హైదరబాద్ లో, గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఐటి దాడుల్లో, ఐటి అధికారులకు, కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ లోనూ అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో, ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది. అయితే అందులో కృష్ణా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి వెళ్లి అక్కడ, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ భూములు కొనుగోళ్ళు చేయటం, అమ్మకాలు, ఇలా ఈ భూములు లావాదేవీల్లో అందె వేసిన చేయి ఉంది అతనికి. అయితే, గత ఏడాది పైగా కాలంలో, ఇతని వ్యాపార లావాదేవీలు, మూడు ఇంతలు పెరిగినట్టుగా కూడా, సమాచారం అందుతుంది. ఈ నేపధ్యంలోనే లావాదేవీలు పెరగటంతో, ఐటి అధికారులు కన్ను పడింది. ఒక్కసారిగా ఈ వ్యాపారి, ఇన్ని లావాదేవీలు నిర్వహించటం ఏమిటి ? ఇతనికి ఎక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి ? అనే అంశం పై ఐటి అధికారులు ఆరా తీసి, అతని నివాసం, కార్యాలయం పై, దా-డు-లు ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం వరకు బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయగా, ఇప్పుడు కూడా అక్కడ రైడ్స్ కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు అతని బ్యాంకు ఖాతాలోకి దాదాపుగా వంద కోట్ల రూపాయలు, బ్లాక్ మనీ ఫ్లో అయినట్టు కూడా, ఐటి అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

raids 29122021 2

ఈ నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి ? ఎవరి ఖాతాల నుంచి ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయ్యాయి ? లేదా తీసుకొచ్చి, నేరుగా ఎలా డిపాజిట్ చేయగలిగారు అనేది కూడా, ఐటి అధికారులు కూపీ లాగుతున్నారు. అయితే ఇతను కృష్ణ జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలక నేత సన్నిహితుడు అనే సమాచారం అందటంతో, ఈ డబ్బులు ఏవైనా అక్కడ నుంచి వచ్చాయా అనే సమాచారం లాగుతున్నారు. అయితే సోర్స్ అఫ్ ఇన్కమ్ ఎక్కడ నుంచి వచ్చింది అనేది , ఇప్పుడు ఐటి అధికారులు అంతుపట్టటం లేదు. ఎందుకంటే, ఈ వ్యాపారికి అంత పెద్ద మొత్తంలో డీల్ చేసే కెపాసిటీ లేదు, ఫైనన్షియల్ కెపాసిటీ లేదని ఐటి అధికారులు అనుమానంగా ఉంది. ఏదైనా ఒక ఎకౌంటు నుంచి ఒక ఎకౌంటు కి ట్రాన్స్ఫర్ అయితే, ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్ళింది అనేది, ఈజీగా ట్రేస్ చేయవచ్చు కానీ, ఈ అమౌంట్ మొత్తం తీసుకొచ్చి ఆ బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ గా డిపాజిట్ చేయటం, అనే దాని పై ఆరా తీస్తున్నారు. రెండేళ్ళ నుంచి ఈ డబ్బులు ఫ్లో ఉన్నట్టు ఐటి అధికారులు గుర్తించారు. అయితే ఐటి అధికారులు దీని పై ఇంకా అధికారికంగా ధ్రువీకరించ లేదు. ఈ తనిఖీలు కూడా, బెంగుళూరు, ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కీలక నేత సన్నిహితుడు కావటంతో, ఇప్పుడు ఇది చర్చనీయంసం అయ్యింది.

వంగవీటి రాధా గగన్‌మెన్లవిషయం పై హైడ్రామా కొనసాగుతుంది. రాధాపై ప్రత్యుర్ధులు రెక్కి నిర్వహించారనే సమాచారంతో పోలీసులు అ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం రాధా భద్రత కోసం 2+2 గన్ మెన్లను కేటాయించినట్లు ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించింన ప్రకారమే నిన్న రాధా కార్యాలయానికి ఒక గన్ మెన్ చేరుకున్నారు. నిన్న ఉదయం ఆ గన్ మెన్ చేరుకున్నప్పటికి కూడా రాధా వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్ల సాయంత్రం వరకు కూడా తన కార్యాలయానికి చేరుకోలేదు. ఈ నేపధ్యంలో నిన్న సాయంత్రం కార్యాలయానికి చేరుకున్న తరువాత తనకు ఎటువంటి గన్ మెన్ అవసరం లేదని గన్ మెన్ ని తిప్పి పంపించేసారు. అయితే రాధా గన్ మెన్లను తిప్పి పంపించినప్పటికి తిరిగి ఈ రోజు ఉదయం యధావిధిగా ఒక గన్ మెన్ కార్యాలయానికి చేరుకుని, అక్కడ తాను విధులు నిర్వహించటానికి వచ్చినట్టు రాధా సన్నిహితులుతో చెప్పారు. అయితే రాధా తనకు ప్రభుత్వం తరపు ఇచ్చే భద్రత అవసరంలేదని చెప్పను కదా మళ్ళి ఎందుకు వచ్చారని రాధా సన్నిహితులు కొంత మంది ఉన్నతాదికారులతో మాటలదినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం తాము ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే గన్ మెన్లను పంపించినట్టు తెలిపారు.

radha 29122021 2

అయితే ప్రభుత్వం మొదట 2+2 గన్ మెన్లను అని ప్రకటించింది. అయితే నిన్న గాని, ఈ రోజు గాని రాధా కార్యాలయానికి ఒకే గన్ మెన్ వచ్చారు. అంటే ప్రభుత్వం ప్రకటించింది ఒకటి, ఇక్కడ క్షేత్ర స్థాయిలో జరిగింది ఒకటి. దీనికి సంబంధించి కొంత మంది పోలీసు అధికారులతో మాట్లాడితే, రేపటి నుంచి ఇద్దరు గన్ మెన్లను పంపిస్తామని అన్నారు. మరి ఈ సెక్యూరిటీ అంశంలో రాధా ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదే విధంగా రాధాకి ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి, సెక్యూరిటీ తిరస్కరించటం సరి కాదని, థ్రెట్ ఉన్నప్పుడు భద్రత విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని రాధాకు హిత బోధ చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు అని, రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయని, ఈ నేపధ్యంలో ఈ కుట్ర రాజకీయాల పై పార్టీ పరంగా పోరాటం చేద్దాం కానీ, భద్రత విషయంలో మాత్రం అశ్రద్ధ వద్దని రాధాకి జాగ్రత్తలు చెప్పారు. మరి ఈ అంశం పై రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది.

వైస్ వివేకా హ-త్య కేసు చివర దశకు చేరుకుకుండటంతో రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో నిందితులు ఏకంగా సీబీఐ దర్యాప్తు అధికారులపైనే, ఆరోపణలు చేయటం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ పరిణామంతో ఒక పక్క సీబీఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఈ కేసును పరిష్కరించాటానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటారో చూడాలి. అయితే సీబీఐ అధికారుల దగ్గర ఉన్న ముఖ్య ఆధారం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. కీలక నిందితుడుగా భావిస్తున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఒక సర్జరీ కోసమని రిమ్స్ లో జాయిన్ అయ్యారు. అయితే దీని కోసం కుడా శివశంకర్ రెడ్డి కోర్ట్ పర్మిషన్ తీసుకోలేదని, కోర్ట్ చురకలు అంటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముఖ్య నిందితుడుని కోర్ట్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా రిమ్స్ కు ఎలా పంపిస్తారని, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే రూల్స్ ని పాటించి, ముందు కోర్ట్ దగ్గర అనుమతి తీసుకోని వెళ్ళాలని హెచ్చరించింది. అయితే తాజాగా శంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు జరిపించాలని, ఆ పరీక్షలు చేస్తేనే నిజా నిజాలు బయటకు వస్తాయని సీబీఐ అభిప్రాయపడుతుంది. దాని గురించే సీబీఐ కోర్టులో అనుమతి కోసం పిటీషన్ వేసింది. నిబంధనలు ప్రకారం నిందితుల అంగీకారంతోనే నార్కో పరీక్షలు నిర్వహించాలి.

viveka 29122021 2

గతంలో కూడా కొంతమంది అనుమతి లేకుండానే నార్కో టెస్టులు చేయాలని ప్రయత్నించగా ఆ నిందితులు కోర్ట్ దగ్గర తాము నార్కో పరీక్ష కు వ్యతిరేఖత వ్యక్తం చేయటంతో కోర్ట్ ఆ టెస్టులు నిలిపి వేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఈ నార్కో పరీక్షకు శివశంకర్ రెడ్డి తాను ఒప్పుకోను అంటూ కోర్టుకు తెలిపారు. దీంతో మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి. ఈ పరీక్ష నిర్వహిస్తేనే నిజాలు బయటకు వస్తాయని సీబీఐ అభిప్రాయ పడుతుంది. శంకర్ రెడ్డి ఈ నార్కో పరీక్షకు వ్యతిరేఖత తెలిపటంతో, ముఖ్య నిందితులుగా అభియోగం ఎదుర్కుంటున్న శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరి పైన అనుమానాలు ఇంకా పెరిగిపోయాయి. ఈ కేసుకు సంభందిచిన నిజాలు బహిర్గతం అవుతాయనే నార్కో టెస్టులుకు భయపడుతున్నారని అని విమర్శలు ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ అనుమానాలన్నీ వాళ్ళకు కొత్తేమీ కాదు బట్టి, సీబీఐ వాళ్ళు ఎంత అనుమానించినా సరే దేవిరెడ్డి శంకర్ రెడ్డి నార్కో టెస్టులకు ఒప్పుకోవటం లేదు. మరి సిబిఐ అపీల్ కి వెళ్తుందో లేదో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ లో ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వారు ఉండరు. చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాటం అంటూ తెగ హడావిడి చేసే వారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా పెద్ద రచ్చ చేసేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన తీరు మరోలా ఉందని విమర్శలు ఎదుర్కుంటున్నారు. అప్పుడు అంతలా రచ్చ చేసిన ముద్రగడ ఇప్పుడు మాత్రం వైసీపీ ప్రభుత్వం ఏకంగా రిజర్వేషన్లు తీసేసినా ఎందుకు ఏమి మాట్లాడటం లేదని సర్వత్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఆ విమర్శలను తాను ఎదుర్కోలేనని, అందుకే తాను కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాటం నుంచి తప్పుకునుంటున్నానని స్యయంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు నుంచి కనీసం కాపులను ఉద్దేశించి గాని, రిజర్వేషన్లు గురించి గాని మాట్లాడటం లేదు.పైగా ఆయన చేస్తున్న పని ఏంటంటే, కోడి పందేలు గురించి జగన్మోహన్ రెడ్డికి, అదేదో జాతీయ సమస్య గురించి ప్రధాని మోడికి లేఖలు రాసినట్టు రాస్తున్నారు. అయితే ఇప్పుడు ముద్రగడ మళ్ళీ రాజకీయంగా అలెర్ట్ అవుతున్నారు. తాజాగా ముద్రగడ పద్మనాభం ఇంటికి కొంతమంది నేతలు తరుచుగా వస్తున్నారు. కాని వచ్చే వారు అంతా కాపు నేతలు కాదని, ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గానికి సంభందించిన నేతలని ముద్రగడ వర్గం చెప్తుంది.

mudragada 29122021 2

ముద్రగడను కొత్త పార్టీ పెట్టమని కోరారని,ఆయన పార్టీ పెడితే ఎస్సీ,ఎస్టీ, బీసీ అందరు నేతలు ఆయనకు అండగా ఉంటారని అందుకే ఆయన్ను కలవటానికి తరచుగా వస్తున్నారని అయన అనుచరులు చెప్తున్నారు. కాని ఇప్పుడు ఆయన కొత్త సొంత పార్టీ పెడితే కాపు సామాజిక వర్గం ఎంత వరకు నమ్ముతుందో చూడాలి. ఒకప్పుడు తను కాపు ఉద్యమ నేతంటూ హడావిడి చేసిన ఈయన ఇప్పుడు కనీసం ఆ విషయం పై నోరు మెదపక పోవడం పై కాపు వర్గం కూడా అసహనం గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇదివరకు బాగా ఇమేజ్ ఉన్నప్పుడే పోటి చేస్తేనే 10వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, ఇప్పుడు మళ్ళీ పార్టీ అంటే సొంత వర్గమే నమ్మదు, ఇంకా మిగతా వర్గాలు ఏమి నమ్ముతాయి, అనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, విశ్లేషకులు మాత్రం, ఇదంతా ఒక పధకం ప్రకారమే,ఇలాంటి రాజికీయాన్ని మొదలు పెట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గ ఓట్లను చీల్చటానికే ఇలా కొత్త పార్టీ అంటూ మొదలు పెట్టారని కూడా విమర్శిస్తున్నారు. తెలుగుదేశం బలపడుతూ ఉండటంతో, దానికి విరుగుడుగా, జగన్ వేసిన పాచిక అనే ప్రచారం కూడా జరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read