రాష్ట్ర విభజన అనంతరం, ఈ రాష్ట్రాన్ని గర్వంగా నిలబెట్టిన తీరు, ఈ దేశానికే ఆదర్శం అయ్యింది... అందుకే, మన సక్సెస్ స్టొరీ, ఇప్పుడు అమెరికాలో వినిపించనుంది... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ సమావేశంలో పాల్గుననున్నారు... మన రాష్ట్ర ప్రగతి, చంద్రబాబు విధానాలు ఇప్పుడు వరల్డ్ సక్సెస్ స్టొరీ అయ్యింది... ఇది మన రాష్ట్రానికి, చంద్రబాబు నాయకత్వంలో దక్కిన అరుదైన గౌరవం...

అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస ప్రత్యేక సమావేశానికి, మన దేశం తరఫున ఆంధ్రప్రదేశ్‌ను పంపించాలని కేంద్రం నిర్ణయిచింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ 11.72 శాతం వృద్ధి రేటును సాధించడాన్ని పరిగణనలోకి తీసుకున్న నీతి ఆయోగ్‌ ఈ సమావేశం కోసం ఏపీ పేరును సూచించింది. రాష్ట్ర విభజన తర్వాత సాధించిన అభివృద్ధిని ఈ సమావేశంలో ప్రస్తావించాలని, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

వృద్ధి రేటుతో పాటు, చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ఏపీలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ-అభివృద్ధి పథకాలు, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా-గోదావరి అనుసంధానానికి తీసుకున్న చర్యలు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ నిర్మాణం, LED బుల్బులతో ఇంధన ఆదా, వ్యవసాయంలో బెస్ట్ ప్రాక్టీసెస్, గ్రామాల్లో CC రోడ్డులు తదితరాలను గుర్తిస్తూ నీతిఆయోగ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ సమావేశంలో చర్చించే అంశాలు, దాదాపు 100 దేశాల్లో అమలు చెయ్యనున్నారు... ఇది ఆంధ్రోడి సత్తా... ఆంధ్రోడు దేశానికే కాదు, ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శం కానున్నారు...

కర్నూల్ జిల్లా... జగన్ పార్టీకి, కడప తరువాత, అత్యంత బలమైన జిల్లా కర్నూల్.... కాని, జగన్ వ్యవహార శైలి, అతని మూర్ఖత్వం నచ్చక, సంవత్సరం క్రితం, భుమా నాగిరెడ్డి, పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు... అప్పటి నుంచి, కర్నూల్ లో జగన్ పార్టీ కి డౌన్ ఫాల్ మొదలైంది... నంద్యాల ఉప ఎన్నికల దెబ్బతో, జగన్ పార్టీ ఇప్పుడు కర్నూల్ లో చచ్చిన పాము... ఆ చచ్చిన పాముని మరింత చంపటానికి, ఇప్పుడు మరో జగన్ పార్టీ MP రెడీగా ఉంది...

నంద్యాల ఎన్నికల తరువాత, కర్నూల్ జిల్లలో, తెలుగుదేశం పార్టీలో జోష్ కనపడుతుంటే, జగన్ పార్టీ ఏ మాత్రం సోయలో కూడా లేకుండా పోయింది. తాజాగా వైసీపీ MP బుట్టా రేణుక, తెలుగుదేశం పార్టీలో చేరటం దాదపుగా ఖాయం అయ్యింది... ఇదివరకే జంప్ అవ్వాల్సి ఉన్నా, జగన్ ఒత్తిడి మేరకు, ఆమె పార్టీ మారకుండా ఉండి పోయింది.. తాజా పరిస్థుతుల్లో, పార్టీ జిల్లలో ఎక్కడా బలం లేకపోవటం, జగన్ చేస్తున్న తప్పిదాలతో ప్రజల్లో వ్యతిరేకత చూసి, ఆమె పార్టీ మారితేనే భవిష్యత్తు ఉంటుంది అనే అభిప్రాయానికి వచ్చారు...

బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు... ఇప్పటికే ప్రాధమిక చర్చులు కూడా అయ్యాయి అని సమాచారం... కర్నూల్ జిల్లాకు చెందిన, ఇద్దరు వైసీపీ ఎమ్మేల్యేలు, హైదరాబాద్ లో, కొంత మంది టిడిపి నాయకులతో భేటి అయ్యి, జగన్ తో వేగలేం అని, ఆయనతో ఉంటే మమ్మల్ని కూడా నాశనం చేస్తాడు అని చెప్పినట్టు సమాచారం... ఈ నెల 19న, చంద్రబాబు కర్నూల్ జిల్లా పర్యటనలోపు, కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి...

ఒక పక్క భుమా కుటుంబం, గంగుల కుటుంబం, కేఈ కుటుంబం, ఎస్పీవై రెడ్డి, ఇప్పుడు కోట్ల కుటుంబం కూడా చేరితే, కర్నూల్ జిల్లాలో, జగన్ పార్టీకి కాండిడేట్ కూడా మిగిలే అవకాసం లేదు... శిల్పా కుటుంబం తప్పితే, కర్నూల్ జిల్లలో, పోటీకి నుంచునే సాహసం కూడా ఎవ్వరూ చేసేలా లేరు...

బలమైన జిల్లలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక మిగతా జిల్లాల సంగతి ఎంటా అని, పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు... ఇక కర్నూల్ లో, అన్-ఆఫీషయల్ గా స్కూల్ మూసేసినట్టే అంటున్నారు...

వెంకయ్య నాయుడు, మొన్నటి వరకు కేంద్రంలో రాష్ట్రానికి కావాల్సిన సహాయం చేసిన కేంద్ర మంత్రి... తన సొంత శాఖలోనే కాక, మిగతా శాఖల్లో రాష్ట్రానికి సంబంధించిన పనులు చూసుకునే వారు... ఆయన ప్రాతినిధ్యం వహించిన పట్టణాభివృద్ధి శాఖలో చేతనైన సహాయం చేశారు... రాష్ట్రానికి ఇళ్ళ కేటాయింపు, అండర్గ్రౌండ్ డ్రైనేజికి నిధులు, అమరావతికి స్మార్ట్ సిటీ హోదా... ఇలా ఎన్నో పనులు చూసుకునే వారు...

ఇప్పుడు ఉప-రాష్ట్రపతిగా వెళ్ళిపోయిన తరువాత, కేంద్రంలో పనులు అనుకున్నంత స్పీడ్ గా జరగటం లేదు అని, రాష్ట్రంలోని అధికారులు, మంత్రులు అంటున్నారు... మంత్రి నారాయణ, నిన్న నెల్లూరులో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్‌లో వెంకయ్యనాయుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు..

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు పనుల నిమిత్తం ఢిల్లీ వస్తున్నానని ఆయనకు ఫోన్‌ చేస్తే... ‘సమయం వృథా ఎందుకు? ఆ పని నేను చేయిస్తాలే’ అనేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రతి పనికీ ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోందన్నారు...

నంద్యాల ఉప ఎన్నికల్లో 27,456 ఓట్ల అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు, తన స్టైల్ లో థాంక్స్ చెప్పనున్నారు చంద్రబాబు... ఇందు కోసం, ఎప్పుడూ లేని విధంగా, చంద్రబాబు స్వయంగా వెళ్లి అక్కడ ప్రజలకు కృతజ్ఞత చెప్పనున్నారు... ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో కృతజ్ఞతా సభ పెట్టి, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు.

ఎప్పుడూ ఎలక్షన్స్ ముందు వచ్చి, ప్రజలను ఓట్లు అడిగి వెళ్ళిపోయే నాయకులే కాని, ఇలా ఓటర్లకు గెలిపించినందుకు, ఒక ముఖ్యమంత్రి వెళ్లి థాంక్స్ చెప్పటం, ఎప్పుడూ లేదేమో...

దీనికి చాలా కారణాలే ఉన్నాయి... ఒకటి, నంద్యాల ఎన్నికలతో, చంద్రబాబు ఢిల్లీ నుంచి, గల్లీ దాకా చాలా మంది నోర్లు ముపించారు... టీవీల్లో, సోషల్ మీడియాలో బుల్డోజ్ చేసి, చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్నంగా ఉంది అనే అభిప్రాయం సృష్టించారు... కాని గ్రౌండ్ లెవెల్ లో, సీన్ వేరేగా ఉంది... రెండోది, చంద్రబాబు ఈ ఎలక్షన్ లో, అభివృద్ధి అజెండాగా, ప్రజలని ఓట్లు అడిగారు.. ఏమి చేసాను, ఏమి చేస్తాను అనే విషయాలు మాత్రమే చెప్పారు... అందుకే ప్రజలకు, మీకు అండగా ఉంటా, ఎన్నికల కోసం కాదు, మీకు చెప్పినవి అన్నీ చేస్తాను, అనే కాన్ఫిడెన్సు క్రియేట్ చెయ్యటానికి కూడా వెళ్తున్నారు...

మీటింగ్ ఒక్కటే కాదు, విద్యార్థులతో ముఖాముఖి, పొదుపు మహిళలతో ముఖాముఖిలో కూడా పాల్గుంటారు... చంద్రబాబు మళ్ళీ అభివృద్ధి అజెండానే ముందుంచి, నంద్యాల ప్రజల మనసులు గెలవటానికి, ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకి నంద్యాలకు కృతజ్ఞత చెప్పనున్నారు... అందుకే ఇది చంద్రబాబు స్టైల్ థాంక్స్...

Advertisements

Latest Articles

Most Read