ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్, మళ్ళీ రెచ్చిపోయాడు... తన తండ్రి వర్ధంతి రోజు, తండ్రి గురించి చెప్పుకోకుండా, ఈ రోజు కూడా చంద్రబాబు మీద తిట్ల దండకమే. తండ్రి వయసు ఉన్న చంద్రబాబుని పట్టుకుని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తండ్రికి గౌరవం ఇస్తే కదా, తండ్రి లాంటి చంద్రబాబు గౌరవం ఇచ్చేది అంటారా... అదీ నిజమే...

జగన్ మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే, ఈ పిచ్చి వాగుడుకి, నంద్యాల ప్రజలు లాచి లాచి కొట్టారు, కాకినాడ ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసారు. అయినా జగన్ మారలేదు సరికదా ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు.

తాజాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని పురస్కరించుకొని పులివెందులలో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని అన్నారు. దీంతో అక్కడ కార్యకర్తలు మరో సారి అవాక్కయ్యారు. ఇతను మారడు, మన ఖరం ఇంతే అనుకుంటున్నారు. అంతే కాదు 6 నెలల తన పాదయత్ర పూర్తయ్యేలోపు, చంద్రబాబు పాలన కూడా అంతమైపోతుందని అని జగన్ అంటున్నారు.

ఏదైనా అది ఒక మాలోక ప్రపంచం... జనాలు బుద్ధి చెప్తే, తప్పులు సరి చేసుకోలేనోడు, పెద్దలని గౌరవించలేనోడు, 6 నెలలు కాదు, 60 సంవత్సరాలు తిరిగినా ఏమి ఉపయోగం ఉంటుంది.

పరిష్కార వేదిక 1100 ఒక పదునైన ఆయుధమని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం తన నివాసం నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు, బెల్ట్ షాపుల నియంత్రణపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా చేసేవారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. అన్ని రీచ్ ల వద్ద పకడ్బందీగా నిఘా పెట్టామని, తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఏ స్థాయివారినైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలనుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ర్పవ్యాప్తంగా ఇళ్లు నిర్మించుకుంటున్నవారు, మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ తీసుకున్నవారు, క్రెడాయ్ వంటి సంస్థలనుంచి కూడా సమాచారం సేకరిస్తున్నామన్నారు. ఇసుక కొనుగోళ్లపై సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న విషయం గుర్తుచేశారు. ఆ సమాచారాన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు పంపుతున్నామన్నారు. ‘‘ఇసుక,మద్యం సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలి, పూర్తిగా ప్రక్షాళన జరగాలి. రాజీపడే ప్రసక్తేలేదు, ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

మీరు చేయలేకపోతే నేనే రంగంలోకి దిగుతా:
మీరు చేయలేకపోతే నేనే రంగంలోకి దిగుతా, రీచ్ ల వద్దకొచ్చి నేనే చర్యలు తీసుకుంటానని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా హెచ్చరించారు. ఏ రీచ్ వద్ద ఏ బండిలో ఎంత ఇసుక వెళ్తుందో బండి నెంబర్ తో సహా ట్యాబ్ లలో నమోదు చేయాలని ఆదేశించారు. కొనుగోలు దారులు ఎదుర్కొన్న ఇబ్బందులను కాల్ సెంటర్ ద్వారా అడిగి తెలుసుకోవాలి. ఆ సమాచారాన్ని సంబంధిత జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలకు పంపాలి. కైజాలా యాప్ లో శాండ్ టాస్క్ ఫోర్స్ గ్రూప్ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్, ఎస్సీ ఈ గ్రూప్ లో ఖచ్చితంగా ఉండాలి. అభిప్రాయ సేకరణలో ఇసుక కొనుగోలు తేదిని కూడా అడగాలి.

రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాపు ఉన్నా సహించేదిలేదు:
‘‘రాష్ట్రవ్యాప్తంగా ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండటానికి వీల్లేదు. వీథి,వీథి గాలించాలి,అణువణువూ తనిఖీ చేయాలి. ద్విచక్ర వాహనాల ద్వారా రవాణా, అమ్మకాలు చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలి. తమ బజారులో, తమ ఇంటివద్ద బెల్ట్ షాపు ఉందని ఏ మహిళా కాల్ సెంటర్ కు ఒక్క ఫిర్యాదు కూడా చేసే పరిస్థితి ఉండకూడదు. బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలి,అక్రమ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు చేపట్టాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బెల్ట్ షాపులకు సంబంధించి ఇప్పటివరకు 3165 కేసులు పెట్టామని, 3422మందిని అరెస్ట్ చేశామని, 13,436లీటర్ల మద్యం, 98వాహనాలు సీజ్ చేశామని, 108 ఏ4 దుకాణాల లైసెన్స్ లను సస్పెండ్ చేశామని ఎక్సైజ్ అధికారులు వివరించారు.

ప్రజలు ‘‘మంచిని మంచి అంటారు,చెడును చెడు అంటారు’’:
మంచిని మంచి అంటారు,చెడును చెడు అంటారు అని అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏదైనా సరే ఉన్నదున్నట్లుగా ప్రజలు మాట్లాడతారని, వారికి ఎటువంటి భేషజాలు ఉండవని చెప్పారు. ప్రజాభిప్రాయానిదే ప్రజాస్వామ్యంలో అంతిమవాక్కుగా తెలిపారు. తప్పు చేసినవారిని శిక్షించడంలో ఉపేక్షించకండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల కలెక్టర్లు,ఎస్సీలతో అన్నారు.
ప్రజల్లో 80% సంతృప్తి రావాలి, అందరూ సమర్ధంగా పనిచేయాలి, ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరచాలి,వారిలో అవగాహన పెంచాలి.ప్రజల్లో మరింత సంతృప్తి,మరింత ఆనందం,అదే మనందరి లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకం చేశారు.

సుస్థిర ఆర్ధికాభివృద్ది, పారదర్శక పాలన ద్వారా రాజకీయ సుస్థిరత్వం:
సుస్థిర ఆర్ధికాభివృద్ది, పారదర్శక పాలన రాజకీయ సుస్థిరత్వానికి సోపానాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇవి మూడు ఉంటే అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపే ఉంటాయని తెలిపారు. రెండంకెల వృద్ది, పారిశ్రామిక పురోగతి,జలవనరుల అభివృద్ది,వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతి కేవలం మూడేళ్లలోనే సాధించామని గుర్తుచేశారు. అటు అభివృద్ది, ఇటు సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోతున్నామన్నారు. పారదర్శక పాలన, సుస్థిర ఆర్ధికాభివృద్ది,రాజకీయ స్థిరత్వం సాధిస్తే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అవుతుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు.

ఇది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం కాదు... ఇది ఒక వైకాపా పార్టీకి సంబంధించిన విషయం కాదు... ఇది ప్రజలకి, చంద్రబాబుకి మధ్య ఏర్పడిన బంధం... మాకు అభివృద్ధి మాత్రమే కావలి, మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే మీరే ఉండాలి అని ప్రజలు ఇస్తున్న తీర్పు ఇది.... ఇది మూడ్ అఫ్ నవ్యాంధ్ర.... మాకు అభివృద్ధి మాత్రమే కావలి, అభివృద్ధి చేసే వాడే కావలి.... కుల, మత, కుట్ర రాజకీయాలు మాకొద్దు...

ఈ సందర్భంగా, ప్రతి పక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కూడా మారాలి అని కోరుకుంటాం... ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపాలి, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి అని కోరుకుంటాం... ఆయన అలా చేస్తాడో లేదో, ఆయనకే తెలియాలి... కాని, జగన్ కంటే ముందు మారాల్సింది, హైదరాబాద్ మీడియా.... ఆంధ్ర రాష్ట్రం మీద హైదరాబాద్ మీడియా చేమ్మే విషం.... నవ్యాంధ్ర మీద, మీరు చూపించే నెగటివ్ ఆటిట్యూడ్.... ఇవన్నీ మారాలి.. మారండి... ఇది మా నవ్యాంధ్ర ప్రజల మూడ్....

రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పధకాలు ఉన్నాయి.... చాలా వరకు ప్రజలకి తెలియటం లేదు... ప్రజలకు తెలియచేసి, లభ్దిదారులకి తెలియచేయండి... దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పనులు జరుగుతున్నాయి, ప్రజలకి తెలియ చేయండి... పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, అభివృద్ధి ఎలా జరుగుతుందో ప్రజలకు చెప్పండి.... పట్టిసీమ లాంటి దేశం గర్వించే ప్రాజెక్ట్లు నిర్మించిన చరిత్ర మాది... ఇవి కూడా చూపించండి... అదే విధంగా ప్రభుత్వం చేసే తప్పులు కూడా చూపించండి.... కాని దయ చేసి, మీ హైదరాబాద్ మీద ఉన్న వ్యామోహంతో, మా మీద విషం చిమ్మకండి...

జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ నెల నుంచి చేయాలనుకునే పాదయత్ర చెయ్యలేడా ? అన్న వస్తున్నాడు అని ప్లీనరీ సాక్షిగా చెప్పిన జగన్, పాదయాత్రతో దాదాపు 6 నెలలు ప్రజల్లో ఉండాలి అని ప్లాన్ వేశారు.

కాని ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్ చూసి, పాదయాత్ర చేసినా ఉపయోగం ఉంటుందా ? ఆరోగ్యం పాడు చేసుకోవటం తప్ప, ఏమి లాభం లేదు అనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే కోర్ట్ ద్వారా ప్రజలకు చెప్పించే ఐడియా వేశారు విజయ సాయి రెడ్డి.

ఎలాగూ జగన్ మీద ఉన్న కేసుల్లో, ప్రతి శుక్రువారం కోర్ట్ కి వెళ్ళటం తప్పదు. అందుకే కోర్ట్ లో శుక్రువారం కోర్ట్ కి రాకుండా మినహాయింపు ఇవ్వాలి అని కోర్ట్ లో పిటీషన్ వేశారు. కాని, కోర్ట్ కుదరదు అని చెప్పింది. జగన్ కు కావాల్సిన తీర్పు వచ్చింది. ఈ సందర్భంలో కోర్ట్, జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది.

దీంతో, జగన్ ఈ కారణం చూపించి, పాదయాత్ర రద్దు చేసుకుని, బస్సు యాత్ర చెయ్యాలి అనే ప్లాన్ లో ఉన్నారు అంట. ఈ విషయం మీడియాలో లీక్ ఇచ్చి, ప్రజలు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఒక నిర్ణయానికి రానున్నారు. ఒక వేళ పాదయాత్రే చెయ్యాల్సి వస్తే, శుక్రువరం కోర్ట్ కి వెళ్ళాలి కాబట్టి, గురువారం మధ్యానం నుంచి పాదయాత్ర ఆపేసి, శుక్రువారం కోర్ట్ కి వెళ్లి, శని, ఆదివారాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ సోమవారం మొదలు పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం.

ప్రజా సమస్యలు మీద పోరాడకుండా, రాజకీయ యాత్రలు చేస్తే, ప్రయోజనం ఉండదు అని నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ప్రజా తీర్పు స్పష్టంగా ఉండటంతో, ఎక్కువ శ్రమ తీసుకోకుండా, పాదయాత్ర వాయిదా వెయ్యాలి అనే ఆలోచన వైపే జగన్ మొగ్గు చూపుతున్నారు అని లోటస్ పాండ్ వర్గాలు అంటున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వం టాప్ గేర్ లో ఉంది... ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్.. రెండూ బాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది... పేదలకు ఇల్లు కట్టిస్తున్నాం అని ప్రభుత్వాలు చెప్పటం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం... కాని అవన్నీ పేపర్ లోనే ఉంటాయి.. బయట కనిపించవ్... కాని చంద్రబాబు ఇల్లు లేని ప్రతి పేదవాడికి, ఇల్లు కాట్టిస్తున్నారు.. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది.

గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పండుగను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకూ కట్టిన లక్ష ఇళ్లలో ఒకేసారి గృహప్రవేశాలు జరిగేలా కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. అదే రోజు మొత్తం 5 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read