కులం కులం కులం... దేశంలో మొత్తం అనేక రాష్ట్రాల్లో, ప్రజలకు అభివృద్ధి కంటే , కులమే ఎక్కువ. కులం ఉంటే చాలు. ఏమి అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొంత ఎక్కువే. అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వారికి, కులం కుంపట్లు పెట్టి చలి కాచుకోవటం బాగా ఈజీ అయిపొయింది. సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా వచ్చిన లోక్ సత్తా పార్టీ, అడ్డ్రెస్ లేకుండా పోయింది. తరువాత జేడీ లక్ష్మీ నారయణ వచ్చారు. ఆయనే ఏ పార్టీ పెట్టకపోయినా, ఆయన అంటే ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో ఉంది. గతంలో జనసేన నుంచి పోటీ చేసినా, ప్రస్తుతం ఆయన ఒక మేధావిలా, అన్ని విషయాల పైన తన అభిప్రాయాలు తెలియ చేస్తూ, ఆయన పంధాలో ఆయన వెళ్తున్నారు. అయితే ఇంత మంచి పేరు ఉన్న జేడీ లక్ష్మీనారాయణ కూడా, కులానికి లొంగి పోయారు. రెండు రోజుల క్రితం కాపు నాయకులు అందరూ కలిసి కూర్చున్న సమావేశంలో, జేడీ లక్ష్మీనారాయాణ కూడా కనిపించటం పలువురిని ఆశ్చర్య పరిచింది. రాజకీయాల్లో కాపులు బలపడాలి అనే అజెండాతో జరిగిన సమావేశంలో, జేడీ పాల్గునటం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇలాంటి వాళ్ళు కూడా, ఇలాంటి కుల మీటింగ్‌లలో పాల్గుంటే, ఇక ఈ రాష్ట్రం, కుల పిచ్చ నుంచి ఎప్పటికి బయటకు వస్తుందో అని బాధ పడుతున్నారు.
news
ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బొప్పరాజు..
ఉద్యోగ సంఘాల మధ్య ప్రభుత్వం చర్చలు ఇంకా ఇంకా ఇంకా సాగుతూనే ఉన్నాయి. గతానికి భిన్నంగా ఉద్యోగ సంఘాలు వేడుకునే ధోరణిలో ప్రభుత్వం ముందు మోకరిల్లారు. ఈ రోజు కూడా ప్రభుత్వం ముందు చర్చలకు వెళ్ళారు. చర్చలు తరువాత ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతాలకు 33 శాతం ఖర్చు పెడుతున్నారని, కానీ వందశాతమని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చాయని ప్రభుత్వం అంటోందని అన్నారు. ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందని, తమ సమస్యలు ఏమి పరిష్కరించటం లేదని అన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను యథావిధిగా అమలు చేయాలని ఆయన తెలిపారు. ఎన్నిసార్లు చర్చలకు పిలిచి అవమానించినా వస్తూనే ఉన్నాం అని అన్నారు. ఈ విధమైన చర్చలు గతంలో ఎప్పుడూ జరగలేదని, తమను సీఎం దగ్గరకు తీసుకెళ్తే ఆయనతోనే మా సమస్యలు చెప్పుకుంటాం అని అన్నారు. రూ.6 వేల కోట్లు సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు ఉన్నాయని, మాకు డబ్బులు ఇవ్వకుండానే ట్యాక్స్‌లు కట్ చేసుకున్నారని అన్నారు. ట్యాక్సులు కట్ చేసుకోడానికే డీఏ ప్రకటించారని సంచలన వ్యాఖ్యలు చేసారు. పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దుపై సీఎం స్పష్టత ఇవ్వాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేసారు.
రాజధాని అమరావతి భూములపై సంచలన విషయాలు బయటకు... అమ్మకానికి పెట్టారా ?
రాజధాని అమరావతి భూములు పై సంచలన విషయం బయటకు తెచ్చారు బీజేపీ నేత లంకా దినకర్. ఆయన మాట్లాడుతూ, అమరావతి భూములు అమ్మకానికి పెట్టి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అప్పు తెచ్చినట్టు చెప్పారు. ఆయన మాటల్లోనే "AP CRDA రద్దును వెనక్కి తీసుకున్నాక AMRDA 2021 డిసెంబర్ 9 నాటికి రద్దయినట్టు కదా? - మరి అమరావతి భూముల అమ్మకం ద్వారా అప్పు తీరుస్తామని 2021 డిసెంబర్ 9న సంతకాలతో AMRDA ద్వారా రూ.2,994.46 కోట్ల అప్పు ఎలా చేస్తారు? - అప్పుకోసం రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ రూ.765.58 కోట్ల కోసం ఇప్పటివరకు అమరావతిలో పూర్తిచేసిన కొన్ని కట్టడాలు చూపారు - మరి అమరావతిలో ఏమీలేదు శ్మశానం అన్నారు కదా? - ప్రభుత్వ మార్జిన్ మనీ రూ.765.58 కోట్లు APCRDA పరిధి కింద సృష్టించబడనప్పుడు ప్రస్తుతం లేని AMRDA కింద ఎలా చూపుతున్నారు? - APCRDA రద్దును వెనక్కి తీసుంది.. అమరావతి భూములు భవిష్యత్‌లో అమ్మి ఇప్పుడు చేసే అప్పులు తీర్చడానికేనా? - దీనికి సీఎం జగన్ సమాధానం చెప్పాలి" అన్నారు బీజేపీ నేత లంకా దినకర్. మరి ఈ విషయం పై ప్రభుత్వ వర్గాలు ఏమి చెప్తాయో చూడాలి.
చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన రాధా ? రేపు భేటీ కానున్న రాధా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ని వంగవీటి రాధా కోరినట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు అమరావతి వస్తున్నారు. రేపు చంద్రబాబు నివాసం వద్దే, వంగవీటి రాధా, చంద్రబాబుని కలిసే అవకాసం ఉందని చెప్తున్నారు. రాధా పై రెక్కీ నిర్వహించారని తెలియగానే, విదేశాల్లో ఉన్న చంద్రబాబు, రాధాకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు, రాధా సెక్యూరిటీని తిప్పి పంపటం పై చంద్రబాబు ఆక్షేపిస్తూ, సెక్యూరిటీని ఉంచుకోవాలని, పరిస్థితి బాగాలోదని, రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు. దీంతో ఈ రోజు చంద్రబాబు అమరావతి వస్తూ ఉండటంతో, రాధా రేపు చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాసం ఉందని తెలుస్తుంది. జరిగిన పరిణామాలు మొత్తం, రాధా , చంద్రబాబుకి వివరించే అవకాసం ఉంది. ఇక పోతే, విచారణ ప్రారంభించిన పోలీసులు, రాధా నివాసం ప్రాంతంలో, అనుమానస్పద కారుని గుర్తించారు. ఒకే రోజు అటూ ఇటూ మూడు నాలుగు సార్లు కారు సంచరించినట్టు గుర్తించారు. ఆ కారు పై పోలీసులు ఆరా తీస్తున్నారు.