ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నప్పుడే ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె అయిన భువనేశ్వరీ దేవిని 1981, సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. భువనేశ్వరి-బాబు వివాహానికి నేటితో 36 వసంతాలు.

తెలుగు సినీ రంగంలో అగ్ర హీరో ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబు పెళ్లి ఎవరు కుదిర్చారు.? ఎన్టీఆర్‌తో చంద్రబాబునాయుడి పరిచయం ఎప్పుడు? పెళ్లికి ఎన్టీఆర్‌ కట్నం ఏమైనా ఇచ్చారా?... ఇలాంటి ఆసక్తికరమైన వ్యక్తిగత విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, కొన్ని రోజుల క్రితం, శాసనమండలి ఆవరణలోని విలేకరులతో పంచుకున్నారు.

జయకృష్ణ, విశ్వేశ్వరరావు పెళ్లి ప్రతిపాదన తెచ్చారు..
ఒకసారి నా ఇంటికి ముఖ్యమంత్రి అంజయ్యను... రామారావు గారిని పిలిచి వారి మధ్య సమావేశం ఏర్పాటు చేశాను. వర్తమాన అంశాల గురించి వారు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత జయకృష్ణ, మా బంధువు విశ్వేశ్వరరావు కలిసి ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరితో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు కూడా వారితో ఉన్నారు. మా పెళ్లి కుదిర్చింది వీరే. నేను సినిమా శాఖకు మంత్రిగా ఉండడం ఎన్టీఆర్‌ కుటుంబంతో సంబంధం ఏర్పడడానికి ఒక కారణం.

ఎన్టీఆర్‌ మీకు కట్నమేమైనా ఇచ్చారా?
‘నేను అడగలేదు. ఆయన ఇవ్వలేదు. అసలా ప్రసక్తే రాలేదు. నేను రాజకీయ నాయకుడిని కాబట్టి పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేయాలని అడిగాను. రామారావుగారు ఒప్పుకొన్నారు. మద్రా్‌సలో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ కుమార్తెను పెళ్లి చేసుకుంటున్నానని మా వాళ్లు ఇంటింటికీ వివాహ పత్రికలు పంచారు’ ‘పెళ్లయ్యాక హైదరాబాద్‌లో వెంగళరావు పార్కు దగ్గర కాపురం పెట్టాను. అక్కడ నాకు ఇబ్బందిగా ఉందనుకుని జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఉన్న ఇంటి స్ధలంలో నాకు ఇల్లు కట్టిస్తానని రామారావుగారు నాకు చెప్పారు. వద్దని చెప్పాను. రామారావుగారు ఎవరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పలేదని, ఆయనంతట ఆయన అడిగినప్పుడు ఒప్పుకోవడం మంచిదని మా అత్తగారు నా భార్య దగ్గర గొడవ పెట్టారు. అయినా, వద్దని చెప్పాను. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాను. ఇల్లు ఖాళీ చేసి మెహిదీపట్నంలో ఒక చిన్న ఇంటికి మారాను. అప్పటికి జూబ్లీహిల్స్‌లో బాలకృష్ణ ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆయన మద్రా్‌సలో ఉండేవాడు. దానితో రామారావుగారు మమ్మల్ని ఆ ఇంటికి మార్పించారు. అక్కడ ఇల్లు వద్దనుకున్నా చివరకు అదే స్ధలంలో కట్టిన ఇంట్లో ఉండక తప్పలేదు.’

మాజీ చీఫ్ సెక్రటరీ ఐ.వై.ఆర్‌ కృష్ణారావు, తను కప్పుకున్న ముసుగు పూర్తిగా తేసేసి, జగన్ ముసుగు కప్పి, అన్ని వదిలేసి లోటస్ పాండ్ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు... పదవి ఇచ్చిన చంద్రబాబు పైనే, కొంత మంది జగన్ పైడ్ ఆర్టిస్ట్ లోతో కలిసి, సోషల్ మీడియాలో అవహేళన చెయ్యటం చూసాం... ఇప్పుడు, ఏకంగా అమరావతి మీద విషం చిమ్ముతున్నాడు, ఈ మహానుభావుడు...

కాకినాడ ఎన్నికల ముందు లోటస్ పాండ్ స్క్రిప్ట్ ప్రకారం, మీడియా ముందుకు వచ్చి అధికార పార్టీపై విమర్శలు చేస్తూ, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించారు. తాజాగా నిన్న విజయవాడలో ఆయన నిర్వహించిన సదస్సులో రాజధాని అమరావతి పై విషం చిమ్మారు.

అమరావతి 270 ఎకరాలు చాలు, అన్ని ఎకరాలు ఎందుకు అని అడుగుతున్నారు.. అమరావతిలో రాబోయే కాలంలో విపత్తులు వస్తాయి అంటూ బెదిరిస్తున్నారు.. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అంటున్నారు..

నలుగురు ఉండటానికి 32 ఎరకల్లో ఈయన గారి బాస్ కి ప్యాలస్ కావలి... లోటస్ పాండ్ కావలి... 5 కోట్ల మంది గుండెల మీద తన్నిన ఆంధ్రులకి ప్రపంచ స్థాయి రాజధాని వద్దా ? పథకం ప్రకారం, ఒక పార్టీ ఆడించినట్టు ఆడటం, మీ వయసుకి, హోదాకి సబబేనా ?

అంటే ఈయన చీఫ్ సెక్రటరీగా పని చేసినప్పుడు ఎంత కుట్ర పన్నారో తెలుసా ? దొనకొండ రాజధాని కావాల్సిందే అని కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు... ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా, రహస్యంగా కేంద్రానికి నివేదించారు అంటే అర్ధం ఏంటి ? దొనకొండలో రాజధాని కావాలని ఏ ఒక్కరూ కోరుకోలా... అక్కడ భూములు పెద్ద ఎత్తున కొనుకున్న జగన్ బ్యాచ్ తప్ప... అంటే, వై.ఎస్‌.జగన్‌తో సంబంధాలు కొనసాగిస్తూ, ప్రభుత్వ రహస్యాలను ఆయనకు చేరవేశారనేది ఇప్పుడు తెలుస్తుంది... దొనకొండలో అసలు ఏమున్నాయని, ఆయన దొనకొండ రాజధాని కావాలని తపించారు ? ఉత్తరాంధ్ర వారికి, దొనకొండ రాజధాని చేస్తే ఎలా ? దొనకొండలో నీరు ఉందా ?

మరి ఎవరి కోసం, ఆ రోజు ఐ.వై.ఆర్‌ కృష్ణారావు నాటకం ఆడారు ? చీఫ్ సెక్రటరీగా ఉంటూ, ఇలా ఎన్ని ప్రభుత్వ రహస్యాలు లోటస్ పాండ్ కి చేరవేశారు ? ఇవన్నీ ప్రభుత్వం విచారణ చెయ్యాలి... ఇలాంటి వారు ఎన్ని కుట్రలు చేశారో, చేస్తున్నారో, ప్రభుత్వం తేల్చాలి...

చివరగా ఈయన ఎలా మాట మారుస్తున్నారో, ఎలా లోటస్ పాండ్ ట్యూన్ కి డాన్స్ వేస్తున్నారో చూడండి... అమరావతికి అన్ని ఎకరాలు ఎందుకు, 270 ఎకరాలు చాలు అంటున్నారు... మరి, ఆయన దొనకొండలో 54 వేల ఎకరాలు ఉన్నాయని, అక్కడే రాజధాని చెయ్యాలి అని కేంద్రానికి ఎందుకు నివేదిక పంపారు ?

జగన్ సోషల్ మీడియా పైడ్ బ్యాచ్ రెచ్చిపోయింది... ఏకంగా ఎమ్మెల్యేనే చంపేస్తాం అనే స్థాయికి వెళ్ళిపోయారు... ఎవరన్నా జగన్ ని కామెంట్ చేస్తే, ఇంట్లో ఆడవాళ్ళని కూడా లాగి, సంస్కారం లేకుండా పోస్ట్ లు పెట్టటం మనం చూస్తూనే ఉంటాం... కాని సామాన్య ప్రజలే కాదు, వీరి బారి నుండి ఎమ్మెల్యేలు కూడా తప్పించుకోలేక పోతున్నారు.. ఎమ్మెల్యే ఇంట్లో ఆడవాళ్ళని కూడా అసభ్యంగా చిత్రీకరిస్తూ పోస్ట్ లు పెట్టి, మానసికంగా క్షోభ పెడుతున్నారు...

విషయంలోకి వస్తే, టీడీపీ బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, జగన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అసభ్య పదజాలంతో మాట్లాడటం పై స్పందిస్తూ, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు.. ప్రతిపక్ష హోదాను మరచి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సబబు కాదని సలహాల ఇచ్చారు.

అంతే, జగన్ సోషల్ మీడియా పైడ్ బ్యాచ్ ఆ ఎమ్మెల్యే పై విరుచుకుపడింది. మా అన్ననే అనేంతటి వాడివా, నిన్ను చంపేస్తాం అంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగలేదు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పై కూడా, అస‌భ్య‌ ప‌ద‌ జాలంతో దూషిస్తూ పోస్ట్లు పెట్టారు..

వీటితో వైసీపీ నేత‌ల నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఆ ఎమ్మెల్యే బ‌ద్వేలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దళితుడిని కాబట్టే, నన్ను టార్గెట్ చేశారని, చంపినా చంపుతారని అన్నారు..

ఇలాంటి వారు, ఏమి చేసినా ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలి.... ఆక్షన్ తీసుకుంటే, సోషల్ మీడియా స్వేఛ్చ హరించారు అని, మేధావులు తయారు అవుతారు... ఇంతకు ముందు కూడా, ఇలాగే మహిళా ఎమ్మెల్యే పై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు ఒకడిని, అసెంబ్లీ, కౌన్సిల్ హాల్స్ ని బూతు సినిమాలతో పోలుస్తూ పోస్ట్ పెట్టినందుకు ఇంకొకడిని లోపల వేసినా వీళ్ళకి బుద్ధి రాలేదు... చివరకి ఎమ్మెల్యేనే చంపేస్తాం అనే స్థాయికి వెళ్లారు... ప్రభుత్వం ఇలాంటి వారి పట్ల కఠీనంగా ఉండాలి...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఅధ్యక్షుడు జగన్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. పెద్ద కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేర్పించేందుకు ఆయన లండన్ వెళుతున్నారు. కోర్ట్ పర్మిషన్ కూడా ఇచ్చింది.

అన్నీ బాగానే ఉన్నా, జగన్ కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. దాదుపుగా 12 రోజులు జగన్ లండన్ టూర్ ఉంటుంది. ఇంత క్లిష్ట పరిస్థుతుల్లో పార్టీని వదిలి ఇన్ని రోజులు జగన్ ఎందుకు వెళ్తున్నారో అర్ధం కావట్లేదు అంటున్నారు పార్టీ వర్గాలు... ఆయినే, ఈ 12 రోజులు పార్టీని ఎవరి చేతుల్లో పెట్టి వెళ్ళాలి అనేది, జగన్ తేల్చుకోలేక పోతున్నారు.

ఓ వైపు పార్టీ నేతల జంప్ చేస్తారని ప్రచారం, మరోవైపు వైఎస్సార్ కుటుంబం పేరుతో చేపట్టిన కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం.. వచ్చే నెల నుంచి పాదయాత్ర కోసం రూట్ మ్యాప్.. ఇవన్నీ వదిలేసి, జగన్ వెళ్ళిపోతున్నారు... ఈ దశలో, పార్టీని ఎవరికీ అప్పచెప్పాలి అనేదాని మీద జగన్ గందరగోళానికి గురవుతున్నారు... విజయసాయి రెడ్డికి బాధ్యత ఇవ్వాలా ? లేక ప్రశాంత్ కిషోర్ కి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు...

విజయసాయి రెడ్డి ఎక్కువగా ఢిల్లీలో ఉంటూ, ఢిల్లీ పెద్దలతో ఫోటోలు, బొకేలు ఇచ్చి వారిని కాకా పట్టే పని అప్పచెప్పారు... జగన్ కేసులు కీలక దశలో ఉన్న టైంలో, ఆయన ఢిల్లీ నుంచి వచ్చేస్తే, పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అలా అని, ఈ ప్రశాంత్ కిషోర్ కి అప్పచేప్పితే, డబ్బులు ఇచ్చి పెట్టుకున్నోడు పార్టీని నడుపుతున్నాడు అనే సంకేతం వెళ్తుంది... షర్మిలకు అప్పచెప్పి వెళ్దాం అంటే, ఆవిడి స్పీడ్ చుస్తే, ఎక్కడ పవర్ సెంటర్ అవుతుందో అని జగన్ భయం... దీంతో ఏమి తోచని పరిస్థితిలోనే, జగన్ లండన్ ప్రయాణం అవుతున్నారు...

Advertisements

Latest Articles

Most Read