వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీని సిబిఐ టార్గెట్ చేసింది. ఎంపీ రఘురామకృష్ణరాజుతో సహా 16 మందిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకులకు రూ.947.71 కోట్లు నష్టం కలిగించిన కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినట్టు తెలిపింది. 2019 ఏప్రిల్ 29న కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టింది. రఘురామరాజుకు చెందిన, ఇండ్ భారత్ పవర్ మద్రాస్ సంస్థకు చెందిన 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిబిఐ. 2018 అక్టోబర్ లో రిజిష్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సీబీఐ ఇప్పుడు విచారణ చేసింది. ఇండ్ భారత్ పవర్ సంస్థ, డైరెక్టర్ ల పై సీబీఐ విచారణ చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.947.71 కోట్లు సంస్థ తీసుకున్నట్టు తెలుస్తుంది. తమిళనాడు టుటికోరిన్ లో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రుణాలు ఇచ్చారు. అయితే నిబంధనలు పాటించకుండా.. నిధులు దారి మళ్లించానేది సీబీఐ ఆరోపణ. విచారణ అనంతరం చార్జిషీటు దాఖలు చేసినట్లు సీబీఐ ప్రకటన చేసింది. త్వరలోనే సిబిఐ రఘురామరాజుని విచారణ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక వైసిపీ ఉందని, మొదటి నుంచి రఘురామరాజు ఆరోపిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం చేసిన పనితో ఇబ్బందులు వచ్చాయని, ఇది కోర్టులో కూడా ఉన్నట్టు చెప్తున్నారు.
సిబిఐ రఘురామరాజు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయటంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రఘురామరాజుని టార్గెట్ చేయటం మొదలు పెట్టింది. రఘురామరాజు త్వరలో జైలుకు వెళ్తారని, సిబిఐ అరెస్ట్ చేస్తుందని ప్రచారం మొదలు పెట్టారు. దీని పై రఘురామరాజు తనదైన శైలిలో స్పందించారు. ఈ రోజు తన పై పత్రికల్లో కధనాలు వచ్చాయని, సాక్షి అయితే ఇంకా పెద్దగా రాసిందని, తన పైన దాఖలైన చార్జ్ షీట్ విషయంలో సంతోషంగా ఉన్నానని, ఇది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని, ఇప్పుడు నాకు కోర్టుకు వెళ్లి వాదనలు వినిపించుకే అవకాసం వచ్చిందని, కోర్టులోనే ఈ విషయం పై నిజా నిజాలు బయటకు వస్తాయని అన్నారు. కంపెనీల మధ్య సివిల్ డిస్ప్యూట్ అని, అంతే కాని క్రిమినల్ ఆక్టివిటీ కాదని అన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో జెన్ కో, బకాయలు రాక ఎలా దివాళా తీసిందో, తన కంపెనీ కూడా అలాగే అయ్యిందని, ఇది కోర్టులో వీగిపోతుందని అన్నారు. రేపో మాపో జైలుకు పోయే అరంగుళం వెధవల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.