సామాన్యంగా చంద్రబాబు ఏ అధికారిని అంత తొందరగా మెచ్చుకోరు.... చాలా అరుదుగుగా అధికారులని మెచ్చుకుంటారు... మెచ్చుకున్నారు అంటే, ఆ అధికారి ది బెస్ట్ కిందే లెక్క అనుకుంటారు ఐఏఎస్ అధికారులు... కృష్ణా జిల్లా లక్ష్మీకాంతం, ఈ సారి చంద్రబాబు దృష్టిలో పడ్డారు... స్వయంగా చంద్రబాబు ఈ విషయాన్ని అందరికీ చెప్పారు...
కృష్ణా జిల్లా హ్యాపీనెస్ ఇండెక్స్‌లో అగ్రస్థానం సాధించటం, ఉపాధి హామీ పనుల్లో దేశానికి ఆదర్శంగా నిలవటం, మీకోసం ధరఖాస్తుల పరిష్కారంలో, కైజాల, మీడియా ద్వారా వచ్చే సమస్యల పరిష్కారంలో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉండటం, ఇలా అన్నిటిలోనూ ప్రజలకు మేలు చేస్తున్న విధానాలు అవలంభిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ ని, చంద్రబాబు అభినందించారు...
ప్రజల నాడి తెలుసుకోవటం కోసం చేస్తున్న ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ సర్వేలో కూడా, 64 శాతం హ్యాపీనెస్తో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు చెప్పారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో 12,25,102 ధరఖాస్తులు రాగా 12,20,867 ధరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, ఇది అన్ని జిల్లాలకు ఆదర్శం కావాలని అన్నారు..
ఇది వరకు కలెక్టర్ గా పని చేసిన, అహ్మద్ బాబు కూడా చాలా మంచి పనులు చేసి, జిల్లాకు, దేశ స్థాయిలో ఎన్నో అవార్డ్లు తీసుకొచ్చారు. ఇప్పడు, కలెక్టర్ లక్ష్మీకాంతం కూడా, అదే బాటలో జిల్లాను నడిపిస్తున్నారు.