మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ త్వరలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ తరుపున, రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి, అదే విధంగా వైద్య రంగానికి సహకారం అందించనున్నారు.

రాష్ట్రంలో పంట భూములకు సబంధించి సాంకేతికతను ఉపయోగించుకుని, ఏ భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఎరువులేం వేయాలి అనే వాటికి సహకారం అందించనుంది. వీటన్నిటిని ఉపయోగించుకుని, ఆ భూమికి సంబంధించిన భూమి ప్రొఫైల్‌ను తయారుచేస్తారు. ఇప్పటికే గేట్స్‌ ఫౌండేషన్‌, ఆఫ్రికాలో వ్యవసాయ రంగానికి సహకారం అందిస్తుంది.

ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టు అమలుచేసేందుకు మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ అంగీకరించింది. ఈ నెలాఖరులో రెండురోజుల పాటు ఏపీ స్మార్ట్‌ ల్యాండ్‌హోల్డర్‌ సదస్సు జరుగుతుంది. దీని కోసం ముఖ్య అతిథిగా బిల్‌గేట్స్‌ రానున్నారు.

మెగా స్టార్ చిరంజీవి, ప్రజలు పిలిచారు అని చెప్పి రాజకీయల్లోకి వచ్చి, ప్రజారాజ్యం పార్టి పెట్టి, అట్టర్ ఫ్లోప్ అయ్యి, చివరకి జెండా పీకేసి, కాంగ్రెస్ లో కలిపేసి, రాజ్యసభ మెంబెర్ అయ్యి, మినిస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే...

2014 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినాక, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు చిరంజీవి... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసిన కనిపించలేదు... మళ్ళీ సినిమాల వైపు వెళ్లి, 150వ సినిమా తీసారు... ఇప్పుడు మళ్ళీ “సైరా నరసింహారెడ్డి” అనే సినిమా తియ్యబోతున్నారు.

అయితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడి, జనసేనకు వెళ్తారని కొన్ని రోజులు, తెలుగుదేశంలోకి వెళ్తారని కొన్ని రోజులు ప్రచారం జరుగుతూ వస్తుంది. అయితే, ఇప్పుడు చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.. ఇక పూర్తిగా సినిమాలు వైపు వెళ్లిపోతారని అంటున్నారు. ఇందుకు ముహూర్తం కూడా రెడీ అయ్యింది. తన రాజ్యసభ సభ్యత్వం పదవీ కాలం ముగియగానే , 2018లో చిరంజీవి రాజకీయ సన్యాసం తీసుకోనున్నారు.

రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి వున్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వినూత్న ప్రాజెక్టులతో ముందుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్టు ఏపీని పర్యాటకులకు స్వర్గధామంగా తీర్చిదిద్దాలని చెప్పారు. గురువారం తన కార్యాలయంలో జరిపిన ఆంధ్రప్రదేశ్ టూరిజం, కల్చర్, హెరిటేజ్ బోర్డు సమావేశంలో పర్యాటకరంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియతో కలిసి అధికారులతో చర్చించారు. విజయవాడలో కళాక్షేత్రం ఆడిటోరియం, పవిత్ర సంగమం దగ్గర గ్రాండ్ థియేటర్ నిర్మాణం, అనంతపురం జిల్లాలో ఎఫ్ 3 రేస్ సర్క్యూట్ ఏర్పాటు, కొండపల్లి కోట – రాజమహేంద్రవరంలో హావలాక్ బ్రిడ్జి అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు.

పర్యాటక శాఖ కోసం ఆరు కొత్త లోగోలను అధికారులు ముందుంచగా ముఖ్యమంత్రి వాటిని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ పర్యాటకరంగానికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించేలా, మన సంస్కృతిని ప్రతిబింబించేలా లోగో, ట్యాగ్‌లైన్ రూపొందించాలని చెప్పారు.

కొండపల్లి కోటకు సొబగులు
చారిత్రక ప్రాధాన్యత వున్న కొండపల్లి కోటను తీర్చిదిద్దడంలో భాగంగా కొండపల్లి ఎకో మ్యూజియం, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెడ్డిరాజులు, కుతుబ్‌షాహీల కాలం నాటి వైభవాన్ని కోటకు తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ఎనిమిది ఎకరాల్లో విస్తరించి వున్న కోటను, పరిసరాలను సుందరంగా మలచనుంది. కొండపల్లి బొమ్మలకు సైతం ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపట్టనుంది. కొండపల్లి ఖిల్లా వున్న సుమారు 400 ఎకరాల అటవీ భూమిని అవసరమైతే డీనోటిఫై చేసి అభివృద్ధి పరిచేందుకు వున్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కొండపల్లి కోట సహజత్వం చెక్కుచెదరకుండా వచ్చే ఏడాది మార్చి నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని చెప్పారు.

చిత్తూరు జిల్లాలోని కంగుండి, గుంటూరు జిల్లాలోని కొండవీడు, బెల్లంకొండ, అనంతపురం జిల్లాలోని కుందుర్పి కోటలతో సహా అన్ని జిల్లాల్లోని కోటలను అభివృద్ధి చేయాల్సిన అవసరం వుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వీటికి ఒక్కోదానికి రూ. 2 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు వ్యయమవుతుందని వెల్లడించారు.

అత్యాధునికంగా కళాక్షేత్ర ఆడిటోరియం
విజయవాడలోని జీవీఆర్ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలోని 3.06 ఎకరాల విస్తీర్ణంలో ‘కళాక్షేత్ర ఆడిటోరియం’ త్వరలో నిర్మితం కానుంది. వందలాది మంది ప్రేక్షకులు ఒకేచోట ప్రదర్శనలు వీక్షించేందుకు వీలుకలగనుంది. ప్రస్తుతం వున్న ఆడిటోరియం స్థానంలో దీనిని నూతనంగా, అత్యాధునికంగా నిర్మిస్తారు. మినీ కాన్ఫరెన్స్ హాళ్లు, మీటింగ్ రూములు, విశాలమైన పార్కింగ్ ఇందులో వుంటాయి.

పవిత్రసంగమం దగ్గర గ్రాండ్ థియేటర్
ఇబ్రహీంపట్నంలోని పవిత్రసంగమం దగ్గర నదీముఖంగా అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ థియేటర్ కొలువు దీరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

హావలాక్ బ్రిడ్జి అభివృద్ధికి చర్యలు
100 ఏళ్ల నాటి రాజమహేంద్రవరం-కొవ్వూరు రైల్వే వంతెనను పర్యాటకరంగ అభివృద్ధి కోసం వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రైల్వే శాఖ నిర్ణయించిందని, ఇందుకోసం రూ. 12.50 కోట్లతో పాటు 1,044 చ.మీ. భూమిని ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖకు చెల్లించేందుకు అంగీకారం కుదిరినట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పాదచారులకు, సైకిలిస్టులకు, చిరు వ్యాపారులకు ఇది ప్రయోజనకారి కానుందని, పర్యాటకులను పెద్దసంఖ్యలతో ఆకట్టుకునేందుకు దోహదపడుతుందని చెప్పారు. ఈ వంతెనను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నం, ఎన్నో అంతర్జాతీయ సమ్మిట్లకు వేదిక అవుతూ వచ్చింది. తరుచూ విఐపి మూమెంట్స్ తో, అనేక సదస్సులతో, విశాఖ ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంది.

ఈ నెల 17న విశాఖ సందడి సందడిగా మారనుంది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెలలో 17 వ తేదీన విశాఖపట్నం వస్తున్నారు... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా, అదే రోజు విశాఖపట్నం వస్తున్నారు... ఇద్దరూ వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గుననున్నారు... T.సుబ్బ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కోసం అనేక రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులు కూడా విశాఖ రానున్నారు.

సినీ, రాజకీయ ప్రముఖుల అంతా, ఈ ఆదివారం విశాఖలోనే హడావిడి చెయ్యనుండటంతో, మీడియాలో కూడా ఇవే వార్తలు హుల్ చల్ చేయ్యనున్నాయి...

Advertisements

Latest Articles

Most Read