దివంగత నేత రాజశేఖరరెడ్డి కుటుంబంలో అన్న చెల్లిల్ల మధ్య పోరు రోజు రోజుకి తారా స్థాయికి చేరుకుంటుంది. తాజాగా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, ఇడుపులపాయలో వారిరువురి మధ్య జరిగిన గొడవే ఇందుకు నిదర్సనం. ఆస్తి పంపకాల విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరుగుతున్నట్లు తెలుస్తుంది . అయితే జగన్ మాత్రం, తన ధోరణిలో తను ఉంటూ, షర్మిలకు మాత్రం, ఆస్తి ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక తల్లి విజయమ్మ కూడా అటు కొడుక్కి, ఇటు కూతురికి చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ అన్న చెల్లిల్ల మధ్య గొడవ ఆంధ్రప్రదేశ్‌ భవిషత్తు రాజకీయాలపై ప్రభావం చూపబోతందా అనే చర్చ జరుగుతుంది. రాజశేఖరరెడ్డి లాగానే షర్మిల కూడా అనుకున్నది సాధించే మనస్తత్వం అని షర్మిల సన్నిహితులు చెప్తున్నారు. ఇక జగన్ మనస్తత్వం గురించి అందరికి తెలిసిందే. అయితే జగన్ ని డీ కొట్టాలి అంటే షర్మిలకు ప్రస్తుతం ఉన్న కుటుంబ అండ ఒక్కటే సరిపోదు. ఎందుకంటే జగన్ ఇప్పుడు ఆర్ధికంగాను, అధికారంలోనూ బలంగా ఉన్నారు. అయతే ప్రస్తుతం జగన్ నుంచి ఆస్తి తెచ్చుకోవటానికి, షర్మిల సన్నిహితులు ఆమెకు ఒక కీలకమైన విషయం చెప్పారని, ఆ దిశగానే ఆమె అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

sharmila 27122021 2

ఇప్పటికే షర్మిల తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టారు. రాజకీయంగా పార్టీని నడపటం అంటే చాలా కష్టమైన పని. ఇప్పటికే షర్మిల ఆర్ధిక కష్టాలు ఎదుర్కుంటున్నారు. మరో పక్క జగన్ మాత్రం, షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వటం లేదు. దీంతో జగన్ ని దారిలోకి తెచ్చుకోవాలి అంటే, జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెడితే కాని అది సాధ్యం కాదని, షర్మిల సన్నిహితులు చెప్పటంతో, షర్మిల ఇప్పుడు ఆ దిశలో కూడా ఆలోచిస్తుందని అంటున్నారు. తెలంగాణా రాజకీయాల్లో ఉన్న షర్మిల, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు కూడా చూస్తున్నారు అనే లీక్లు ఇచ్చి, జగన్ ని దారిలోకి తెచ్చుకోవాలి, అప్పటికీ లొంగక పోతే, ఏపిలో షర్మిల ఎంటర్ అవ్వాలని, వ్యూహంగా చెప్తున్నారు. ఈ ప్రతిపాదనకు షర్మిల సై అంటారో లేదో తెలియదు కానీ, ఇది తేలక పొతే మాత్రం, చివరకు కోర్టు మెట్లు ఎక్కినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇప్పటికే జగన్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. షర్మిల కనుక బయట పడితే, జగన్ కు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు తప్పవు. మరో పక్క, వైఎస్ కుటుంబ అభిమానులు మాత్రం, ఈ పరిణామాలతో ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని విషయంలో తప్పులు మీద తప్పులు చేస్తుంది. జగన్ మోహన్ రెడ్డికి ఏది అనిపిస్తే అది చేయడమే తమ విధానంగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. అమరావతిని మూడు ముక్కలు చేసారు. సౌత్ ఆఫ్రికా తమకు ఆదర్శం అన్నారు. రెండేళ్ళు గడిచిన తరువాత, తూచ్ అంటూ కొన్ని రోజుల క్రితమే మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకున్నామంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలు ప్రకారం, తాజాగా రాజధాని విషయంలో ఏపీ హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేశారు. హైకోర్టుకు అదనపు భవనాన్ని నిర్మిస్తున్నామని, అమరావతిలో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నామని, కరకట్ట రోడ్డును విస్తరిస్తున్నామని, ఇప్పటికే శంకుస్థాపన చేసామని, ఇలా కొన్నికీలక అంశాలను ఈ అఫిడవిట్ జాబితాలో ఉంచారు. రెండున్నర ఏళ్ళు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని విషయంలో ఇంత వరకు స్పష్టత లేదు. జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిలో ఒక్కటంటే ఒక్కఅభివృది పని జరగలేదు అనేది తెలిసిందే. అయితే అభివృద్ధి అనేది ఏమి జరగక పోగా విధ్వంసం మాత్రం అమరావతిలో జరిగింది. ఇంకా చెప్పాలి అంటే, ఈ రాష్ట్రంలో విధ్వంసం మొదలైందే అమరావతి నుంచి అనేది అందరికీ తెలిసిందే.

amaravati 27122021 2

అక్కడ ఉన్నప్రజా వేదికను మొదటగాకులగోట్టారు. నిర్మాణంలో ఉన్న భవనాలు పాడు బెట్టారు. తరువాత మూడు ముక్కలు అన్నారు. ఇప్పుడేమో మళ్లీ అమరావతిలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పటానికి రెండో అఫిడవిట్ దాఖలు చేశారు. మొదట ఇచ్చిన అఫిడవిట్‌లోనేమో మూడు రాజధానులు కడతామని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ, అమరావతిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పటం, ఏమిటో అర్ధం కావటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పిటిషన్లుకు సంభందించి వివాదాస్పదంగా మర్చి, పరిష్కారం కాకుండా ఉండాలనే ప్రభుత్వం ఇలా చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మళ్ళి అమరావతిలో అభివృధి చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా జగన్ గారు, మీ స్వార్ధ రాజకీయాల గురించి కాకుండా ఒక్కసారి రాష్ట్ర భవిషత్తు గురించి ఆలోచించండి, రాజధాని విషయంపై రోజుకొక మాట ఎందుకు మారుస్తున్నారు అని అమరావతి రైతులు వాపోతున్నారు. వైసిపి వాళ్ళు అధికారం లోకి వచ్చి ఇన్ని రోజులైనా రాజధాని పై అసలు స్పష్టత లేదు, ప్రజలందరూ కోరుకునే అమరావతిని రాజధానిగా ఉంచకుండా, మూడు రాజధానులు అని ఒకసారి, ఉపసంహరించుకుంటున్నామని ఒకసారి, మళ్ళీ పెడతామని ఒకసారి, ఇలా రకరకాల వాదనలతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారు.

ప్రతి క్రిస్మస్‌ కు రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు ఇడుపులపాయకు వెళ్లి పండగ జరుపుకుంటారనేది అందరికి తెలిసిన విషయమే. ఈ సారి కూడా ఎప్పటి లాగానే ఆనవాయితీ ప్రకారం జగన్మోహన్‌రెడ్డి, చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ, ఇతర కుటంబ సభ్యులు గురువారామే ఇడుపులపాయకు వచ్చారు. అయితే గురువారం రోజు రాత్రి అన్నా, చెల్లిళ్ళ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు పెద్ద ఎత్తున మీడియాలో కధనాలు వచ్చాయి. దీనితో ఆ రోజు రాత్రే షర్మిల ఇడుపులపాయ అతిథిగృహం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేసినట్టు మీడియాలో వర్తలువ్ అచ్చయి. తన కన్న కూతురు కోపంతో వెళ్లిపోతుంటే విజయమ్మ కూడా కూతురు కారులోనే ఇడుపులపాయలోని తన నివాసగృహానికి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ గొడవతో విజయమ్మ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని, అటు కొడుక్కి, ఇటు కూతురుకి చెప్పలేని పరిస్థితిలో అక్కడ నుంచి వెల్లిపోయినట్టు సమాచారం. ఇప్పటివరకు అన్నా,చెల్లిళ్ళ మద్య గోడవలన్నీ ఊహాగానాలే తప్ప స్పష్టత లేదు కాని, ఈ గోడవతో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని కలహాలు బట్టబయలయ్యాయి అనే ప్రచారం జరుగుతుంది. గురువారం రాత్రి జగన్ ,చెల్లి షర్మిల మద్య ఆస్తి గురించి పెద్ద ఎత్తున గొడవ జరిగినట్లు మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న కధనాలు ద్వారా తెలుస్తుంది.

ys 27122021 2

ఆరాత్రి ఆస్తుల పంపకం పై ఇద్దరి మధ్య సంభాషణ వచ్చిందని, అయితే నీ వల్ల నాకు చాల ఇబ్బంది ఇందని, తెలంగాణలో రాజకీయ పార్టీ ఎందుకు పెట్టావని కూడా జగన్ షర్మిలను ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. దీనితో ఆస్తిలో తనకు రావలిసిన వాటా రాయమని షర్మిల అడగటంతో, జగన్ కోపంతో ఊగిపోయారని, తెలంగాణలో పార్టీ పెట్టి తప్పు చేసావు, మళ్ళీ నీకు ఆస్తుల్లో వాటా కూడానా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను మాత్రం ఇవ్వను అని షర్మిల పై విరుచుకు పడ్డారని ఆ కధనాల సారంశం. షర్మిల కూడా అదే రీతిలో స్పందించి, ఈ విషయం ఎలా తెల్చుకోవలో నాకు తెలుసు అని, ఆ రోజు రాత్రే షర్మిల కోపంగా అక్కడ నుంచి బయలు దేరి హైదరాబాద్ వచ్చేసినట్టు తెలుస్తుంది. రాజశేఖరరెడ్డి చనిపోవడం, ఆస్తుల పంపకాలు మిగిలి ఉండటం, తరువాత అన్నా,చెల్లిళ్ళ మద్య గొడవలతో, ఈ ఆస్తుల అంశం చుట్టూనే ఇద్దరికీ చేదినట్టు సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఈ కధనం వచ్చి మూడు రోజులు అవుతున్నా, అటు షర్మిల వైపు నుంచి కానీ, జగన్ వైపు నుంచి కానీ, విజయమ్మ వైపు నుంచి కానీ, ఎలాంటి ఖండన లేకపోవటం కొస మెరుపు. సహజంగా ఇలాంటి కధనాల పై గతంలో, ఖండిస్తూ ప్రెస్ నోట్లు విడుదల చేసే వారు. కానీ, ఈ సారి మాత్రం అవేమి లేవు.

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, వైసిపి పార్టిలోని నేతల మధ్య రోజు రోజుకి వివాదాలు బయట పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వైశ్య సామాజిక వర్గం నేత సుబ్బారావు గుప్తాపై దా-డి-తో, ఇప్పుడు దిద్దలూరులో కూడా లుకలుకలు బయట పడ్డాయి. వైసీపీ మీటింగ్లో సుబ్బారావు గుప్తా చేసిన సంచలన వాఖ్యలే ఈ వివాదానికి కారణంగా మారాయి. కొడాలి నాని, వల్లభనేని వంశి, అంబటి, ద్వారంపూడి వాడే బాష పైన, సుబ్బారావు గుప్తా ఘాటుగా విమర్శించారు. వారి భాష వల్ల పార్టీ ఓటు బ్యాంక్ పోతుందని, ఇలాంటి వారిని అదుపులో పెట్టాలని అన్నారు. రేపు టిడిపి అధికారంలోకే వస్తే, రోడ్డుల మీద గుడ్డలు ఊడదీసి కొట్టే పర్తిస్థితి ఉందని అన్నారు. అయితే అ తరువాత రోజే, వైసీపీ మార్క్ రాజకీయం చూపించిన సంగతి తెలిసిందే. గుప్తా ఇంటి పైకి వెళ్లి దా-డి చేసారు. తరువాత సుబ్బారావు గుప్తా పారిపొయినా, ట్రేస్ చేసి మరీ వెంటాడారు. బాలినేని అనుచరుడు, సుభానీ రెచ్చి పోయాడు. అంతే కాక, మా జోలికి వస్తే ఇలా ఉంటుందని వీడియో కూడా బయటకు విడుదల చేసారు. ఈ దెబ్బతో, వైశ్య సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరసనలను పిలుపు ఇచ్చారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తాని కొట్టడమే కాకుండా తల్లిని కుటుంబసభ్యులను తిట్టడం పై, ఆర్యవైశ్య నేతలు మానసిక వేదనకు గురవుతున్నట్టు తెలుస్తుంది.

anna 271220212

అయితే వైశ్య సామాజిక వర్గం ఆగ్రహంతో, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇరుకున పడ్డారు. ఆ ఇంపాక్ట్ తమ మీద పడకుండా, ముందు జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయం పై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఇలా దా-డి చేయటం హేయం అని అన్నారు. ఒక రెడ్డినో, ఒక కమ్మనో, వేరే సామాజిక వర్గాన్నో ఇలా ట్రీట్ చేస్తారా అని ప్రశ్నించారు. త్వరలోనే తానూ జగన్ కలిసి సంచలన నిర్ణయం చెబుతానని, తానూ చాల రోజులుగా జగన్ కలవాలని అనుకుంటున్నానని ,కాని జగన్ అపాయింట్‌మెంటు దొరకడంలేదని రాంబాబు చెప్పారు. దీనితో ఈ అంశం గిద్దలూరులో చర్చ నీయంసంగా మారింది. మరోవైపు స్థానికంగా వైసీపీలో రెడ్డి సామాజికవర్గం అంతా ఒక్కట్టిగా పనిచేస్తున్నాయి. ఈ సారి ఏదేమైనా రాంబాబుకు టిక్కెట్ రాకుండా చేయడానికి రెడ్డి సామాజికవర్గంవ గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ విషయాలన్నీ జగన్ తో కలిసి చెప్పటానికి ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ ఎమ్మెల్యేలను కలవడానికి నిరాకరిస్తున్నారని కూడా సమాచారం. ఈ సారి మంత్రులందని మారిస్తే వెల్లంపల్లి స్థానంలో ఆర్యవైశ్య కోటాలో అన్నా రాంబాబు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. మరి జగన్ కలిస్తే రాంబాబు ఏం సంచలన నిర్ణయం ప్రకటిస్తాడో చూడాలి. మొత్తంగా చూస్తే అసంతృప్తి నేతలు వైసీపీలో ఎక్కువవుతున్నట్లు అర్థమవుతోంది.

Advertisements

Latest Articles

Most Read