ఆంధ్రప్రదేశ్ లో నూతన సంవత్సరం, జనవరి ఒకటో తారీఖున, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు మరోసారి నిరాశ ఎదురైంది. గత నెలలో ఒకటో తేదీనే పెన్షన్లు వేసి మురిపించిన ప్రభుత్వం, ఆ తరువాత మళ్ళీ పాత విధానానికే ఈ ఏడాది వచ్చింది. గత నెల కంటే ముందు, ప్రతి నెల 15వ తేదీ వరకు పెన్షన్లు వేస్తూనే ఉన్నారు. ఈ నెలలో మాత్రం, పెన్షన్లు ఒకటో తేదీన వస్తాయని పెన్షనర్లు ఎదురు చూస్తుంటే, ఈ రోజు సాయంత్రం వరకు వారికి నిరాశే ఎదురైంది. ఉద్యోగ విరమణ చేసిన తరువాత, ఆ వచ్చే పెన్షన్ తోనే, గడిపే పెన్షనర్లు, కుటుంబ అవసరాల కోసం, ఆరోగ్య అవసరాల కోసం వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వారికి పెన్షన్లు రాక పోవటంతో, రాష్ట్రంలో ఉండే నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఒక్కసారిగా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ రోజు బ్యాంక్ ఎకౌంటులు పరిశీలించిన పెన్షనర్లు, పెన్షన్ లు పడక పోవటంతో, వారు అంతా కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో పాటుగా, ఉద్యోగస్తులకు కూడా, దాదాపుగా సగం మందికి, ఇప్పటికీ సాయంత్రం వరకు సగం మందికి జీతాలు పడలేదు. సాయంత్రం వరకు పెన్షన్లు పడలేదని, పెన్షనర్ల సంఘం నేతలు, అలాగే చాలా మందికి ఇంకా జీతాలు కూడా పడలేదు అంటూ, ఉద్యోగ సంఘ నేతలు కూడా వివరించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి తలకిందులు కావటం వల్లే, ఎకౌంటులో డబ్బులు లేక పోవటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు పడలేదని చెప్తున్నారు. అయితే రేపు ఆదివారం సెలవు కావటంతో, ఇక సోమవారం వరకు కూడా, పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే జీతాలు సర్దుబాటు అవుతాయి కానీ, పెన్షనర్లకు మాత్రం, ఈ నెల కూడా లేట్ అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. కేవలం ఒక నెల మురిపించి ఫస్ట్ తారీఖు ఇచ్చారని, ఇప్పుడు మళ్ళీ, ఈ నెల నిరాశలోకి నేట్టేసారని అన్నారు. ఒక వైపు పీఆర్సీ కోసం, తమ ఇతర డిమాండ్ల కోసం ఆందోళన చేపట్టిన ఉద్యోగులు, చీఫ్ సెక్రటరీ హామీతో ఆందోళన విరమించారు. అయితే చట్టబద్ధంగా ఒకటో తారీఖు ఇవ్వాల్సిన జీతాలు కూడా, రాకపోవటంతో, ఇప్పుడు ఉద్యోగులు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తలకిందులు అవ్వటంతో, జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేక పోతున్నాం అని, ఆదుకోవాలి అంటూ, ఈ మధ్య వైసీపీ ఎంపీలు కూడా, పార్లమెంట్ లో చెప్పిన విషయం అందరూ చూసారు.