వైసీపీప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ప్రజలనుంచి వేడితగిలినా, వారిలోఆగ్రహావే శాలు పెరిగిపోయి, ముఖ్యమంత్రికి ఊపిరాడకపోయినా, ప్రభుత్వం సమస్యలసుడిగుండంలో చిక్కుకున్నా, వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ అమలుచేయడం, ప్రస్తుతం ప్రజల్లో నలుగుతున్న అంశాలను దారిమళ్లించడం అనేది పాలకులకు రివాజుగా మారిందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి లోని పార్టీజాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...! ఓటీఎస్ పేరుతో ప్రభుత్వంచేస్తున్న దోపిడీకి సంబంధించి ప్రజలనుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నవేళ, ప్రభుత్వంచేతిలో దగాపడిన ఉద్యోగులఉద్యమం ప్రారంభంకావడం, అమరావతి రైతులుఉద్యమానికి నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణ, వీటన్నింటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రిపై ఉన్నసీబీఐ కేసుల విచారణ తరుముకురావడం, బాబాయ్ హత్య కేసుకి సంబంధించినకేసు విచారణ వేగవంతం కావడం వంటి ఘటనలన్నీ ముఖ్యమం త్రికి, వైసీపీప్రభుత్వానికి నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రజలదృష్టి మళ్లించడానికే ఈ ప్రభుత్వం కొత్తడ్రామాకు తెరలేపింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మరియు సిమెన్స్ వారుసంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్ట్ పై బురదజల్లే కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకుంది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం సీఐడీ అధికారులతో మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటిపై దాడికిపంపారు. ఉదయం నుంచి ఆయనపై, ఆయనకుటుంబసభ్యులపై సీఐడీ అధికారులుచేస్తున్నదాడితో, లక్ష్మీనారాయణగారు ఒకానొకదశలో తీవ్రఅస్వస్థతకులోనై, స్పృహకోల్పోవడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీస్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సీమెన్స్ సంస్థ సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్ట్ కి సంబంధించిన వాస్తవాలను ప్రజలముందుఉంచుతున్నాం. 2014 నవంబర్లో సదరు ప్రాజెక్ట్ కుసంబంధించిన ప్రపోజల్ ను సిమెన్స్ వారు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సిమెన్స్ వారు అదివరకే ఆప్రాజెక్ట్ ను గుజరాత్ లో అమలుచేసినందున, దాన్నిపరిశీలించడానికి ఏపీనుంచి ప్రత్యేకబృందాన్ని అప్పటిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, ఎల్.ప్రేమచంద్రారెడ్డి (ఐఏఎస్) నేతృత్వంలో గుజరాత్ కు పంపారు. సిమెన్స్ ప్రాజెక్ట్ ముఖ్యఉద్దేశమేమిటంటే, ఏపీలోని నిరుద్యోగయువతలో నైపుణ్య శిక్షణకేంద్రాలు నెలకొల్పి, వారిని ఏదో ఒక అంశంలోతీర్చిదిద్ది, వారికి ఉపాధికల్పించడం.
అలాంటిప్రాజెక్ట్ తో యువత భవిత బాగుపడుతుందన్న గొప్పలక్ష్యంతో దాన్నిరాష్ట్రంలో అమలుచేయాలని చంద్రబాబు గారు సంకల్పించారు. అందులోభాగంగానే నవంబర్ 15, 2015న ఏపీనుంచి ప్రత్యేక బృందాన్ని గుజరాత్ కుపంపించారు. ఆ బృందంలో సభ్యులుగా ఐఏఎస్ అధికారులు ప్రేమ చంద్రారెడ్డి, కే.సునీత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, గంటాసుబ్బారావు లు ఉన్నా రు. గుజరాత్ వెళ్లిన సదరుబృందం ఏపీప్రభుత్వానికి ఒకనివేదికఇచ్చింది. ఆ నివేదిక ఆధా రంగా రాష్ట్రవ్యాప్తంగా 6 క్లస్టర్లలో 40 కేంద్రాల్లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటిలో 34 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలైతే, 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు ఉన్నాయి. వాటిఏర్పాటులో భాగంగా ఒక్కో క్లస్టర్ కు రూ.540.86 కోట్లతో బడ్జెట్ ప్రపోజల్ కూడా తయారుచేయడం జరిగింది. మొత్తంప్రాజెక్ట్ ఖర్చులో 90శాతం నిధులు సిమెన్స్ కంపెనీనుంచి వచ్చేటట్టుగా, కేవలం 10శాతంమాత్రమే రాష్ట్రప్రభుత్వం ఖర్చుపెట్టేటట్టు ఒప్పందం చేసుకోవడంజరిగింది. ఇదంతాఅయ్యాక కేంద్రప్రభుత్వసంస్థ అయిన సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)కి సిమెన్స్ ప్రాజెక్ట్ ప్రపోజల్ ను బడ్జెట్ అంచనాలను పంపడం జరిగింది. అన్నీపరిశీలించి, సీఐటీడీవారు బడ్జెట్ అంచనాలకు ఆమోదముద్ర వేశాకనే తాము ముందుకువెళతామని కూడా నాటిఏపీప్రభుత్వం చెప్పడం జరిగింది. తరువా త సీఐటీడీ వారు ఐఏఎస్ అధికారి ప్రేమచంద్రారెడ్డికే తమఆమోదం తెలుపుతూ, పూర్తి వివరాలతోకూడిన నివేదికను పంపారు. సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారి ఆమోదం లభించాకనే, సిమెన్స్ ప్రాజెక్ట్ కు సంబంధించి, ఇవ్వాల్సిన 10శాతం నిధులను ఏపీప్రభుత్వం దఫదఫాలుగా, 4 విడతల్లో రూ.371 కోట్లను విడుదలచేయడం జరిగింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అనేకమంది అధికారులుసీఈవోలుగా, ఎండీలుగా పనిచేయడం జరిగింది. అక్టోబర్ 2014 నుంచి నవంబర్ 2015 వరకు గంటాసుబ్బారావు గారు, నవంబర్ 13, 2015 నుంచి, మార్చి31, 2016వరకు ప్రేమచంద్రారెడ్డిగారు, తరువాత రామ్ ప్రకాశ్ సిసోడియా, ఆనంద్ శామ్యూల్, కే.సాంబశివరావు, కృతికాశుక్లా, జయలక్ష్మీ, ఎన్.బంగార్రాజు వంటి 11మంది పనిచేశారు. 11 మందిలో ప్రేమచంద్రారెడ్డి ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీగాఉన్న సమయంలోనే రూ.371కోట్లనిధులను సిమెన్స్ వారి స్కిల్ డెవలప్ మెట్ ప్రాజెక్ట్ కి విడుదల చేయడం జరిగింది. నవంబర్13, 2015 నుంచి మార్చి31, 2016వరకు ప్రేమచంద్రారెడ్డి ఎండీగాఉన్నారు. వారు ఎండీగా ఉన్నసమయంలో డిసెంబర్5, 2015న 185కోట్లు, జనవరి29,-2016న రూ.85కోట్లు, మార్చి11-2016న రూ.67కోట్లు, మార్చి31, 2016న రూ.34కోట్లు వెరసి మొత్తంగా రూ.371కోట్లను విడుదలచేయడం జరిగింది. ప్రేమచంద్రారెడ్డి గారు కాకుండా, మిగిలిన 10మంది అధికారులు ఎండీలుగా ఉన్నసమయంలో ఆనాటి ప్రభుత్వం రూపాయికూడా నిధులు విడుదలచేయలేదు. 05-10-2015న నాటిప్రభుత్వం జీవోనెం-8 విడుదలచేసి ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన రెండుకమిటీలను ఏర్పాటుచేయడం జరిగింది. ఆ కమిటీలు ఏమిటయ్యాఅంటే ఒకటి ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన మానిటరింగ్ కమిటీ, మరోటి సెంటర్ సెలక్షన్ కమిటీ. మానిటరింగ్ కమిటీలో సభ్యులుగా ఐఏఎస్ అధికారులైన అజయ్ జైన్ (ఇప్పుడున్నప్రభుత్వంలో కీలకఅధికారి), షంషేర్ సింగ్ రావత్, (ఇప్పుడున్న ప్రభుత్వం లో ఆర్థికశాఖముఖ్యకార్యదర్శి), ఎమ్.రవిచంద్ర, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ లక్ష్మీనారాయణ, గంటాసుబ్బారావు, బ్రిగేడియర్ ప్రకాశ్ తులానీ లాంటి 8మంది ఉన్నారు. సెంటర్ సెలక్షన్ కమిటీలోకూడా అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్, గంటాసుబ్బారావు, ఉదయలక్ష్మి, లక్ష్మీనారాయణ గారుఉన్నారు. ఆ విధంగా ఆనాటిప్రభుత్వంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు సంబంధించిన రెండుకమిటీల్లో సభ్యులుగా ఉన్న అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్ తదితర సీనియర్ ఐఏఎస్ ల ఆధ్వర్యంలోనే ప్రాజెక్ట్ వ్యవహారాలు మొత్తం నడిపించడం జరిగింది.
ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి, దేశంలోనే పేరుప్రఖ్యాతులు పొందిన కొందరుపారిశ్రామికవేత్తలతో కూడినఒకఅడ్వైజరీ కమిటీని కూడా నాటిప్రభుత్వం ఏర్పాటుచేసింది. 16-09-2015లో ప్రాజెక్ట్ కి సంబంధించిన అడ్వైజరీకమిటీలో పారిశ్రామికవేత్తలకు చోటుకల్పిస్తూ, నాటిప్రభుత్వం జీవో నెం-7 విడుదలచేయడంజరిగింది. దానిలో శ్రీసిటీఛైర్మన్ శ్రీనివాసరాజు, శ్రీ జీఎమ్ఆర్ గారు, విప్రోచైర్మన్ శ్రీ అజీమ్ ప్రేమ్ జీ, ఐసీఐసీఐ గవర్నింగ్ బాడీమెంబర్ రామ్ కుమార్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పటిఛైర్మన్ మదుసూదన్, ఐటీసీచీఫ్ ఎగ్జిక్యూటివ్ శివకుమార్ వంటి20మంది పరిశ్రమదిగ్గజాలతో అడ్వైజరీకమిటీని నియమించడంజరిగింది. ఆరకంగా నాటి టీడీపీప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగయువతకు మేలుకలిగించడంకోసం ఇన్నిరకాలకమిటీలు వేసింది. దానితోపాటు 90శాతం నిధులు సీమెన్స్ సంస్థ గ్రాంటుగా ఇచ్చేట్లు, రాష్ట్రప్రభుత్వం కేవలం 10శాతం నిధులుఇచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా 40కేంద్రాలను విడతలవారీగా నెలకొల్పడం జరిగింది. నవంబర్ 1, 2016న మొదటిరెండుకేంద్రాలను, 31డిసెంబర్, 2017న మరో 19కేంద్రాలను, 31మే, 2018 నాటికి మిగిలినకేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పడంజరిగింది. ఆ 40స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో ఇప్పటివరకు 2లక్షల30వేల626మంది యువత శిక్షణపొందారు. వారిలో 60వేల మందికి ఉద్యోగాలు కూడాఇవ్వడంజరిగింది. ప్రాజెక్ట్ కి సంబంధించిన మొత్తం వ్యవహరం అదీ.
అదంతా అలాఉంటే, ఈ ముఖ్యమంత్రి ఆనాడు పైసాఅవినీతికి తావులేకుండా ఏర్పాటుచేసిన సిమెన్స్ ప్రాజెక్ట్ వ్యవహారంలో నేడు ఏదో అవినీతిజరిగిందని లక్ష్మీనారాయణ గారిఇంటికి సీఐడీఅధికారులను పంపారు. అసలు ప్రాజెక్ట్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ప్రేమచంద్రారెడ్డిని వదిలేసి, ఈముఖ్యమంత్రి లక్ష్మీనారాయణ ను ఎందుకు లక్ష్యంగాచేసుకున్నారు? రాష్ట్రముఖ్యమంత్రి జగన్ రెడ్డిగారికి అత్యంత సన్నిహితుడైన ప్రేమచంద్రారెడ్డిని రాష్ట్రఎన్నికలకమిషనర్ గా నియమించాల్సిన అధికారులజాబితాలో కూడా ఈ ముఖ్యమంత్రిచేర్చారు. అలాంటి ప్రేమచంద్రారెడ్డి హయాంలోనే సిమెన్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన రూ.371 కోట్ల చెల్లింపులుజరిగాయి. ప్రేమచంద్రారెడ్డి ఈ ముఖ్యమంత్రికి అత్యంతసన్నిహితుడు కాబట్టి, ఆయన్ని వదిలేస్తారా? నిజంగా ఈ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఈప్రభుత్వంభావిస్తే తొలుత ప్రశ్నిచాల్సింది ప్రేమ చంద్రారెడ్డిని, తరువాత విచారించాల్సింది అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్ లను. వారిని వదిలేసి లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులనుపంపుతారా? మొత్తం ప్రాజెక్ట్ ని మాని టరింగ్ చేసిన వారిని, పేమెంట్స్ చేసిన వారిని వదిలేసి, కేవలం గంటాసబ్బారావు, లక్ష్మీనా రాయణ పేర్లనే ఈప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకుందన్నదే తమప్రశ్న. లక్ష్మీనారా యణగారు చంద్రబాబునాయడుగారు, ఎన్టీఆర్ గారివద్ద పనిచేశారనే ఆయనపైకక్ష కట్టారా? ఆయనద్వారా మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి గారికి అవినీతి మరకలు అంటించే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్రపన్నారా? ఈ ముఖ్యమంత్రికి, డిఫాక్టో డీజీపీకి దమ్ము, ధైర్యముంటే,నిజంగా విచారించాల్సింది చెల్లింపులు చేసిన ప్రేమచంద్రారెడ్డిగారిని, అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్ లను. వారిని విచారిస్తే, ప్రాజెక్ట్ లోఉన్న అసలువాస్తవాలు బయట కు వస్తాయి.
ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్రప్రభుత్వం రూ.371కోట్లు ఖర్చుచేస్తే, దానిలో రూ.240కోట్ల అవినీతి జరిగిందని మరోకొత్త అబద్ధంచెబుతున్నారు. రూ.240కోట్ల అవినీతిజరిగితే రాష్ట్రంలో 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఎలానెలకొల్పారు.. వాటిద్వారా 2లక్షల30వేలమందికి శిక్షణెలా ఇచ్చారు? జీఎంఆర్ ఇన్సిస్టిట్యూట్ శ్రీకాకుళం, ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజ్ - విశాఖపట్నం, ప్రగతిఇంజనీరింగ్ కాలేజ్ - తూర్పుగోదావరి, జీఎన్ టీయూ కాకినాడ, సర్. సీ.ఆర్ రెడ్డి కాలేజీ ఏలూరు, వీఆర్ సిద్ధార్థ కాలేజీ విజయవాడ, వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు, వెంకటేశ్వరఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి, కుప్పంఇంజనీరింగ్ కాలేజ్ చిత్తూరుతోపాటు త్రిబుల్ ఐటీ ఇడుపులపాయతో సహా అనేకకేంద్రాలను నెలకొల్పారు. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన అనేకకాలేజీల్లో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు నెలకొల్పి తే, రూ.241కోట్ల అవినీతి జరిగిందా? డబ్బంతా అవినీతికే ఖర్చైతే రాష్ట్రంలో 40 కేంద్రాలు ఎలా వచ్చాయో, 2లక్షల30వేలమందికి శిక్షణ ఎలా ఇచ్చారో ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి? ఈ ప్రభుత్వం వచ్చాక కూడా 2019-20లో దాదాపుగా 99వేల మంది స్కిల్ డెవల ప్ మెంట్ శిక్షణ తీసుకున్నారు. జరిగిందంతా కళ్లముందు కనిపిస్తున్నా, కావాలనే కక్షసాధింపులో భాగంగానే ఈ ప్రభుత్వం నిజాయితీ పరుడైన అధికారి లక్ష్మీనారాయణను లక్ష్యంగా చేసుకొని టీడీపీపై బురదజల్లడానికి సిద్ధమైంది. అసలు వాస్తవాలు ప్రభుత్వానికి తెలియాలంటే ఇదే ప్రభుత్వంలో కీలకస్థానాల్లో ఉన్న అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్ లను తొలుత ప్రశ్నించాలి. అదిచేయకుండా కేవలం కక్షసాధింపులలో భాగంగా బురదజల్లుతా మంటే చూస్తూఊరుకునేది లేదు. ఈ ప్రాజెక్టును సర్టిఫై చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థయైన సెంట్రల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సి.ఐ.టి.డి) అడిగితే వారే సమాధానంచెబుతారు. అలాకాకుండా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరు. వైసీపీ వాళ్ల తాటాకు చప్పుళ్లకు బయపడి వాళ్లు చెప్పే అబద్దాలు నమ్మే పరిస్థితి లేదు. నిరాధార ఆరోపణలు చేసి విషయాన్ని ప్రక్కదారి పట్టిస్తే ప్రజలు మరిచిపోయి ఓటిఎస్ పేరుతో గుంజుకుంటున్న రూ.10 వేల గురించి పేదవాళ్లు మరిచిపోతారని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.
కానీ ప్రజలు వీళ్లను కాలర్ పట్టుకుని అడిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రైతులు, ఉద్యోగులు సైతం వైసీపీ నాయకులను వదిలిపెట్టరు. రాష్ట్రంలోని ఏ వర్గం కూడా వైసీపీ నాయకులను వదిలిపెట్టే పరిస్థితి లేదు. వైసీపీ వాళ్లకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. సిఐడీ అనే ఒక తోలుబొమ్మ వారి చేతిలో ఉంది కదాని ఇలాంటి నాటకాలు వేస్తే త్రిప్పికొట్టే సత్తా లక్ష్మీనారాయణ కు ఉంది. ప్రజలకూ ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాం. రాష్ట్ర యువతకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతే గుజరాత్ రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టును ష్కుణ్ణంగా అధ్యాయనం చేసి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశారు. చంద్రబాబు నాయుడుగారు, జగన్ రెడ్డిలా గాలిలో మాటలుచెప్పి కాగితాలకే పరిమితం కాలేదు. 40 సెంటర్లను ఏర్పాటు చేసి 2 లక్షల 30 వేల మందికి ట్రైనింగ్ పొందేలా చేసి చూపించారు. వారు ఉద్యోగాలు కూడా పొందారు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందనుకుంటే...ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు అడగడం లేదు.. ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం పేమెంట్స్ చేసింది ప్రేమ్ చంద్రారెడ్డి. ఆయనను వదిలేసి లక్ష్మీనారాయణ ను అడిగితే ఆయనెలా చెబుతారు? మానిటంరింగ్ కమిటీలోను, సెలక్షన్ కమీటీలోనూ వీరే ఉన్న, నిద్రలేస్తే ముఖ్యమంత్రి గారి ప్రక్కనే ఉండే ఫైనాన్స్ సెక్రటరీ రావత్, అజైన్ జైన్ గారిని అడగకుండా రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారిని బెదిరించడం ఏంటి? ప్రాజెక్టు అడ్వైజరీ బోర్డులో అజిమ్ ప్రేమ్ జీ, శ్రీని రాజు, మధుసూధన్ లాంటి హేమాహేమీలను పెట్టాం. దీంతో నాడు రాష్ట్ర యువత విప్రో, జి.ఎం.ఆర్, ఐటిసి లాంటి ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలు పొందారు. మంచి చేసేందుకు వచ్చే వాళ్లపై ఈ విధంగా బురద చల్లితే రాష్ట్రంలో భవిష్యత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరొస్తారు?