పందికేమి తెలుసు పన్నీరు వాసన అన్నట్టుంది వైసీపీ నేతల తీరు. తలైవా రజనీకాంత్ గురించి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూసిన కూతలపై సభ్యసమాజం ఛీదరించుకుంది. కేవలం చంద్రబాబుని ప్రశంసించారనే కారణంతో వైకాపా నేతలు బూతులతోనూ, మార్పింగ్ పోస్టులతోనూ రజనీకాంత్ పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఇటు టిడిపి మద్దతు నేతలు కానీ, అటు రజనీకాంత్ స్నేహితులు కానీ ఎవరూ స్పందించి ఖండించలేదు. అయితే అనూహ్యంగా జగపతిబాబు రజనీకాంత్ కి మద్దతుగా నిలిచారు. రజనీకాంత్ మాట్లాడేవన్నీ నిజాలేనని హీరో జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ 100 శాతం రైట్ మాట్లాడారు. ఆయన మాట్లాడే విధానం, ఆయన అనే మాటలు పర్ఫెక్ట్ గా ఉంటాయంటా జగ్గూ భాయ్ కితాబిచ్చారు. రజనీకాంత్ చక్కగా మాట్లాడతాడు.. నిజాయితీగా మాట్లాడతాడు.. నిజాలు మాట్లాడతాడు అంటూ జగపతిబాబు వెనకేసుకురావడం రాజకీయాల్లోనూ, ఇండస్ట్రీలోనూ సెన్సేషన్ అయ్యింది.
news
ఐదుగురు ఐఏఎస్, ఐపీఎస్ లకి జైలు శిక్ష.. హైకోర్ట్ సంచలన తీర్పు...
యథా రాజా తథా అధికారి అన్న మాదిరిగా ఉంది ఏపీలో పాలన. రాజ్యాంగసంస్థలు, కోర్టులు అంటే ప్రభుత్వం ప్రదర్శిస్తున్న లెక్కలేనితనాన్ని బ్యూరోక్రాట్లూ ప్రదర్శిస్తున్నారు. ఈ నిర్లక్ష్య ఫలితం తరచూ కోర్టులలో దోషులుగా అధికారులను నిలబెడుతోంది. దేశంలోనే అతి ఎక్కువ కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ టాప్ అని ఇటీవల గణాంకాలు వెల్లడించాయి. తాజాగా మరో కోర్టు ధిక్కరణ కేసులో ఏకంగా ఐదుగురు ఉన్నతాధికారులు జైలుశిక్ష పడింది. ఆర్టీసీ ఫీల్డ్‌మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని ఫీల్డ్‌మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిగింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐదుగురు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు చెబుతూ ఈ నెల 2వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు నెల రోజులు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు నెల రోజులు, మరో ముగ్గురు అధికారులకు కూడా నెల రోజుల జైలు శిక్ష చొప్పున విధించారు. ఐదుగురు అధికారులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు. ఈ నెల 16లోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
యథారాజా తథా ప్రజా అన్న చందంగా ఉంది ఏపీలో పరిస్థితి. ముప్పయికి పైగా కేసులున్న సీఎం కోర్టు వాయిదాలకి హాజరు కాకుండా ఎలా తప్పించుకుంటున్నారో, అధికారులూ కోర్టుల ఆదేశాలు అమలు నుంచి అలాగే తప్పించుకుంటున్నారు. అయితే హైకోర్టు ఈ సారి మరింత ఘాటుగా స్పందించింది. ఇప్పటివరకూ కోర్టులో సంబంధిత అధికారుల హాజరుకి ఆదేశించిన కోర్టు, తొలిసారిగా కోర్టు ధిక్కరణకి పాల్పడిన విద్యాశాఖాధికారులను జైలుకి పంపుతామని హెచ్చరించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని గతేడాది ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ ఏడాది 90 వేల సీట్లలో 9,064 సీట్లు మాత్రమే పేదలకు కేటాయించారని తన పిటిషన్ న్యాయవాది వివరించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తమ ఉత్తర్వులు అమలు చేయకపోతే జైలుకు పంపుతామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను హెచ్చరించింది. 25 శాతం కోటా కింద ప్రైవేటు సంస్థల్లో ఎంతమందికి ప్రవేశాలు కల్పించారో చెప్పాలని నిలదీసింది. కేటాయించిన సీట్ల వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది.
చంద్రబాబు విజన్‌ని పొగిడిన శత్రువు. .జగన్ మాటలు తప్పంటూ స్టేట్మెంట్..
జగన్ రెడ్డికి రహస్య స్నేహితుడు. బీజేపీలో కీలక నేత. ఒకప్పుడు ఏపీ చీఫ్ సెక్రటరీ. తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు అన్నా ఒంటికాలిపై లేస్తాడు. ఆయన ఐవైఆర్ కృష్ణారావు. భోగాపురం ఎయిర్ పోర్టుకి రెండోసారి శంకుస్థాపన చేసిన జగన్ రెడ్డి..శంషాబాద్ ఎయిర్ పోర్టు ఘనత తన తండ్రిదని..ఇది తనదని ఒక రేంజులో ప్రచారం చేసుకున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ తేదీలు, నిర్మాణాలు, ఫోటోలు, వీడియోలతో గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. అయితే టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు, టిడిపి ఆగర్భ శత్రువుగా భావిస్తారు. టిడిపి ప్రతీ నిర్ణయాన్ని తప్పుబట్టడంలోనూ ముందుంటారు. అనూహ్యంగా ఎయిర్ పోర్టుల విషయంలో వైకాపా ప్రచారానికి ఐవైఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాటి శంషాబాద్ అయినా, నేటి భోగాపురం ఎయిర్ పోర్టుల నిర్మాణమైనా చంద్రబాబు కృషి విస్మరించలేనిదని ట్విట్టర్‌లో ఇచ్చిన ఘాటు రిప్లయి వైకాపాకి గట్టిగా తగిలింది.