కొన ఊపిరితో ఉన్న రాయలసీమ రైతాంగానికి కృష్ణమ్మ ఊపిరి పోసింది. ఎగువన పశ్చిమ కనుమలు, మంత్రాలయం, కర్నూలులో కురిసిన స్థానిక వర్షాలతో శ్రీశైలం వద్ద అంతకంతకూ వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది... ఈ నీరంతా రాయలసీమ రైతాంగం కోసమే ఉపయోగించనున్నారు... పట్టిసీమతో కృష్ణా డెల్టాకి సరిపడా నీరు ఉడటంతో, ఈ నీరు మొత్తాన్ని రాయలసీమ అవసరాల కోసమే వాడనున్నారు....

పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 858.4 అడుగులు ఉంది. శ్రీశైలం డ్యాములోనికి 1,89,916 క్యూసిక్స్ వరద నీరు కొనసాగుతోంది. డ్యాములో ప్రస్తుతం 101 టీఎంసీ ల నీరు ఉంది. మంగళవారం ఉదయం 8 గంటల కు డ్యాములోనికి 1,89,916 క్యూసిక్స్ నీరు చేరుతోంది.

రాయలసీమ జిల్లాల్లోని సాగు, తాగు నీటిని అందించే ప్రాజెక్టులైన తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, కెసి కెనాల్‌కు నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు శ్రీశైలం జలాలు చేరుకున్నాయి. మంగళవారం లేదా బుధవారం పోతురెడ్డిపాడు నుంచి కాలువలకు నీళ్లు వదిలే అవకాశం ఉందని సమాచారం.

ఎగువన జూరాల, నారాయణపూర్‌, ఆల్మట్టిల వద్ద వరద ప్రవాహం భారీ ఎత్తున ఉండడంతో శ్రీశైలం జలాశయంలోకి మరోవారం రోజులపాటు ఇదే ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం డ్యాంకు నీరు రాకతో నాగార్జున సాగర్ కుడి కాలవ క్రింద రైతులు మరియు రాయలసీమ రైతులలో ఆనందము వ్యక్తమౌతోంది.

దేశంలో నర్మద ప్రాజెక్టు తరువాత జాతికి అంకితం చేసే ప్రాజెక్టు పోలవరమే అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రుల జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్‌ను ఆయన సందర్శించారు. ప్రాజెక్టుపై విహంగ వీక్షణం నిర్వహించారు. అనంతరం పోలవరం పనులు పరిశీలించారు. స్పిల్‌వే నిర్మాణం, గేట్ల నిర్మాణం పనుల తీరును అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ మ్యాప్‌లను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే, స్పిల్ ఛానల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు సాగుతున్నాయని తెలిపారు. ఐకాన్‌ బ్రిడ్జ్‌, పవర్‌హౌస్‌ నిర్మాణాలు త్వరలో చేపడతామని వెల్ల‌డించారు.

960 మెగావాట్ల పవర్‌హౌస్‌ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. 1055 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని చేయాల్సి ఉండగా 70శాతం పని పూర్తి అయిందని తెలిపారు. 31 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.70లక్షల క్యూబిక్‌ మీటర్లు పని పూర్తి అయిందని వివరించారు.1200మీటర్ల డయాఫ్రంవాల్ 550 మీటర్లు పూర్తి చేశామని తెలిపారు.

7 లక్షల క్యూబిక్‌ మీటర్ల స్పిల్‌వే కాంక్రీట్ పనులు పూర్తి అయితే ప్రాజెక్టు ఓ రూపానికి వస్తుందని తెలిపారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 7 వేల కోట్ల రూపాయ‌లు పనులకు ఖర్చు చేశామని, మరో 5 వేల కోట్ల రూపాయ‌లు నిర్వాసితుల కోసం ఖర్చు చేశామని తెలిపారు. మరో 40 వేల కోట్ల రూపాయ‌లు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమవుతుందని అంచ‌నా వేశారు.

కాకినాడ, నంద్యాల ఎన్నికలు తరువాత పార్టీ పరిస్థితి ఏంటో అర్ధంకాక కార్యకర్తల్లో నిరుత్సాహం ఉంది... మరో నెల రోజుల్లో పాదయాత్ర ఉంది... దానికి ఇప్పటి వరకు ప్లానింగ్ జరగలేదు... ఇలా ఉండగానే, జగన్ ఫారన్ ట్రిప్ అని, లండన్ చెక్కేసాడు... ఇలాంటి పరిస్థుతుల్లో ఎవరైనా, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ధైర్యం చెప్తారు... కాని, ఈయన తన కూతురుని కాలేజీలో చేర్పించటం కోసమని, ఏకంగా 13 రోజుల టూర్ ప్లాన్ చేసుకున్నారు... 2-౩ రోజుల్లో అయిపోయే పనికి, ఇలాంటి పరిస్థుతుల్లో 13 రోజుల జాలీ టూర్ ఏంటి అని, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు...

అయితే, జగన్ 19న తిరిగి వచ్చేస్తాడు అనుకునేవారికి, మళ్ళీ నిరుత్సాహం... మరో రెండు రోజులు ఆలస్యంగా, ఈ నెల 21న జగన్ ఇండియా రానున్నారు... మరి, ఈ రెండు రోజులకి కోర్ట్ పర్మిషన్ తీసుకున్నారా, లేదా అనేది తెలియాల్సి ఉంది..

అయితే ముందుగా, తన కూతురుని కాలేజీలో జాయిన్ చెయ్యటానికి వెళ్ళాడు కాబాట్టి, పర్సనల్ విషయం కాబట్టి, తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా రాజకీయం చెయ్యలేదు... అయితే, ముందుగా 5 రోజులు అనుకున్న టూర్, 13 రోజులు కావటం, దానికి కోర్ట్ పర్మిషన్ ఇవ్వటం... ఇప్పుడు మళ్ళీ 15 రోజులు కావటంతో, అందరిలో అనుమానాలు మొదలయ్యాయి... కచ్చితంగా జగన్ వ్యాపార లావాదేవీలకు సెటిల్ చేసుకోవటానికి వెళ్ళారని, అంతే కాకుండా తన కూతురి ఉండటానికి లండన్ లో ఒక పెద్ద విల్లా కూడా కొన్నారని, ఇంకా చాలా చీకటి ఒప్పందాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. సిబిఐ, జగన్ టూర్ మీద నిఘా పెట్టి, కచ్చితమైన సమాచారం రాబట్టాలని అంటున్నారు..

చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్... ఇది 2014 సక్సెస్ కాంబినేషన్.... చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అన్ని విధాలుగా గౌరవం ఇస్తున్నారు, పవన్ ఏ సమస్య లేవనెత్తినా పరిష్కరిస్తున్నారు.. మరో పక్క, మోడీ మాత్రం పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టారు... స్వచ్ఛతేసేవ’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ పవన్‌కాల్యాణ్‌ మినహా తెలుగు సినిమాలోని పలువురు ప్రముఖులకు ప్రధాని లేఖలు రాశారు... దర్శకుడు రాజమౌళి, సీనియర్ నటుడు మోహన్‌బాబు, స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్‌బాబులకు ప్రధాని లేఖలు రాశారు.. కాని తెలుగులో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న, పవన్ కు మాత్రం మోడీ లేఖ రాయలేదు..

అయితే ప్రతి సందర్భంలో పవన్, కేంద్రాన్ని నిందిస్తున్నారు.... ట్విట్టర్ లో, ఘాటు పోస్ట్లు పెడుతూ, కేంద్రాన్ని నిందిస్తున్నారు... ఈ సమయంలో పవన్‌కు మినహా మిగిలిన సినీ ప్రముఖులకు ప్రధాని లేఖలు రాయడం చర్చకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో కలిసి పోటీ చేశారు, NDA సమావేశానికి పవన్ ను పిలిచారు... మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పవన్ వెళ్లి, మోడిని ఆళింగనం చేసుకున్నారు.. ఇంతటి సాన్నిహిత్యం ఇప్పుడు లేదు..

అయితే, రాష్ట్ర బీజేపి నేతలు మాత్రం, రాజకీయ నేపధ్యం ఉన్న ఏ హీరోలని పిలవలేదు అని, అందుకే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కి కూడా లేఖలు రాయలేదు అని, అందుకే పవన్ కి కూడా రాయలేదు అని, అంతకు మించి, ఏమి లేదు అని అంటున్నారు... అయితే, అదే సందర్భంలో, కృష్ణం రాజు బీజేపి నేతగా ఉన్నారు, మరి ప్రభాస్ కు లేఖ రాసారు కదా అంటున్నారు పవన్ అభిమానులు... మొత్తానికి, పవన్‌కు మోదీ లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది...

Advertisements

Latest Articles

Most Read