అంతా అనుకున్నట్టే ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. గత కొన్ని రోజులుగా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సొమ్ములను ప్రభుత్వం తీసుకునే ప్రక్రియ, మొత్తం అనుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగ సంఘాల అభ్యంతరాలు కానీ, ఉద్యోగులు యొక్క ఆందోళన కానీ, ప్రభుత్వం కానీ, యూనివర్సిటీ పెద్దలు కానీ ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.దాదాపుగా నెల రోజుల క్రితం మొదలైన నిధుల బదలాయింపు ప్రక్రియ, నిన్నటితో ఒక కొలిక్కి వచ్చింది. రూ.400 కోట్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్స్ గా ఉన్నటు వంటి ఫండ్స్ ని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో ఉన్న ఏపి ఫైనాన్సు కార్పొరేషన్ కు తరలించాలనే ప్రక్రియ నిన్న ప్రారంభం అయ్యింది. దీని పై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు నిన్న అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న వీసితో భేటీ తరువాత, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సొంత సంస్థలో ఉన్న ఉద్యోగుల ఆవేదనను ఆయన అడ్డ్రెస్ చేయకుండా, మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ, స్వయంగా వీసీ చెప్పటం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈ రోజు ఉదయం కూడా, రిజిస్టార్ ని కలిసి, తమ అనుమానాలను, ఆవేదనను, వర్సిటీ పెద్దల ముందు ఉంచే ప్రయత్నం చేసారు.
అయినా కూడా యూనివర్సిటీ పెద్దల నుంచి ఎలాంటి సానుకూల స్పందన కానీ, సంప్రదింపులు ప్రక్రియ కానీ జరగక పోవటం పట్ల, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఉద్యోగులు అందరూ కలిసి ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న మీటింగ్ హాల్ లో, ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ మీటింగ్ కొనసాగుతుంది. ప్రభుత్వంతో పాటుగా, యూనివర్సిటీ పెద్దలు తీసుకున్న నిర్ణయం పట్ల, ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఇది వ్యక్తిగత సమస్యగా భావించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే జరిగితే కనుక ఉద్యోగుల జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదని నిర్ణయం తీసుకున్నారు. మరి కొద్ది సేపట్లో దీని పైన ప్రకటన చేయనున్నారు. అయితే నిన్న వీసీ మాట్లాడుతూ, తాను ఏమి చేయలేనని, బాస్ అడిగాడు ఇచ్చేసాను అని చెప్పటం పై, ఉద్యోగులు షాక్ తిన్నారు. ఆసలు ఈ బాస్ ఎవరు ? అనేది ఇప్పుడు చర్చగా మారింది ? బాస్ అంటే జగన్ మోహన్ రెడ్డి గురించి చెప్పారా ? లేక మరెవరైనా గురించి చెప్పారా అనేది తెలియాలి.