జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ఒక రోజు నోట్లో నోట్లో స్వీట్లు తినిపించుకుంటారు, మరో రోజు తిట్టుకుంటారు. దావత్ లు చేసుకుంటారు, మరో పక్క జగన్ చెల్లెలు షర్మిల పార్టీ పెట్టి, కేసీఆర్ ని తిడతారు. గత ఏడాది కాలంగా కేసీఆర్ , జగన్ లకు మాటలు లేవని, ఇద్దరూ తమ తమ రాష్ట్రాల కోసం ఒకరి పై ఒకరు విమర్శలు చెసుకుంటున్నారు అనే వాతావరణం వచ్చింది. అయితే అనూహ్యంగా, ఆంధ్రప్రదేశ్ లో వరదలు ఉన్నా, అవేమీ పట్టించుకోకుండా, హైదరాబాద్ లో పెళ్లికి వెళ్లి, కేసీఆర్ పక్కన కూర్చుని విందులు చేసుకున్నారు. ఇద్దరి మధ్య బాగానే ఉంది అని అందరూ అనుకుంటున్న సందర్భంలో, మూడు రోజులు కూడా గడవక ముందే, జగన్ కు, కేసీఆర్ జర్క్ ఇచ్చారు. మరి ఇది అయినా నిజమో, లేక డ్రామానో తెలియదు కానీ, ఈ నిర్ణయంతో మాత్రం, వేలాది మంది ఏపి రైతులు నష్టపోనున్నారు. నిన్న రాత్రి నుంచి కర్నూల్ నుంచి తెలంగాణా వెళ్తున్న వడ్లు లోడుతో వెళ్తున్న వాహనాలను, తెలంగాణా పోలీసులు, తమ రాష్ట్ర సరిహిద్దులో ఆపేసారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వడ్లు లోడుతో వస్తున్న లారీలను, తెలంగాణాలోకి ఎంటర్ అవ్వకుండా, తెలంగాణా పోలీసులు ఆపేస్తున్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఆపెస్తున్నామని చెప్తున్నారు.

kcr jagan 26112021 2

అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా, అసలు ఎందుకు పోలీసులు ఆపేస్తున్నారో అర్ధం కాక, లారీ డ్రైవర్లు , వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లా అనే కాక, ఇతర కోస్తా ప్రాంతాల నుంచి వస్తున్న లారీలను కూడా, తెలంగాణా పోలీసులు ఆపెస్తున్నట్టు తెలుస్తుంది. పోయిన ఏడాది ఇదే సీజన్ లో, ఏపి నుంచి రైతులు తెలంగాణా వెళ్లి అమ్ముకునే వారు. ఈ సారి తెలంగాణాలో కొనుగోళ్ళు ప్రారంభం కావటంతో, కర్నూల్ జిల్లా నుంచి కొంత మంది రైతులు, వ్యాపారులు, తెలంగాణా వెళ్తూ ఉండగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు దిక్కు తోచక అక్కడే ఉండి పోయే పరిస్థితి వచ్చింది. ఏపి ప్రభుత్వం, తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి, ఈ సమస్య పరిష్కారం చేయాలని, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక పక్క మళ్ళీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ చెప్తున్న నేపధ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఇలాగే క-రో-నా కాలంలో, ఏపి నుంచి వెళ్తున్న అంబులెన్స్ లను ఆపేసిన సంగతి తెలిసిందే. మరి జగన్, కేసీఆర్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారో లేదో చూడాలి.

శాసానసభలో జరిగిన సంఘటన పై , తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మొదటి సారి స్పందించారు. ఈ మేరు ఆమె కొద్ది సేపటి క్రితం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లెటర్ హెడ్ పై, జారీ చేసిన ఈ పత్రికా ప్రకటనలో, శాసనసభలో తన పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారి అందరికీ పేరు పేరునా ఆమె ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తనకు జరిగిన అవమానాన్ని, ఒక తల్లికి, ఒక తోబుట్టువుకు, ఒక కూతురుకు జరిగిన అవమానంగా భావించి తనకు అండగా నిలబడిన వారి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్తూ, కృతజ్ఞతలు తెలిపారు. చిన్న తనం నుంచి తన అమ్మా నాన్న, విలువలతో పెంచారని చెప్పి, నేటికీ వాటిని పాటిస్తున్నాం అని ఈ సందర్భంగా ఆ లేఖలో పేర్కొన్నారు. విలువలతో కూడిన సమాజం కోసం, ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, కష్టాల్లోనూ ఆపదలో ఉన్న వారి అందరికీ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని భువనేశ్వరి ప్రకటనలో పేర్కొన్నారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవాన్ని భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని ఆమె చెబుతూ, తనకు జరిగిన అవమానం వేరే ఎవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.

nara 26112021 1

చాలా క్లుప్తంగా ఇచ్చిన లేఖలో, ఎంతో అర్ధం వచ్చేలా అర్ధవంతంగా రాసారు. శాసనసభలో తనకు అన్యాయం జరిగింది అని కూడా ఆమె అందులో పేర్కొన్నారు. తనకు జరిగిన ఈ అవమానం ఎవరికీ కూడా భవిష్యత్తులో జరగకూడదని పేర్కొన్నటంతో, పాటు, చిన్న తనం నుంచి విలువలతో బ్రతికాం అని, ఇప్పటికే అలాగే ఉన్నామని చెప్పటం, తన అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి పెంచిన విధానం పై ఆ లేఖలో పేర్కొన్నారు. శాసనసభలో జరిగిన అవమానం తరువాత, చంద్రబాబు మీడియా సమావేశంలో, కంటతడి పెట్టారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా నిర్ఘాంతపోయేలా చేసింది. చంద్రబాబుని ఎప్పుడూ ఇలా చూడని వారు చేలించి పోయారు. టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా, అనేక నిరసనలు చేసారు. అనేక మహిళా సంఘాలు కూడా నిరసనలు చేసాయి. అయితే ఈ నేపధ్యంలోనే కొద్ది సేపటి క్రితం ఈ పత్రికా ప్రకటన విడుదల చేసి, నిరసన తెలియచేసి, అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజు నెల్లూరులో పర్యటించారు. గంగపట్నంలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. బాధితుల ఇళ్లలోకి వెళ్లి చంద్రబాబు వారిని కష్టాలు అడిగి తెలుసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు చూసి వరదలకు ఇళ్లు బురదమయం అయ్యాయని మహిళలు విలిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అటుగా వెళ్తూ ఉండగా, అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక రైతు తన బాధ చెప్పుకుంటూ, చంద్రబాబుని ఆపారు. వైసీపీకి ఓట్లేసి మోసపోయామని, ఏమీ పట్టించుకోవట్లేదని ఒక్కసారిగా చంద్రబాబు కాళ్లపై పడ్డారు. దీంతో వెంటనే సెక్యూరిటీ అలెర్ట్ అయ్యింది. చంద్రబాబు ఆ రైతుని దగ్గరకు తీసుకుని, రైతును ఓదార్చి ధైర్యం చెప్పారు చంద్రబాబు. గంగపట్నంలో బాధితులకు చంద్రబాబు ఆర్థికసాయం ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు ప్రకటించారు చంద్రబాబు. గంగపట్నంలో నష్టపోయిన గిరిజనులు, జాలర్లకు పరిహారం ఇచ్చారు. ముంపు నుంచి ఇద్దరిని కాపాడిన సురేశ్‌కు నగదు ప్రోత్సాహం అందించారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రెండు వేలు ఇచ్చి సరిపెట్టుకుంటాం అని చెప్తుంటే, చంద్రబాబు మాత్రం బాధితులకు ఏకంగా 5 వేలు ఇస్తూ ప్రజలను ఆదుకుంటున్నారు.

చాలా రోజుల తరువాత ఈనాడు పత్రిక ఒక సంచలన కధనంతో ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ, అలాగే ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్, సోలార్ విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందాల్లో జురుగుతున్న పెద్ద స్కాం గురించి బయట పెట్టిన సంగతి తెలిసిందే. సెకి సంస్థ మధ్యవర్తిగా ఉంటూ, రాజస్తాన్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ పెట్టి, అక్కడ నుంచి మన రాష్ట్రానికి సోలార్ విద్యుత్ ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నారు. దీనికి యూనిట్ ధర రూ.2.49 పడుతుంది. అయితే సోలార్ యూనిట్ ధరలు వేగంగా పడిపోతున్న ఆ సమయంలో, 25 ఏళ్ళ పాటు అగ్రిమెంట్ చేసుకోవటం, పక్క రాష్ట్రాల్లో రూ.2.49 కంటే తక్కువగా కరెంట్ రావటం, అలాగే మన రాష్ట్రంలో ప్లాంట్ పెట్టకపోవటం, ఇవన్నీ అనుమానాలకు తావు ఇస్తున్నాయి అంటూ, పయ్యావుల కేశవ్ అప్పట్లో పలు అంశాలు లేవనెత్తారు. ఇప్పుడు తాజాగా ఈనాడు మరో ఆసక్తికర విషయంతో, కధనం ప్రచురించింది. తాజాగా గుజరాత్ ప్రభుత్వం, సోలార్ విద్యుత్ ని రూ.1.99కి కొంటూ ఒప్పందం చేసుకుంది అంటూ, ఈనాడు ప్రముఖంగా ప్రచురిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న అదనపు ఖర్చు గురించి ప్రశ్నిస్తుంది. మన ప్రభుత్వం 25 ఏళ్ళ పాటు, 42,500 కోట్ల యూనిట్లను కొనటానికి, యూనిట్ రూ.2.49 కు ధర నిర్ణయిస్తు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం రూ.1.99 కే కొంటుంది. అంటే, ఒక్కో యూనిట్ కు 50 పైసలు మనం అదనంగా పెట్టి కొంటున్నాం. పక్క రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో మన ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు ?

eenadu 26112021 2

ఇక్కడ మనం చూసుకుంటే, 25 ఏళ్ళ పాటు 42,500 కోట్ల యూనిట్లను మన ప్రభుత్వం కొననుంది. ఇప్పుడు 50 పైసలు అదనంగా పెట్టి మనం కొంటున్నాం. అంటే, రూ.21,250 కోట్లు అధిక బారం రాష్ట్రం పై పడనుంది. 25 ఏళ్ళలో మొత్తం రూ.1,05,825 కోట్లు వెచ్చించనున్నారు. రూ.21,250 కోట్లు అదనపు భారం పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది ? ఎందుకు ఆలోచించ లేదు ? ఇంత పెద్ద మొత్తం చేసుకునేప్పుడు, మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి కదా ? కేవలం ఆరు నెలల వ్యవధిలోనే, యూనిట్ ధర భారీగా పడిపోయిన చరిత్ర ముందు ఉంది. అది చూసి కూడా, రాష్ట్ర ప్రభుత్వం అంత ఎక్కువ ధరకు ఎలా కొంటుంది ? ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఇక్కడకు రావాలి అంటే, మళ్ళీ దానికి అదనంగా రూపాయి పైన పడుతుంది. ఈ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరించాలి ? ఇన్నాళ్ళు టిడిపి వేసిన ప్రశ్నలు రాజకీయం అనుకున్నా, ఇప్పుడు ఈనాడులో వచ్చిన కధనం చూస్తే, దీని వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్టే అర్ధం అవుతుంది. మరి ప్రభుత్వం, ఈ కధనం పై ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read