ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అడ్డ దారులు తొక్కుతూ ప్రజల మీద భారం వేసే ప్రయత్నం చేస్తుందని, పెద్ద ఎత్తున విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే చెత్త పన్నుతో పాటుగా, ఆస్తి పన్ను విలువ ఆధారంగా పెంచి, ప్రజల పైన భారాలు వేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా ఇంటి ప్లాన్ల పేరుతో కొత్త పన్ను బాదుడికి సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేయటం కూడా ప్రారంభించారు. 1994 తరువాత నిర్మించిన ఇళ్ళకు, ఇంటి ప్లాన్ ని పరిశీలించి, ప్లాన్ ప్రకారం మన ఇల్లు లేకపోతే, అంటే ప్లాన్ డీవియేషన్ ఉంటే వాళ్ళ మీద పెనాల్టీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ఆదాయం రాబట్టుకోవాలనే ఉద్దేశం తప్ప, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనే ఆలోచన లేకుండా బాదేస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడ నగర పాలక సంస్థలో, అనేక మందికి ఏదైతే పన్నుకు సంబంధించి, రెగ్యులర్ గా కట్టే టక్స్ కి సంబంధించి , డిమాండ్ నోటీస్ లు వస్తున్నాయో, అందులోనే, ఈ పెనాల్టీ విధిస్తున్నారు. ఆ నోటీసులు చూసిన ప్రజలు షాక్ తింటున్నారు. ఆ నోటీసులు చూసిన ప్రజలు, అవి తీసుకుని వెళ్లి వార్డు సచివాలయాల్లో, కార్పొరేషన్ కార్యాలయాలకు వెళ్లి అడుగుతుంటే, మీ ఇంటి ప్లాన్ తీసుకుని రండి, అప్పుడు దీనికి సంగతి ఏమిటో చూస్తాం అని చెప్తున్నారు.

tax 111122021 2

ఇంటి ప్లాన్ తీసుకుని వెళ్తే, మీరు నిర్మించిన ఇంటికి సంబంధించి, కార్పొరేషన్ ఇచ్చిన ప్లాన్ కి విరుద్ధంగా, మీరు ఇల్లు నిర్మించారని, అందుకే దాని మీద టాక్స్ విధిస్తున్నారని, చెప్పారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ నోటీస్ లో ఇది రావటంతో, అధికారులు చెప్తున్న సమాధానానికి ప్రజలు బెంబేలుఎత్తి పోతున్నారు. విజయవాడ నగర పాలక సంస్థలో 1994 తరువాత నిర్మించిన ఇళ్ళకు, విలువ ఆధారిత పన్ను అని మొన్న కొత్తగా పన్ను విధించిగా, ఇప్పుడు కొత్తగా, ప్లాన్ కి విరుద్ధంగా మీరు ఇల్లు కట్టారు అంటూ, మరో పన్ను విధించటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి ఈ నిర్ణయం పై తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. వందల కోట్ల డబ్బులు రాబట్టుకునెందుకు మాత్రమే, ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని, ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విషయం పైన ప్రతిపక్షాలు కూడా భగ్గుమంటున్నాయి. 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లకు, ఇప్పుడు దోచుకోవటం దుర్మార్గం అని విపక్షాలు వాపోతున్నాయి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఒకటే రాజధానిగా అమరావతి ఉండాలని, భూములు ఇచ్చిన తమను అన్యాయం చేయవద్దు అంటూ, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర అంటూ, అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతుల పాదయాత్ర 40వ రోజుకి చేరుకుంది. ఈ పాదయాత్ర మరో వారం రోజుల్లో ముగియనుంది. డిసెంబర్ 17న ముగింపు సందర్భంగా, బహిరంగ సభ పెట్టాలని అమరావతి జేఏసి నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఇప్పటికే, ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్ ఇవ్వమని పర్మిషన్ కోరగా, సహజంగా ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఎస్వీ యూనివర్సిటీ, ఆ వినతిని తిరస్కరించింది. దీంతో రైతులకు, తమ భూమి ఇస్తాం అని, తన భూమిలో మీటింగ్ పెట్టుకోవాలని, ఒక వ్యక్తి ముందుకు రాగా, రైతులు, ఆ భూమిలో మీటింగ్ పెట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకంటే ముందే, పోలీస్ వారికి, అక్కడ మీటింగ్ పెట్టుకోవటానికి అనుమతి కోరారు. దీని పైన గత వారం రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. పోలీసుల ప్రశ్నలకు, అమరావతి రైతులు సమాధానాలు కూడా ఇచ్చారు. అయితే అందరూ అనుకున్నట్టే, పోలీసులు, రాజధాని రైతులకు షాక్ ఇచ్చారు. అనుమతిని నిరాకిస్తున్నాం అని, మీటింగ్ పెట్టుకోవటానికి వీలు లేదు అంటూ షాక్ ఇచ్చారు.

amaravati 11122021 21

దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17న తిరుపతిలో సభకు పోలీసుల అనుమతి నిరాకరించారని, ముందుగానే లేఖ ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని వాపోయారు. శని, ఆదివారాలు కోర్టు సెలవు చూసుకుని నిర్ణయం ప్రకటించారని అన్నారు. తిరుపతిలో సభకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తాం అని, సోమవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు సెహ్స్తామని అన్నారు. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం అని అన్నారు. ఇక అమరో పక్క ఈ నెల 15, 16న శ్రీవారి దర్శనం కోసం టీటీడీను కోరాం అని, ఆలయ నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశాం అని, కొండపై రాజకీయ విమర్శలు, జెండాలు, నినాదాలు చేయం అని, పాదయాత్ర చేసినవారికి దర్శన భాగ్యం కల్పించాలని టిటిడిని కోరాం అని, టీటీడీ ఇచ్చిన షరతులపై సమాధానం పంపాం అని అమరావతి రైతులు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం, హైకోర్టు కేవలం పాదయాత్రకే అనుమతి ఇచ్చిందని, మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు. మరి హైకోర్టు, ఏమి చెప్తుందో చూడాలి.

పది రోజుల క్రితం విడుదలై, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్న అఖండ సినమీ, సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళ్తుంది. అఖండ సినిమా పై ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాను కూడా అఖండ సినమీని చూశానని చెప్పిన చంద్రబాబు, ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, అవే అఖండ సినిమాలో కూడా చూపించారని అన్నారు. పంచ భూతాలను మింగేయటం, దేవాలయాల విధ్వంసం గురించి, చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు. అఖండ సినిమా చాలా బాగుందని అన్నారు. చంద్రబాబు అంతకు ముందు ప్రెస్ మీట్ లో, ఏపి విభజన హామీల పై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ "వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోంది. వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది.. తిరుగుబాటు తప్పదు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. పరిపాలన అనుభవం లేక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జగన్ ప్రభుత్వానివి అన్నీ అబద్దాలే. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని అని జగన్ అనలేదా?. ప్రత్యేక హోదా వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని చెప్పారు. వైసీపీ ఎంపీలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?. పార్లమెంటులో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మంత్రి చెప్పారు. ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాడలేకపోయారో సమాధానం చెప్పాలి. ఆనాడు ప్రజలకు ప్రత్యేక హోదా సాధిస్తామని భరోసా ఇచ్చారు - ప్రత్యేక హోదా సాధించలేకపోతే రాజీనామా చేస్తామని చెప్పారు - హోదా కోసం రాజీనామా చేసి ఎందుకు పోరాడరు - ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి - మేము రాజీనామా చేస్తాం.. ప్రత్యేక హోదా కోసం పోరాడదాం - మీ డైవర్షన్ పాలిటిక్స్ ఇక పనిచేయవు - హోదాపై వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాడటం లేదు? - హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారు - విశాఖ ఉక్కుపై ఎన్నికల ముందు చెప్పిందేంటి?.. ఇప్పుడు చేస్తోందేంటి? - గతంలో ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుంది

nbk 11122021 2

పాస్కో ప్రతినిధులతో జగన్ మాట్లాడలేదా - రైల్వే జోన్ విషయంలోనూ వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు - రాష్ట్ర హక్కులను కాపాడుకోవడంలో విఫలమయ్యారు - విశాఖపై ప్రేమ చూపిస్తున్న ఈ ప్రభుత్వం.. రైల్వే జోన్‍ను ఎందుకు పోగొట్టింది? - సమాధానం చెప్పలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తారు? - ముఖ్యమంత్రి మోసాలను ప్రజలు యువత అర్థం చేసుకోవాలి - పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేయడానికి నాడు అన్ని విధాలా ప్రయత్నం చేశారు - ఇప్పుడు ప్రాజెక్టును అధోగతి పాలు చేసే పరిస్థితికి వచ్చారు - ప్రాజెక్టు విషయంలో అప్పుడు వైఎస్ కొన్ని తప్పటడుగులు వేశారు - ఐదేళ్లలో 11,537 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును 70 శాతం పూర్తిచేశాం - ప్రాజెక్టుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ట్రాక్‍లో నడిపించాం -2021 పోలవరం పూర్తి చేస్తామన్నారు.. మళ్లీ 2022 అంటున్నారు.. ఇప్పుడు అది కూడా డౌటే - అవగాహన రాహిత్యం వల్ల ఇరిగేషన్‍ను భ్రష్టు పట్టించారు - కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను మొత్తాన్ని కేంద్రానికి అప్పగించారు - రాష్ట్రానికి అమరావతి పోలవరం రెండు కళ్లు - ఆ రెండు కళ్లను వైసీపీ ప్రభుత్వం పొడిచేసింది - అవినీతి అన్నారు.. ఎంక్వైరీ అన్నారు.. రివర్స్ టెండర్లు అన్నారు - పేదల రక్తం తాగే ప్రభుత్వం ఇది - ప్రజలు భయపడితే పూర్తిగా నష్టపోతారు - అమరావతి రాజధానిని నాశనం చేశారు - రైతులు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా ఆంక్షలు - రెండున్నరేళ్లలో 7 లక్షల కోట్లకు పైగా అప్పులు - పీఆర్పీ, సీపీఎస్ హామీలు ఏమయ్యాయి? - వైసీపీకి పాలించే హక్కు లేదు : టీడీపీ అధినేత చంద్రబాబు

ఈ మధ్య కాలంలో వచ్చిన జై భీమ్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏపిలో దళితుల అణిచివేత కూడా అదే స్థాయిలో ఉండటంతో, ఏపి లో కూడా, ఆ సినిమాకి కనెక్ట్ అయిన వారు ఉన్నారు. ఆ సినిమాలో సూర్య చేసిన ఆ క్యారక్టర్, జస్టిస్ చంద్రు అనే వ్యక్తిది. అయితే తమిళనాడులో ఉన్న జస్టిస్ చంద్రు, నిన్న విజయవాడలో ప్రత్యక్ష్యం అయ్యారు. సినిమా పైన సదస్సు అని కొంత మంది ఆయన్ను తీసుకుని వచ్చారు. ఆయన ఇక్కడ ఏపిలో జరుగుతున్న దళితుల మారణహోమం గురించి ప్రస్తావిస్తారని, మరీ ముఖ్యంగా మన కళ్ళ ముందే న్యాయం కోసం పోరాడి చనిపోయిన డాక్టర్ సుధాకర్, శిరోమండనం వర ప్రసాద్ గురించి ప్రస్తావిస్తారని అందరూ భావిస్తే ఆయన మాత్రం, వైసీపీ ట్యూన్ అయిన, కోర్టులు, జడ్జిల పైన విమర్శలు అనే టాపిక్ ఎత్తుకున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై రఘురామకృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు. రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ., "న్యాయమూర్తి, అలాగే జైభీమ్ సినమాలో సూర్య క్యారక్టర్ కి ఇన్స్పిరేషన్ అని గతంలో నేను కూడా జస్టిస్ చంద్రు గురించి గొప్పగా ఊహించుకున్నా. కానీ ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థ మీద, ఇక్కడ జరుగుతున్న పరిస్థితితులు ఏమి తెలియకుండా, ఒక చిన్న తలపాగా పెట్టి, ఒక శాలువా కప్పగానే, వారు మాట్లాడిన మాటలు వింటే నవ్వు వచ్చింది, తరువాత బాధ అనిపించింది. "

rrr 11122021 2

"రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, అందులో కొన్ని చట్టాలు ఉంటాయి. హైకోర్టు కానీ, సుప్రీం కోర్టు కానీ, ముఖ్యంగా చూసేది రాజ్యాంగం చూసే తీర్పులు ఇస్తాయి. అయితే ఆయన మాత్రం, ఇవీమీ తెలియనట్టు, అవగాహన లేకుండా మాట్లాడారు. మాట్లాడించినట్టు అల్లా, ఒక కేజిడ్ ప్యారెట్ లాగా, ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుని మాట్లాడినందుకు ఆయన్ను చూసి బాధ పడాల్సి వస్తుంది. మరి అలాగే, వారిని ఈ స్థాయిలో, ఇంత కిందకు దిగజార్చిన, మా యువజన శ్రామిక రైతు పార్టీని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, వ్యక్తిగతంగా హాట్సాఫ్. చూద్దాం న్యాయ వ్యవస్థను ఇప్పుడు వేరే వారితో తిట్టించారు. వారిని జైల్లో పెట్టించారు. ఇప్పుడు ఒక న్యాయ మూర్తితోనే తిట్టిస్తే, అదీ ఒక దళిత జడ్జి గారితో తిట్టిస్తే, ఇబ్బంది ఉండదని చెప్పి, మీరు పన్నిన ఈ పన్నాగానికి మిమ్మల్ని అభినందిస్తూ, ఆ ఉచ్చులో చిక్కుకున్న వారిని చూసి బాధ పడుతూ, ఏది నిజం అనేది ప్రజలే నిర్ణయించుకుంటారు." అని రఘురామరాజు కౌంటర్ ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read