చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఈ రోజు బెజవాడ బార్ అసోసియేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో, కీలక వ్యాఖ్యలు చేసారు. నాకు కష్టం వచ్చినప్పుడు, ఇక్కడ బెజవాడ బార్ అసోసియేషనే కాకుండా, దేశ వ్యాప్తంగా బెజవాడ బార్ అసోసియేషన్‌లు అండగా నిలిచారని అన్నారు. ఆయనకు వచ్చిన ఇబ్బంది అంటే, ఈ మధ్య కాలంలో, ఆయన పై వచ్చిన ఫిర్యాదు. దాన్నే చీఫ్ జస్టిస్ పరోక్షంగా ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ బెజవాడ బార్ అసోసియేషన్‌ తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని చెప్పారు. ఇక్కడే ఆయన కెరీర్ లో మొదటి అడుగు పడిందని అన్నారు. అప్పటికీ ఇప్పటికీ, చాలా మార్పులు ఇక్కడ వచ్చీని అన్నారు. ఇక్కడ బార్ అసోసియేషన్ చాలా గొప్పగా ఉండేదని, ఇక్కడే చాలా విషయాలు తాము డిస్కస్ చేసుకునే వారమని అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ లో ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇక్కడ నీరు, గాలి పీల్చే, ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. అలాగే న్యాయ వ్యవస్థ పాత్ర ఈ సమాజంలో చాలా ఉందని అన్నారు. ఆలాంటి న్యాయ వ్యవస్థను కించపరచకూడదని, జడ్జిలపై దా-డు-లు, అవమానాలను ప్రశ్నించాలని అన్నారు. ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాలు పెంచాలని అన్నారు.

భారత దేశ చీఫ్ జస్టిస్, ఎన్వీ రమణ, గత మూడు రోజులుగా సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. మూడో రోజు ఆయన న్యాయవాదులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేసారు. విజయవాడ కానూరులోని సిద్ధార్థ బీటెక్‌ కాలేజీలో న్యాయవాదులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఆయన న్యాయ వ్యవస్థ ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెప్పారు. మన రాజ్యాంగం మూడు వ్యవస్థలు ఇచ్చిందని, ఎగ్జిక్యూటివ్, శాసన వ్యవస్థల్లో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే కచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకుంటాయని అన్నారు. ప్రభుత్వాల నుంచి సరైన సహకారం, న్యాయ స్థానాలకు లభించటం లేదని అన్నారు. న్యాయ వ్యవస్థ ఎదుకుంటున్న ఇబ్బందులకు, ఇది కూడా ఒక కారణం అని అన్నారు. ఇంటర్నెట్ కేంద్రంగా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రచారాలు కూడా, న్యాయ వ్యవస్థకు సవాల్ గా మారిందని అన్నారు. అలాగే ఇటీవల జడ్జిల పైన బౌతిక దా-డు-లు కూడా జరుగుతున్నాయని అన్నారు. తమకు అనుకూల తీర్పులు రాకపోతే, విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వారి పై చర్యలు తీసుకోవాలని, కోర్టులు కోరితే కానీ, విచారణ జరపటం లేదని, అన్నారు. ఈ పరిణామం మంచిది కాదని అన్నారు. కోర్టులు సవ్యంగా పని చేసే స్వేఛ్చ ఇవ్వాల్సింది, ప్రభుత్వాలే అని అన్నారు.

cji 26122021 2

ఇక ఈ మధ్య కాలంలో పార్లమెంట్ వేదికగా జరిగిన చర్చలో, జడ్జిల పైన చేసిన విమర్శలు కూడా ఆయన తిప్పి కొట్టారు.జడ్జిలను జడ్జిలే నియమిస్తారు అంటూ ఈ మధ్య కాలంలో వింటున్నాం అని, అది భ్రమ మాత్రమే అని అన్నారు. జడ్జిల నియామకంలో, న్యాయ వ్యవస్థ ఒక భాగమే అని, కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇలా అనేక మంది కలిసి జడ్జిలను ఎన్నుకుంటారని అన్నారు. ఇంత ప్రక్రియ ఉందని తెలిసినా, కొంత మంది కావాలని ఇలా మాట్లాడటం సరి కాదని అన్నారు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ గురించి కూడా ఆవేదన వ్యక్తం చేసారు. ఈ వ్యవస్థ ప్రభుత్వాల చేతిల్లో పావుగా మారిపోయిందని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ స్వతంత్రంగా పని చేయాలని ఆయన అన్నారు. నిందితులను సహకరించే విధంగా ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ ఉందని, అది మారాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు.

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, మూడు రోజుల పాటు ఏపిలో పర్యటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం సిద్ధార్థా కాలేజీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ స్థాయికి రావటానికి ఈ బెజవాడ నేల, కృష్ణా నది నీరు కారణం అనుకుంటా అని, ఈ ప్రాంతం పై తనకు ఉన్న మక్కువ చాటుకున్నారు. అలాగే విజయవాడ ప్రజలకు చురకలు కూడా అంటించారు. ఆయన మాటల్లోనే.. "విజయవాడ ప్రజలకు, చైతన్య వంతమైన ఇక్కడ ప్రజలకి, మీకు తెలుసు విజయవాడ అంటే. విజయవాడ అంటే బ్లేజ్ వాడ అని అంటూ ఉండే వారు. బ్లేజ్ వాడ అంటే మండే ఎండల వల్ల వచ్చే బ్లేజ్ వాడ కాదు, ఉష్ణోగ్రత ఎందుకు పెరిగింది అంటే, ఇక్కడ సైద్ధాంతిక వైరుధ్యాల కుంపటితోటితో ఈ విజయవాడ ఉంది. విజయవాడ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. అతివాద, మితవాద, అనేకమైన రాజకీయ సిద్ధాంతాలతో ఒకప్పటి పుట్టినిల్లు ఈ విజయవాడ. మీరు చూడండి, 1950 ఆ ప్రాంతంలో చూసుకున్నట్టు అయితే, ఇక్కడున్నటు వంటి నాయకులు, జాతీయ స్థాయిలో అన్ని పార్టీలుగా ఇక్కడ నాయకులు ఎదిగారు. ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం ఇది. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నుంచి, తరువాత 1983లో ప్రాక్టీస్ చేసినప్పుడు వరకు, లా స్టూడెంట్ గా ఉండి చదువుకున్నంత వరకు కూడా, ఇది ఒక అద్భుతమైన నగరంగా నేను భావించే వాడిని. 1983లో ప్రాక్టీస్ మొదట్లో రవీంద్ర గారు నా చేత తొలి అడుగు వేయించారు. "

vijayawada 25122021 2

"తరువాత హైదరాబాద్ కు మారాను, అయ్యప్ప రెడ్డి గారి దగ్గర జూనియర్ న్యాయవాదిగా పని చేసాను. అప్పట్లో విజయవాడ వదిలి, హైదరాబాద్ వెళ్ళాలి అంటే చాలా బాధ వేసింది నాకు. అతి కష్టం మీద విజయవాడ వదిలి, హైదరాబాద్ వెళ్ళాను. ప్రతి శుక్రవారం సాయంత్రం విజయవాడ వచ్చి, శనివారం, ఆదివారం విజయవాడలో ఉండేవాడిని. ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న ఆనందకరమైన అభ్యుదమైన వాతావరణం ఉండేది. ఇక్కడ అనేక మంది న్యాయవాదులు ఉన్నారు. ఒక న్యాయవాదులే కాదు, ఇక్కడున్న డాక్టర్లు, ఇక్కడున్న లెక్చరర్లు, ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వారు ఉన్నారు. విజయవాడ కళలకు, సంస్కృతికి, చైతన్యానికి, పత్రికా రంగానికి, అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా ఉండే విజయవాడ, ఈ రోజు ఎందుకో నేను ఊహించినంత, ఆ రోజుల్లో ఉన్నంత గొప్ప స్థాయిలో లేదు అని చెప్పటానికి విచారిస్తున్నా. ఇది వాస్తవం. మళ్ళీ ఒకసారి జూలు విదిల్చి, చైతన్యవంతమైనటు వంటి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనః స్పూర్తిగా ఆకంక్షిస్తున్నా, ఇది నా హృదయంలో నుంచి వచ్చిన మాట" అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసారు. గుడ్లవల్లేరులో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా పాల్గుని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇక్కడకు కొడాలి నాని, వంశీ కూడా వచ్చారు. వీరి ముగ్గురూ కూడా మొదటి నుంచి స్నేహితులు కావటంతో, పార్టీలు వేరు అయినా, కలుస్తూనే ఉంటారు. ఉదయం వంశీ, రాధా ఇంటికి వెళ్ళి, అక్కడ నుంచి రంగా విగ్రహానికి పూల మాల వేసి, అక్కడ నుంచి గుడ్లవల్లేరు వెళ్లారు. అయితే అక్కడ వంగవీటి రాధా చేసిన ఈ వ్యాఖ్యలతో, ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. తనను చంపటానికి, కొంత మంది రెక్కీ నిర్వహించారని రాధా సంచలన ఆరోపణలు చేసారు. రంగా కీర్తి, ఆసయ సాధనే తన లక్ష్యం అని, పదవుల పై తనకు ఎటువంటి ఆశ లేదని రాధా అన్నారు. తనను ఏదో చేద్దామని, భయపెడదాం అని, రెక్కీ నిర్వహించారని, తాను భయపడను అని, అన్ని వేళలా సిద్ధంగా ఉన్నానని, తనను లేపేయాలి అనుకునేవాళ్ళు ఏమైనా చేసుకోవచ్చని, తాను ప్రజల మధ్యే ఉంటానని అన్నారు. ప్రజలకు నన్ను దూరం పెట్టటానికి, ఇలాంటి బెదిరింపులకు తాను లొంగను అని అన్నారు. అంతకు ముందు, కొడాలి నాని మాట్లాడుతూ, వంగవీటి రాధా నా తమ్ముడు, తాను వైసీపీలో ఉన్నాను, రాధా టిడిపిలో ఉన్నాడు అనుకుంటా అని సటైర్ వేసారు.

radha 26122021 2

అప్పట్లో టిడిపి పదవులు ఇస్తామని చెప్పినా, రాధా పదవి తీసుకోలేదని, బంగారం లాంటి రాధా, కొంచెం రాగి మిశ్రమాన్ని కూడా కలిపితే, పరిస్థితి మరోల ఉండేదని, రాగి కలిపితేనే, బంగారం తాను అనుకున్న షేప్ లో వస్తుందని, రాదా మాత్రం తాను నమ్మిన దారిలోనే వెళ్తున్నారని పరోక్షంగా, వైసీపీలోకి రావాలని, కొడాలి నాని, ఆహ్వానం పలికారు. అయితే వెంటనే రాధా మాత్రం, తనను చంపాలని, చూసిన వారిని, ప్రజలు దూరంగా పెట్టాలని చేసిన వ్యాఖ్యలు, ఎవరిని ఉద్దేశించి చేసారు , ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసారు అనేది సంచలనంగా మారింది. ఉదయం వంశీ రావటం హాట్ టాపిక్ గా మారగా, ఇప్పుడు రాధా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాధా, వంశీ, నాని, పార్టీలు వేరు అయినా, కలుస్తూనే ఉంటారు. అయితే ఈ రోజు గుడ్లవల్లేరులో, కొడాలి నాని, రాధా గురించి సటైర్ లు వేయిగా, రాధా మాత్రం తనను చంపాలని చూసిన వారిని దూరం పెట్టాలని చెప్పటం, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారు అనేదే, ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

Advertisements

Latest Articles

Most Read