హైదరబాద్ లో, గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఐటి దాడుల్లో, ఐటి అధికారులకు, కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ లోనూ అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో, ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది. అయితే అందులో కృష్ణా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి వెళ్లి అక్కడ, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ భూములు కొనుగోళ్ళు చేయటం, అమ్మకాలు, ఇలా ఈ భూములు లావాదేవీల్లో అందె వేసిన చేయి ఉంది అతనికి. అయితే, గత ఏడాది పైగా కాలంలో, ఇతని వ్యాపార లావాదేవీలు, మూడు ఇంతలు పెరిగినట్టుగా కూడా, సమాచారం అందుతుంది. ఈ నేపధ్యంలోనే లావాదేవీలు పెరగటంతో, ఐటి అధికారులు కన్ను పడింది. ఒక్కసారిగా ఈ వ్యాపారి, ఇన్ని లావాదేవీలు నిర్వహించటం ఏమిటి ? ఇతనికి ఎక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి ? అనే అంశం పై ఐటి అధికారులు ఆరా తీసి, అతని నివాసం, కార్యాలయం పై, దా-డు-లు ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం వరకు బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయగా, ఇప్పుడు కూడా అక్కడ రైడ్స్ కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు అతని బ్యాంకు ఖాతాలోకి దాదాపుగా వంద కోట్ల రూపాయలు, బ్లాక్ మనీ ఫ్లో అయినట్టు కూడా, ఐటి అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి ? ఎవరి ఖాతాల నుంచి ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయ్యాయి ? లేదా తీసుకొచ్చి, నేరుగా ఎలా డిపాజిట్ చేయగలిగారు అనేది కూడా, ఐటి అధికారులు కూపీ లాగుతున్నారు. అయితే ఇతను కృష్ణ జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలక నేత సన్నిహితుడు అనే సమాచారం అందటంతో, ఈ డబ్బులు ఏవైనా అక్కడ నుంచి వచ్చాయా అనే సమాచారం లాగుతున్నారు. అయితే సోర్స్ అఫ్ ఇన్కమ్ ఎక్కడ నుంచి వచ్చింది అనేది , ఇప్పుడు ఐటి అధికారులు అంతుపట్టటం లేదు. ఎందుకంటే, ఈ వ్యాపారికి అంత పెద్ద మొత్తంలో డీల్ చేసే కెపాసిటీ లేదు, ఫైనన్షియల్ కెపాసిటీ లేదని ఐటి అధికారులు అనుమానంగా ఉంది. ఏదైనా ఒక ఎకౌంటు నుంచి ఒక ఎకౌంటు కి ట్రాన్స్ఫర్ అయితే, ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్ళింది అనేది, ఈజీగా ట్రేస్ చేయవచ్చు కానీ, ఈ అమౌంట్ మొత్తం తీసుకొచ్చి ఆ బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ గా డిపాజిట్ చేయటం, అనే దాని పై ఆరా తీస్తున్నారు. రెండేళ్ళ నుంచి ఈ డబ్బులు ఫ్లో ఉన్నట్టు ఐటి అధికారులు గుర్తించారు. అయితే ఐటి అధికారులు దీని పై ఇంకా అధికారికంగా ధ్రువీకరించ లేదు. ఈ తనిఖీలు కూడా, బెంగుళూరు, ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కీలక నేత సన్నిహితుడు కావటంతో, ఇప్పుడు ఇది చర్చనీయంసం అయ్యింది.