ఎవరికైనా పరపతి ఉన్నంత వరకే. మన పరపతి మనం చేతులారా పాడు చేసుకుంటే, మనల్ని ఇంట్లో వాళ్ళు కూడా లెక్క చేయరు. చేతులారా చేసుకున్న దానికి, అనుభవించక తప్పని పరిస్థితి. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. మొన్నటి వరకు దేశానికి ఆదర్శంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు దేశం నుంచి చీత్కారాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోవటంతో, సమయానికి చెయ్యాల్సిన చెల్లింపులు చేయకపోవటం, గడువు దాటి పోయినా, వార్నింగ్ లు ఇచ్చినా పట్టించుకోక పోవటంతో, అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి, మన పీక మీద కత్తి పట్టే పరిస్థితి వచ్చింది. గత నెలలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మన రాష్ట్రానికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలోనే వాళ్ళు ఇదే ప్రశ్న అదిగారు. మా అప్పు చేల్లిస్తారా ? లేదా మిమ్మల్ని దివాలా రాష్ట్రంగా ప్రకటించమంటారా అని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ అలాగే రూరల్ ఎలేక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి అప్పులు తీసుకుంది. అయితే గడువు తీరి పోయినా అప్పులు చెల్లించక పోవటంతో, పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ అలాగే రూరల్ ఎలేక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సీరియస్ అయ్యి, రాష్ట్రానికి కూడా హెచ్చరిక జారీ చేసారు.
ఏపి తీరుతో విద్యుత్ సంస్థలు తమ ప్రతిష్ట కోల్పోతున్నాయని వాపోయారు. గత నెలలో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం, రాష్ట్ర అధికారులతోనూ, జగన్ మోహన్ రెడ్డితోనూ సమావేశం అవ్వటంతో, రాష్ట్ర ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించింది. మొత్తం 2500 కోట్లకు పైగా బాకీ ఉండటంతో, వెంటనే 500 కోట్లు చెల్లించింది, మరింత ఒత్తిడి చేయటంతో మరో 400 కోట్లు చెల్లించింది. అయితే ఇంకా 2000 కోట్లు బాకీ ఉండటంతో, మళ్ళీ పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ అలాగే రూరల్ ఎలేక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ తగులుకున్నాయి. తమ బకాయలు వెంటనే చెల్లించాలని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసాయి. డబ్బులు చెల్లిస్తారా ? లేదా మీ రాష్ట్రాన్ని దివాలాగా ప్రకటించాలా అని హెచ్చరించాయి. దీని పై స్పందించిన రాష్ట్రం, ఇప్పటికే కొంత బకాయలు చెల్లించాం కాబట్టి, మిగతా బకాయలు కూడా చెల్లించటానికి తమకు సమయం కావాలని, కోరాయి. అయితే రెండో సారి కూడా ఇలాంటి హెచ్చరికలు రావటం, ఏపికి అవమానమే అని చెప్పాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ బకాయలు చెల్లించి, ఏపి పరువు కాపాడాలి.