నిత్యం వార్తల్లో ఉండాలి... చంద్రబాబు, పాలన మీద ఫోకస్ చెయ్యకుండా చెయ్యాలి అనే ఐడియా ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు జగన్, మరికొన్ని ఎన్నికలు జరపటానికి ప్లాన్ వేస్తున్నారు. కాని, తన పార్టీ వాళ్ళే ఆ ప్లాన్ కు సహకరించక పోవటంతో జగన్ అసహనంగా ఉన్నారు.

చంద్రబాబుని 20 మంది ఫిరాయిపు MLAల చేత రాజీనామా చేసి, ఎన్నికలకు రావాల్సిందిగా జగన్ ఛాలెంజ్ చేశారు. నిజానికి ఈ ఛాలెంజ్ వెనుక, జగన్ ప్రశాంత్ కిషోర్ కి వేరే వ్యూహం ఉంది. అదే, చంద్రబాబు పాలన మీద ఫోకస్ చెయ్యకుండా చెయ్యాలి అనే ఐడియా. కాని చంద్రబాబు దీనిలోని మర్మం కనిపెట్టి, ఆ ఛాలెంజ్ పట్టించుకోలేదు.

దీంతో జగన్, ఇప్పుడు మళ్ళీ తాను మోడీకి మాట ఇచ్చి వదిలేసిన "ప్రత్యక హోదా" పట్టుకోనున్నారు. తన MPలు చేత రాజీనామా చేయించి, "ప్రత్యక హోదా" కోసం మా చిత్తసుద్ధి ఇది అని చెప్పనున్నారు. కాని, జగన్ కు సొంత MPలు షాక్ ఇచ్చారు. 8 మందిలో, ముగ్గురు మాత్రమే, రాజీనామాకు ఒప్పుకున్నారు. మిగతావారు, మేము రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. మన మీద ప్రజల మీద ఏ అభిప్రాయం ఉందో తెలిసి కూడా, ఎలా రాజీనామా చెయ్యమంటారు, మీరు ఎలాగూ మునిగిపోయారు, మా రాజకీయ జీవితం కూడా నాశనం చేస్తారా అని MPలు వాపోయారు.

దీంతో జగన్ తీవ్ర అసహనానికి గురై, సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. నిజానికి, 2 MPలు బిజేపి లో చేరటానికి ఇప్పటికే నిర్ణయించుకున్నారు, మరి కొంత మంది తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు. ఇది పసి గట్టిన జగన్, వారు వేరే వెళ్ళకుండా, అలాగే ప్రజల్లో ప్రత్యెక హోదా సెంటిమెంట్, రెండు విధాలుగా ఉపయోగ పడుతుంది అని ప్లాన్ వేశారు... కాని యధావిధిగా ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయ్యింది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక విధ్యా సంస్థ రానుంది. ఇప్పటికే SRM, VIT యూనివర్సిటీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ అమరావతిలో ఏర్పాటు కానుంది.

ఇబ్రహీంపట్నం దగ్గర 20 ఎకరాల్లో అమరావతి అమెరికన్ ఆస్పత్రిని ఏర్పాటుచేసేందుకు ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. మొత్తం మూడు దశల్లో రూ. 600 కోట్ల పెట్టుబడితో, 700 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. దీనిని 2019 మార్చి నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.

నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించటంతో, కర్నూల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పేరుతో, పార్టీ నడుపుతున్న ఆ పార్టీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, పార్టీ మూసేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, త్వరలోనే ఆయ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్నారు అని సమాచారం.

2014 ఎన్నికలకు ముందుగా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో ప్రత్యేక రాయలసీమ కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2014లో కానీ, ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో కూడ బైరెడ్డికి ఆశించిన ఫలితం దక్కలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో రెండువందల ఓట్లు కూడ దక్కలేదు.

నంద్యాల ఫలితం వచ్చిన తర్వాత సినీ నటుడు బాలకృష్ణ, మంత్రి పరిటాల సునీత సమక్షంలో బైరెడ్డి రాజశే‌ఖర్‌రెడ్డి చర్చించారని సమాచారం. టిడిపిలో చేరేందుకు బైరెడ్డి ఆసక్తిని చూపారని సమాచారం. రాయలసీమను చంద్రబాబు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు అని, ఇక సొంత పార్టీ పెట్టి చేసేది ఏమి లేదు అని, అందుకే తెలుగుదేశంలో చేరిపోవాలని కార్యకర్తల సూచన మేరకు, బైరెడ్డి తన సొంత పార్టీ మూసేసి, తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో, కాపుల ఆగ్రహానికి గురై, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే...

అయితే ఈ ఎపిసోడ్ అంతా, జగనే దగ్గరుండి చేపించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి... వంగవీటి రాధ ప్రెస్ తో మాట్లాడిన తీరు చుస్తే, దీనికి ఊతం ఇస్తూ ఉన్నాయి. రాధ ఒక పక్క ఇలాంటి వెధవలను పార్టీ ప్రోత్సహించ బట్టే పార్టీ ఇలా ఉంది అంటునే, మా అరెస్ట్ తో ప్రభుత్వానికి సంబంధం లేదు అని కూడా అన్నారు.

ఇవన్నీ పక్కన పెడితే, సస్పెండ్ అయిన తరువాత, ఎవరన్నా మాట్లాడకుండా ఉంటారా ? రాధ అన్ని బూతులు తిడితే, కనీసం గౌతం రెడ్డి, వాటికి సమాధానం ఇవ్వలేదు.. అయినా, ఇప్పటి వరకు మూడు రోజులు అయినా, గౌతం రెడ్డి ఎందుకు మీడియా ముందుకు రాలేదు అనేది ఒక సస్పెన్స్...

అయితే తాజగా, గౌతం రెడ్డి ఇంటి ముందు, దసరా, దీపావళి శుభాకాంక్షలు అంటూ, జగన్ ఫోటులు వేసి ఉన్న బానేర్లు, ఫ్లెక్స్ లు చూసి, ప్రజలు అవాక్కయ్యారు. ఒక పక్క నిన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశాం అంటుంటే, ఇవెంతో అర్ధం కావట్లేదు..

అదీను వైసిపి వైఖరి చుస్తే మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. గౌతం రెడ్డిని సస్పెండ్ మాత్రమే చేశాం అని, డిస్మిస్ చెయ్యలేదు అని, త్వరలోనే వివరణ అడుగుతామని, తరువాత ఏమి చెయ్యాలో చూస్తాం అనటం వెనుక ఎదో మర్మం ఉంది అనే వంగవీటి వర్గం నమ్ముతుంది.

Advertisements

Latest Articles

Most Read