నాయకులెవరైనా కష్టపడి, నిజాయితీగా పనిచేస్తేనే పార్టీలో సముచిత స్ధానం ఉంటుందని, అలసత్వం వహిస్తే ఎంతటి నేతలనైనా ఉపేక్షించేదిలేదని టీడీపీ జాతీయ అధ్యక్ష్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో అనంతపురం జిల్లా పెనుగొండ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనుగొండలో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాకపోవటంపై జిల్లా నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా నాయకుల మద్య సమన్వయ లోపం, అలసత్వం వల్లే పెనుగొండ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందిందని ఇక నుంచి నాయకులంతా కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడి చేయాలని,‎ పార్టీ కార్యక్రమాల పట్ల అలసత్వం వహిస్తే ఎంతటి నేతలనైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ ఫలితాలపై నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. నాయకులపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వారికి అండగా నిలిచిన నాయకుల్నే ప్రజలు ఆదరిస్తారని, నాయకులంతా నిత్యం ప్రజల్లో ఉంటూ వైసీపీ దుర్మార్గాలను ఎండగడుతూ బాధితుల పక్షాన నిలవాలని అన్నారు.

atp 04122021 2

టీడీపీ నేతలపై అక్రమ కేసులు వైసీపీకీ తాత్కాలిక ఆనందమేనని, వైసీపీ అరాచకాలకు భయపడకుండా దైర్యంగా ఎదుర్కొని పోరాడాలన్నారు. గెలుపు ఓటములపై చంద్రబాబు అభ్యర్ధులతో చర్చించగా.. వాలంటీర్ల దౌర్జన్యాలు, వైసీపీ నేతల బెదిరింపులను చంద్రబాబు దృష్టికి తీసుకురాగా.. వైసీపీ పాలనలో ఉన్మాదం పెరిగిపోయిందని, అరాచకాలు, దౌర్జన్యాలు హద్దు మీరిపోయాయని, ఆ ఉన్మాదులను దైర్యంగా ఎదురర్కొంటునే రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది వరకు అభ్యర్ధులు గెలిచిన తర్వాత వారికి క్యాంపులు పెట్టి కాపాడే వారని, ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో నామినేషన్లు వేయటానికి కూడా క్యాంపులు పెట్టి వారిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పోటీ చేసిన వారినే కాకుండా, వారికి మద్దతు ఇచ్చే వారిని కూడా హింసిస్తున్నారు. నాయకుల గత చరిత్ర కంటే కూడా, ప్రజలలో వారికి ఉన్న ఆదరాభిమానాలే ఓట్లు పడేలా చేస్తాయని అన్నారు.

రెండు రోజుల క్రితం, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ పరువుని దేశ వ్యాప్తంగా తీసాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అన్నమయ్య డ్యాం ప్రమాదం గురించి, ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తించిన తీరు గురించి, రాజ్యసభలో దులిపేసారు. ఏపి తీరుతో, మన దేశానికి అంతర్జాతీయంగ పరువు పోయే పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపిలో హాట్ టాపిక్ అయ్యాయి. జగన్ ప్రభుత్వ అసమర్ధతను ప్రజల ముందు ఉంచాయి. నిన్నటి వరకు టిడిపి ఇదే మాట చెప్తే, రాజకీయం అని కొట్టేసిన వైసీపీకి, ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్తే, ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే, మరో షాక్ ఇచ్చింది కేంద్రమా. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందటం లేదని అన్నారు. బకాయిలు ఉన్నాయని, అవి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించటం లేదని అన్నారు. దీంతో రైల్వే ప్రాజెక్ట్ ల పై ఆ ప్రభావం పడుతుందని రాజ్యసభలో తెలిపారు. నిన్న రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్ట్ ల తీరు పై, తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్న అడగగా, దానికి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమాధానం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో సహకారం అందించటం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా ప్రకారం, డబ్బులు ఇవ్వటం లేదని అన్నారు.

railway 04122021 2

అందుకే ఏపిలో రైల్వే ప్రాజెక్ట్ లు ముందుకు వెళ్ళటం లేదని అన్నారు. సహజంగా రైల్వే ప్రాజెక్ట్ లు, 50 శాతం వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఈ విషయంలో సహకారం అందించటం లేదని, కేంద్ర ప్రభుత్వం , రాజ్యసభ సాక్షిగా చెప్తుంది. మొత్తం ఆరు ప్రాజెక్ట్ ల విషయంలో, మొత్తం ఖర్చు రూ.15,846.35 కోట్లుకాగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.746.63 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇందులో ఇప్పటికీ రూ.3,073.5 కోట్లు బకాయి ఉందని ఆయన రాజ్యసభలో తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్‌ , భద్రాచలం-కొవ్వూరు లైన్‌, విజయవాడ-గుడివాడ-భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నిడదవోలు ప్రాజెక్ట్, కడప-బెంగుళూరు కొత్త లైన్‌, కోటిపల్లి-నరసాపురం లైన్, తుమకూరు-రాయదుర్గం లైన్‌, ఇలా అనేక ప్రాజెక్ట్ ల విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సహకారం రావటం లేదని, కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో చెప్పింది. ఏపి ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో ఇది చూస్తూనే అర్ధం అవుతుంది.

దేశ చట్టాలు చేసే పార్లమెంట్, రాజ్యసభ లాంటి చోట, సహజంగా వేరే ప్రభుత్వాలను నిందిస్తూ కేంద్రం ప్రకటన చేయదు. అంశం ఎంతో తీవ్రమైనది అయితే తప్పితే, కేంద్రం ఉన్నత వేదికల పైన ఒక రాష్ట్ర ప్రభుత్వం వైపు వేళ్ళు చుపించదు. అంతర్జాతీయ స్థాయిలో, ఒక రాష్ట్ర ప్రభుత్వం వల్ల, దేశం పరువు పోతుంటే, ఏ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటుంది ? సరిగ్గా అదే జరిగింది నిన్న రాజ్యసభలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రభుత్వ నిర్ల్యక్షంతో, కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయి, ఏకంగా ఊళ్ళకు ఊళ్లు కొట్టుకుపోయాయి. దాదాపుగా 40 మంది చనిపోయారు. ఈ దుర్ఘటన జరగటానికి ప్రధాన కారణం అక్కడ సరిగ్గా ప్రభుత్వం స్పందించక పోవటం. రికార్డు స్థాయిలో వర్షాలు ఉంటాయని, వరదలు ఉంటాయని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో చేసిన ఈ నిర్ల్యక్షమే కొంప ముంచింది. వరద వచ్చే దాకా డ్యాం గేట్లు ఎత్తక పోవటం, డ్యాం గేట్లు ఎత్తే సరికి ఒక గేటు ఓపెన్ కాక పోవటం, వరద విపరీతంగా రావటంతో, తట్టుకోలేక డ్యాం కొట్టేసి, ఒకేసారి వెళ్లి ఊళ్ళ పైన పడింది. దీంతో మొత్తం నాశనం అయిపొయింది. కళ్ళ ముందే అనేక మంది పోయారు. ఈ దుర్ఘటన పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నిన్న రజ్యసభలో ఈ అంశం ప్రస్తావించారు.

jagan 0412221 2

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ, అన్నమయ్య ప్రాజెక్ట్ లో జరిగిన దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. గేటు ఎందుకు ఓపన్ అవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అన్నారు. ఈ విషయం పైన అంతర్జాతీయంగా దేశం పరువు పోయిందని అన్నారు. అయితే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇన్నాళ్ళు టిడిపి ఆరోపణలు చేస్తుంటే, రాజకీయ ఆరోపణలు అని ప్రజలు కొట్టి పారేస్తారని వైసీపీ భావించింది. ఇప్పుడు రాజ్యసభ సాక్షిగా, తమ అసమర్ధతను కేంద్ర మంత్రే బయట పెట్టటంతో, ఎదురు దా-డి మొదలు పెట్టారు. నిన్న మంత్రి అనిల్ మాట్లాడుతూ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కు అసలు అవగాహన లేదని, ఆయనకు ఏమి తెలియదని మాట్లాడారు. ఇది వింతగా అనిపించినా, నిజం. కేంద్ర మంత్రికి అవగాహన లేదని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన బాగా అవగాహన ఉన్న మంత్రి అనిల్ కుమార్ మాట్లాడటం హైలైట్ అనే చెప్పాలి.

జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేక కేసు, తెలినట్టే తేలుతుంది, మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్య కాలంలో, ఈ కేసు విషయం పై వస్తున్న వార్తలు చూస్తే, ఈ కేసు అయిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ మళ్ళీ చాడీ చప్పుడు ఉండదు. వివేక కుమార్తె సునీత హైకోర్టులో పిటీషన్ వేసి మరీ, ఏపి పోలీసుల పైన నమ్మకం లేదని, సిబిఐకి విచారణ బాధ్యతలు ఇవ్వమని కోరారు. తరువాత హైకోర్టు, ఈ కేసుని సిబిఐకి అప్ప చెప్పింది. తరువాత రకరాకాల కారణాలతో సిబిఐ విచారణ లేట్ అయ్యింది. ఆ తరువాత సునీత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, కేసు విచారణ పై అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత, ఈ కేసు మళ్ళీ స్పీడ్ అందుకుంది. ఈ మధ్య కాలంలో వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ తో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ మొత్తం స్కెచ్ వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారనే వార్తలు బయటకు రావటంతో, సంచలనంగా పరిణామాలు మారాయి. అయితే అవినాష్ రెడ్డి ముఖ్య అనుచురుడు దేవిరెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయటంతో, ఒక్కసారిగా వైసీపీలో కలకలం రేగింది. తరువాత రోజు నుంచి, సిబిఐ పైనే ఎదురు దా-డి మొదలు పెట్టారు. సిబిఐ డబ్బులు ఇచ్చింది చెప్పిస్తుందనే ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం అనూహ్యంగా బ్లూ మీడియా నుంచి వచ్చింది.

viveka 04122021 2

అక్కడితో ఆగలేదు, వివేక పైనే ఆరోపణలు చేసారు. అతనికి స్త్రీల బలహీనత ఉందని ప్రచారం మొదలు పెట్టారు. ఆ తరువాత వివేక అల్లుడు, కుమార్తె పైనే ఆరోపణలు చేసారు. ఈ నేపధ్యంలోనే, ఈ కేసుని తేలనివ్వకుండా, మరింత సాగ దీయటానికి , ఇప్పటికే కొన్ని అవినీతి కేసుల్లో మనం చూస్తున్న డిశ్చార్ పిటీషన్ల ప్లాన్, ఇక్కడ కూడా వేసారు. ఒకే రోజు రెండు పిటీషన్లు దాఖలు అవ్వటంతో, ఈ కేసుని వీలైనంత సాగ దీయాలి అనే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎర్ర గంగి రెడ్డి, ఈ కేసు నుంచి తనని తప్పించాలని హైకోర్టులో పిటీషన్ వేసారు. ఇప్పటికే ఇతను ఇదే కేసులో బెయిల్ పై బయట ఉన్నారు. ఇక రెండోది, దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ పిటీషన్ పైన. దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ పిటీషన్ ను అంగీకరించవద్దు అంటూ, ఇదే హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు అయ్యింది. ఇక వీటి వాయిదాలు, అనేక అనేక విన్యాసులు పిటీషనర్లు చేస్తూ, కేసుని సాగదీసే అవకాసం ఉంది. ఇది కూడా ఇప్పటికే మనం చూస్తున్న అవినీతి కేసులు లాగా ఏళ్ల తరబడి సాగినా ఆశ్చర్యం లేదు.

Advertisements

Latest Articles

Most Read