సుకు ఏ రంగాల వారిని ఆహ్వానించాలన్న అంశాన్ని చర్చించడానికి వారు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరిగేందుకు సాంకేతికత, చిన్న, సన్నకారు రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసేందుకు కావలసిన సహకారం ఈ ఫౌండేషన్ అందిస్తుందని వివరించారు. సదస్సులో ఏపీ ప్రభుత్వం- ఫౌండేషన్ మధ్య ఒప్పందం జరుగుతుందన్నారు. ఈ ఫౌండేషన్ లాభాపేక్షకలిగిన వ్యాపార సంస్థ కాదని, స్వచ్చంద సంస్థని తెలిపారు. ఆఫ్రికాలో వ్యవసాయ రంగం అభివృద్ధిలో మంచి ఫలితాలు సాధించిన ఈ ఫౌండేషన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పట్ల ఆసక్తి చూపించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పరిశ్రమలు నెలకొల్పితే మౌలిక సదుపాయాలు కల్పిస్తామనిచెప్పారు. విశాఖ సదస్సు ఇటు రైతులకు, అటు వ్యవసాయ అనుబంధ రంగాల పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోకరంగా ఉంటుందని మంత్రి అన్నారు.

వ్యవసాయ పరిశోధనా కేంద్రం వంటి ఏపీ
వివిధ వాతావరణ పరిస్థితులు, పలు రకాల పంటలు పండే ఆంధ్రప్రదేశ్ ఒక పరిశోధనా కేంద్రం వంటిదని ఫౌండేషన్ ఆసియా చీఫ్ డాక్టర్ పుర్వి మెహతా చెప్పారు. దేశంలోని ఒరిస్సా, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని అక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇక్కడ సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయ దిగుబడులు అధికంగా సాధించడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలు రావడానికి మార్కెటింగ్ లో మెళకువలు నేర్పే విషయంలో సహకరిస్తామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో భూసారం, వాతావరణం, మౌలిక వసతుల ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అందిస్తామని పుర్వి మెహతా చెప్పారు.
సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించి సలహాలు అందించే అంతర్జాతీయ సంస్థ డాల్బెర్గ భాగస్వామి వరద్ పాండే మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సంబంధించి పూర్తి సమాచార సేకరణ, సాంకేతిక వినియోగం, రైతులకు రుణ సౌకర్యం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఆల్ లైన్ మార్కెటింగ్ వంటి అంశాలలో తమ సహకారం అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిల్ గ్రేట్స్ ల అమూల్యమైన సలహాలతో తాము ముందుకు వెళతామన్నారు.

ఈ ఫౌండేషన్ ఆఫ్రికా వంటి దేశంలో పరిశోధనలు చేసి ఫలితాలు సాధించిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ చెప్పారు. పంటలకు నేల లక్షణాలు ముఖ్యమని, ఆఫ్రికా సాయిల్ సంస్థలను నెలకొల్పి, అక్కడ వివిధ ప్రాంతాల్లో మట్టిని సేకరించి, పరీక్షించి భూసారాన్ని మెరుగుపరిచారని వివరించారు. ఆఫ్రికా వంటి దేశంలో ఫలితాలు సాధించడం గొప్ప విజయంగా వర్ణించారు. మన రాష్ట్రంలో కూడా నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలు, లేని ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి తగిన సహాయం, సహకారాలు అందిస్తారని తెలిపారు. ప్రస్తుతం మనం అందించిన సాయిల్ హెల్త్ కార్డుల స్థానంలో డిజిటల్ సాయిల్ కార్డులు ఇస్తారన్నారు. అత్యాధునిక సాంకేతికత అందించడంతోపాటు వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి సహకారం అందించడంలో భాగంగా విశాఖలో సదస్సు నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు.

ఎన్టీఆర్ కుమార్తె అనే ట్యాగ్ తో, కాంగ్రెస్ పార్టీలో చేరి, కేంద్ర మంత్రి అయ్యి, కాంగ్రెస్ ఓడిపోగానే బీజేపీలో చేరిన పురంధీశ్వరి ఈ మధ్య ఎక్కడ చూసినా వార్తల్లో ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్త ప‌ర్య‌ట‌న చేస్తూ, ప్రతి సందర్భంలోనూ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూనే ఉన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల తరువాత చాలా మంది స్టేట్ బీజేపీ నాయకులు సైలెంట్ అయిపోయారు... కాని ఈవిడ మాత్రం, చంద్రబాబు మీద ఉన్న వ్యక్తిగత కోపంతో, విమర్శిస్తూనే ఉన్నారు...

అయితే ఈ మధ్య పురంధీశ్వ‌రి హడావిడి అటు బీజేపీ పార్టీ వర్గాలని, ఇటు రాజకీయ విశ్లేషకులని ఆలోచింపచేస్తుంది... కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్యన వారిధిలాగా మాట్లడుతూ, వచ్చే ఎన్నికల్లో సీట్లు గురించి కూడా మాట్లాడుతున్నారు.. బీజేపీ అత్యంత బలమైన పార్టీగా నిలిచేందుకు కృషి చేస్తాను అని చెప్తున్నారు... అలాగే చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేస్తుంది అని విమర్శలు చేస్తున్నారు....

ఈ దూకుడు వెనుక భారీ ప్లాన్ ఉంది అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధ్యక్షుడిని మారుస్తారు అనే ఊహగానాలు చాలా రోజులు నుంచి వస్తున్నాయి... హరిబాబుని కేంద్ర మంత్రిని చేసి, ఆ పదవి వేరే వారికి ఇస్తారనే వార్తలు వచ్చయి. దీంతో, ఆ అధ్యక్ష పదవి సంపాదించటానికి పురంధీశ్వ‌రి పావులు కదుపుతున్నారు.... అందుకే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల సందర్సన అంటూ నిత్యం వార్తల్లో ఉంటూ, అధిష్టానం కళ్ళల్లో పడటానికి తాపత్రయ పడుతున్నారు...

దీని వెనుక భారీ వ్యూహం ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఒక్కసారి అధ్యక్ష పదవి సంపాదిస్తే, అధిష్టానం దగ్గర చంద్రబాబుని మరింత ఇబ్బంది పెట్టవచ్చని, తెలుగుదేశం పార్టీని బీజేపీ నుంచి దూరం చేసి, జగన్ ని బీజేపీ వైపు తీసుకురావటం కాని, లేకపోతే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడిగి చంద్రబాబుని ఇబ్బంది పెడుతూ, అన్ని విషయల్లో చంద్రబాబు చెవిలో జోరీగలాగా మారి, చికాకు పెట్టి, చంద్రబాబుని సాధించాలి, తద్వారా తెలుగుదేశం పార్టీని బలహీన పరచటం, ఈ వ్యూహం వెనుక పరమార్ధం అంటున్నారు...

పంచాయితీ రాజ్, ఐటీ మంత్రి, టిపిడి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాజకీయంగా చంద్రబాబు చేసిన తప్పులు నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇటీవల ఇంటింటా టిడిపి కార్యక్రమంలో పాల్గొనేందుకు విజియనాగరం జిల్లా పర్యటన సందర్భంగా, నారా లోకేష్ అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. శృంగవరపుకోట సిట్టింగ్ ఎమ్మెల్యే లలితా కుమారి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.

ప్రస్తుతం శృంగవరపుకోటలో MLA లలితా కుమారి, మాజీ ఎమ్మెల్యే హైమావతి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పటికే ఈ రెండు గ్రూపులు చురుగ్గా పనిచేస్తున్నాయి, నియోజకవర్గంలో ఐదు మండలాల్లో బలంగా ఉన్నాయి. ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో సీట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారిపోయింది. జిల్లా మంత్రులకు ఈ సమస్య పరిష్కరించమని చెప్పినా, ఎవరూ దానిని పరిష్కరించలేరు. చివరకు లోకేష్ అడుగుపెట్టి, ఎమ్మెల్యే లలితకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ ప్రకటనతో హైమావతి, ఆమె అనుచరులు కలత చెందాయి.

రాజకీయ విశ్లేషాకులు ఇది మంచి నిర్ణయం అని చెప్తున్నారు. లోకేష్ తెలివైన చర్యగా అభివర్ణించారు. ముసుకులో గోద్దులాట లేకుండా, ఎలక్షన్స్ దాకా సాగాదియ్యకుండా లోకేష్ తీసుకున్న నిర్ణయంతో అందరికీ క్లారిటీ వస్తుంది అని, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారని, హైమావతిని బుజ్జగించటం పెద్ద సమస్య కాదంటున్నారు... నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపుతో, మంచి ఊపులో ఉండగా అసంతృప్తులు వేరే పార్టీలోకి వెళ్ళే సాహసం చెయ్యరు...

వాస్తవానికి, చంద్రబాబు నాయుడు అటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవటానికి చాలా ఆలస్యం చేస్తారు. అటు కర్ర విరగక, ఇటు పాము చావక, ఎవరు పని చెయ్యాలో తెలీక, అటు కార్యకర్తలు, ఇటు నాయకులు కూడా అసహనానికి లోనయ్యేవారు.. చివరికి పార్టీకి నష్టం జరిగిదే... ఇలా సాగదీసే విషయంలో చంద్రబాబు మీద చాలా అపవాదు ఉండేది... కానీ లోకేష్ అలా సాగదియ్యకుండా, బోల్డ్ స్టెప్ తీసుకుని, కచ్చితమైన అభిప్రాయం చెప్పేశారు. రాజకీయంగా చంద్రబాబు చేసిన తప్పులు నుంచి, లోకేష్ పాఠాలు నేర్చుకుంటున్నాడు అంటున్నారు విశ్లేషకులు... అన్ని నియోజకవర్గాల్లో ఈ క్లారిటీ ఇచ్చేస్తే, ఎవరి పని వారు చేసుకుంటూ, ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవచ్చు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read