ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను నిన్న రాత్రి హైదరాబాద్ తరలించారు. ఆయనకు ఇటీవల క-రో-నా వచ్చి, క-రో-నా నుంచి కోలుకున్న తరువాత, ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ లో చికిత్స చేసారు. అయితే ఆయనకు నిన్న సాయంత్రం నుంచి కూడా అస్వస్థతగా ఉండటంతో, నిన్న రాత్రి ఆయన్ను గన్నవరం తీసుకొచ్చి, అక్కడ నుంచి ప్రయత్యేక విమానంలో హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు గతంలో కూడా ఏఐజి చికిత్స పొంది ఉండటంతో, అక్కడ డాక్టర్లతో మాట్లాడిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకోసం నిన్న రాత్రి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసారు. నిన్న రాత్రి హైదరాబద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో దిగి, ఏఐజి హాస్పిటల్ కు వెళ్లారు. అయితే రాజ్ భవన్ సిబ్బంది మాత్రం, పోస్ట్ కో-వి-డ్ ఇబ్బందులతోనే, ఆయనను హైదరాబాద్ తరలించినట్టు చెప్తున్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్ భవన్ సిబ్బంది చెప్పారు. పోస్ట్ కో-వి-డ్ ట్రీట్మెంట్ కోసమే ఆయన్ను హైదరాబాద్ తరలించామని చెప్తున్నారు. గవర్నర్ తో పాటుగా, ఆయన సతీమణి కూడా వెళ్లారు.

govenor 29112021 2

రాజ్ భవన్ వ్యక్తిగత వైద్యులు మాత్రం, ఆయన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నామని, హైదరాబాద్ లో పోస్ట్ కో-వి-డ్ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారని చెప్తున్నారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి పై, ఈ రోజు ఏఐజి హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాసం ఉంది. సరిగ్గా అయుదు రోజులు క్రితం గవర్నర్ ను గన్నవరం నుంచి ఏఐజి హాస్పిటల్ కు తరలించారు. ఆ సమయంలో, ఆయనకు క-రో-నా అని తేలింది. ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సమావేశానికి వెళ్లి వచ్చిన తరువాత, అస్వస్థతకు గురి కావటంఓ, ఆయనకు విజయవాడలో టెస్ట్ లు చేసి, కోవిడ్ లక్ష్యనాలు ఉండటంతో, ప్రత్యేక విమానంలో ఆయన్ను హైదరాబాద్ తరలించారు. అక్కడ అయుదు రోజులు పాటు చికిత్స అనంతరం, ఆయన ఆరోగ్యం మెరుగు పడటంతో, గవర్నర్ ను డిశ్చార్జ్ చేసారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఆయన ప్రత్యెక వైద్య బృందం చికిత్స చేసింది. నాలుగు రోజులు తరువాత, మళ్ళీ ఆయన్ను ఏఐజికి తీసుకెళ్ళారు. ఇది కేవలం పోస్ట్ కో-వి-డ్ ట్రీట్మెంట్ అని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టింది. మరీ ముఖ్యంగా రాయలసీమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, ప్రభుత్వం అసమర్ధతతో, ప్రజలు అల్లాడిపోతున్నారు. మొన్నటి వర్షాలు, వరదలు మర్చిపోక ముందే, ఇప్పుడు మరోసారి ఏపికి వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తూ, వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు ఉంటాయని, రేపు కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పటంతో, రేపు స్కూళ్ళకు సెలవులు కూడా ప్రకటించారు. ఇప్పటికే అనేక చోట్ల వర్షం భారీగా పడుతుంది. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు ఇప్పటికే పడుతున్నాయని తెలుస్తుంది. పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. అనేక వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మొన్న జరిగిన విధ్వంసం తలుచుకుని కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఈ వర్షాల వల్ల, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకూడదని ఆశిద్దాం.

ఏపీకి బాక్సైట్ ఖనిజాన్ని సరఫరా చేసే విషయంలో పొరుగు రాష్ట్రం ఒడిసా విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ధర, రవాణాతోపాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని బాక్సైటు సరఫరా చేయడం సాధ్యంకా దని ఒడిసా ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర సర్కారు కోరుతోంది. విశాఖపట్నం జిల్లా మాకవారిపాలెం మండలం రాచపల్లి వద్ద పెన్నాగ్రూప్, రస్ఆల్‌ఖైమా ఇన్వెస్ట్మెంట్ అధారిటీ(రకియా గ్రూప్) సంయుక్తంగా అల్యూమినియం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాయి. ఈ ఫ్యాక్టరీకి బాక్సైటు సరఫరా చేస్తామని 2008లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ మన్యంలోని బాక్సైట్ను తవ్వి అక్కడే ఉన్న సరఫరా చేసేలా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ముందుకొచ్చింది. అయితే, అక్కడ బాక్సైట్ మైనింగ్ పై పెద్ద ఉద్యమమే సాగింది. దీంతో మైనింగ్ ముందుకు సాగలేదు. 2016లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఒప్పం దాన్ని రద్దుచేశారు. దీనిపై రకియా గ్రూపు రూ.1100 కోట్ల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కింది. దీంతో.. ఏపీలో బాక్సైట్ మైనింగ్ చేయలేమని, పక్కనే ఉన్న ఒడిసా నుంచి ఇప్పించాలని జగన్ సర్కారు కోరుతోంది. ఇదే అంశంపై తొలుత ఒడిసా ప్రభుత్వంతో మాట్లాడారు.

orissa 28112021 2

గత ఏడాదిన్నరగా ఈ అంశంలో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. బాక్సైట్ సరఫరాపై ఒడిసా సర్కారు ఇటీవల విముఖతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఒడిసా సర్కారు బాక్సైట్ సరఫరాచేసేలా చర్యలు తీసుకోవా లని ఏపీ సర్కారు కోరుతోంది. నెల రోజుల క్రితం, ఈ విషయం తేల్చుకోవటానికి విదేశాలకు కూడా రాష్ట్ర అధికారులు వెళ్ళి వచ్చారు. అక్కడ కేసు నడుస్తూ ఉండటం, త్వరలోనే తీర్పు వస్తు ఉండటంతో, దీని పై రాజీ ఫార్ములాకు వెళ్ళాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భావించింది. అయితే తరువాత దీని పై ఏమి చేయాలి అనే అంశం పై మల్లగుల్లాలు పడ్డారు. ఇక్కడ విశాఖలో బాక్సైట్ కు అనుమతి ఇస్తే, అల్లకల్లోలం జరుగుతుంది కాబట్టి, ఒరిస్సా నుంచి ఇవ్వాలనే ప్రతిపాదన పెడితే ఎలా ఉంటుందని భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవటానికి ఇష్ట పడలేదు. మొన్నీ మధ్య జగన్ మోహన్ రెడ్డి , ఒరిస్సా వెళ్ళటం వెనుక ఈ కారణం కూడా ఉందనే ప్రచారం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టకేలకు, ఉద్యమ బాట పట్టారు. ఇన్నాళ్ళు ఓర్పుగా రాష్ట్ర ప్రభుత్వంతో సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూసి చూసి, ఇక మా వల్ల కాదు అంటూ, ఉద్యమ బాట పట్టారు. ఈ రోజు సమావేశం అయిన ఉద్యోగ సంఘాలు, ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ఏపీ జేఏసీ, అమరావతి, ఎన్జీవో జేఏసీ ఉద్యోగ సంఘాలు ఈ రోజు సమావేశం అయ్యి, తమ సమస్యల పరిష్కారం కోసం, ఉద్యమ బాట పట్టటానికి రెడీ అయ్యారు. ఆందోళన కార్యక్రమాల పై, డిసెంబర్ ఒకటో తేదీన, చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకునంరు. డిసెంబర్ 7 నుంచి 10 వరకు, ప్రభుత్వ తీరుకు నిరసనగా, నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే భోజన విరామ సమయంలో నిరసన తెలపటానికి ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే డిసెంబర్ 13 నుంచి 15 వరకు, అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు చేయాలని, సమావేశాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక డిసెంబర్ 16 నుంచి, మండల కేంద్రాల్లో సాయంత్రం వరకు ధర్నాలు చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక డిసెంబర్ 21 నుంచి 26 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు ఉద్యోగ సంఘాలు.

empoloyees 28112021 2

ఆ తరువాత డిసెంబర్ 27, 30, జనవరి 3, 6 తేదీల్లో విశాఖ, తిరుపతి, ఏలూరు, ఒంగోలులో భారీగా ప్రాంతీయ సమావేశాలు పెట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా పీఆర్సి నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న తీరు పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. పది రోజుల క్రితం ఈ విషయం పై సచివాలయంలో ధర్నా కూడా చేసారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాము దాచుకున్న పీఎఫ్ డబ్బులను కూడా దారి మళ్ళించారని ఆరోపిస్తున్నారు. ఇక రిటైర్ అయిన వారికి కూడా బెనిఫిట్స్ ఇవ్వటం లేదని, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటి అన్నిటి పైనా, గత కొన్ని నెలలుగా ప్రభుత్వ అధికారులు చుట్టూ, ప్రభుత్వ పెద్దలు చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయామని, ఇక చేసేది ఏమి లేక, అందరం కలిసి చర్చించుకుని, ప్రభుత్వం పై ఉద్యమ బాట పట్టటానికి రెడీ అయ్యామని, ఉద్యోగ సంఘ నేతలు తేల్చి చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read