ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, కొన్ని లక్షల మంది ప్రజలకు లబ్ది చేకూర్చే నాలుగు కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలు ఒక పండగ వాతావరణంలో, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నర్యి
రైతులకు మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల:
ఇప్పటి వరకు రెండు విడతలుగా రుణమాఫీ చేశారు. అక్టోబర్ 2న, 28 లక్షల మంది రైతులకి, వడ్డీతో సహా, రూ.3609 కోట్ల రుణమాఫీ జరగనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం నిర్మించిన లక్ష గృహాల్లో గృహ ప్రవేశ ఉత్సవాలు:
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 12,03,576 గృహాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబరు 26 నాటికి 1,01,898 గృహాల నిర్మాణం పూర్తి చేసింది. ఈ లక్ష గృహాల్లో అక్టోబరు 2న రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తునంరు. ఈ లక్షకు పైగా గృహాల కు ప్రభుత్వం రూ.1,252.11 కోట్ల ఖర్చు పెట్టింది.
ప్రతి గ్రామంలో నూతన గృహాల్ని అందంగా అలంకరించి ఒక పండుగలా గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమాల ఫొటోలను గృహ నిర్మాణశాఖ వెబ్ సైట్లో పొందుపరిచి, వాటిని సీఎం డ్యాష్ బోర్డుతో అనుసంధానిస్తారు. ప్రతి లబ్దిదారునికి రెండు పండ్ల మొక్కలు పంపిణీ చేసి, వాటిని ఆ కొత్త ఇంట్లో నాటి, జియో ట్యాగింగ్ చేసి వనం మనం కార్యక్రమంలో భాగంగా వెబ్ సైట్లో పొందుపరుస్తారు.
రెండో సంవత్సరానికి మార్పులు చేర్పులతో రూపొందించిన చంద్రన్న బీమా పథకం:
గత సంవత్సరం ప్రారంభించిన చంద్రన్న బీమా పథకంలో పాలసీదారులకు మరింత లబ్ది చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ప్రధాన మంత్రి జీవన బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసి, సరికొత్త పథకంగా తీర్చిదిద్దింది. దీని పేరుని ప్రధాన మంత్రి చంద్రన్న బీమా పథకంగా మార్చింది. ఆసంఘటిత రంగంలోని 2.20 కోట్ల మంది పాలసీదారుల తరపున ప్రభుత్వమే రూ.288 కోట్ల ప్రీమియం చెల్లిస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్ళు వారంతా ఈ పథకం పరిధిలోకి వస్తారు.
స్వచ్చాంధ్ర మిషన్ అవార్డుల ప్రదానోత్సవం:
స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో నిర్వహించిన పోటీలకు, ఉత్తమంగా ఎంపికైన సంస్థలకు అవార్డులు ప్రదానం చేస్తారు.