ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులను, రెండిటినీ కూడా ఉపసంహరించుకుంటూ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులను, రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ రూపంలో దాఖలు చేసారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్ర హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగుతున్న సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరాం శుభ్రమణ్యం, ఈ రెండు బిల్లులను కూడా ఉపసంహరించుకుంటున్నామాని, మరి కొద్ది సేపట్లో ఈ విషయం పై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేస్తారని, త్వరలోనే దీనికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు మేరకు, శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేయాలని, తదుపరి విచారణ సోమవారం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ నేపధ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తరుపున, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి దీనికి సంబంధించి మెమో ఫైల్ చేసారు. ఈ రెండు చట్టాలను కూడా ఉపసంహరించుకుంటు, రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసామని చెప్పారు. బిల్లు రూపంలో ఈ నెల 22 తేదీన చర్చ తరువాత అసెంబ్లీలో అమోదించామని తెలిపారు. తరువాత 23వ తేదీన శాసనమండలిలో కూడా చర్చించి ఆమోదించారని, ఈ రెండు కూడా బిల్లు రూపంలో తీసుకొచ్చారని కూడా, ఆమె మెమోలో తెలిపారు.

hc 26112021 2

శాసనసభ కార్యదర్శి తమకు ఇచ్చిన సమాచారం మేరకు, ఈ రెండిటిని కూడా రాష్ట్ర హైకోర్టులో ఫైల్ చేస్తున్నామని వివరించారు. ఈ అఫిడవిట్ తో పాటుగా, ఆ రెండు చట్టాలు రద్దు చేస్తున్నట్టు ఆమోదించిన బిల్లులను కూడా ఈ అఫిడవిట్ తో జత పరిచారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మేరకే, వీటికి కోర్టులో దాఖలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం హైకోర్టులో ఈ మెమోతో పాటుగా, బిల్లులు వీటి అన్నిటిని కూడా పిటీషనర్ లు కూడా, ప్రభుత్వం ఇచ్చింది. ఎవరు అయితే సీఆర్డీఏ చట్టం, వికేంద్రీకరణ చట్టానికి వ్యతిరేకంగా హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారో, రైతులు తరుపున, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తరుపున న్యాయవాదులకు కూడా ఇవన్నీ అంద చేసారు. దీని పైన సోమవారం విచారణ జరగనుంది. అయితే ఇందులో కీలక అంశం ఉంది. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మూడు రాజధానులు ఉండేది ఉండేదే అని, బిల్లులో కొన్ని అంశాలు మార్చి, మెరుగైన బిల్లుతో వస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ అంశం పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

రాజ్యంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విగ్యన్ భవన్ లో, రాజ్యాంగ దినోత్సవ వేడుకులు జరిగాయి. ఈ వేడుకుల్లో, ప్రధాని నరేంద్ర మోడి, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా ఎన్వీ రమణ పాల్గున్నారు. సుప్రీం కోర్టు జస్టిస్ లలిత్ ప్రారంభ ఉపన్యాసం చేసారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు గురించి వివరించారు. తరువాత కొంత మంది ప్రముఖులు ప్రసంగించిన తరువాత, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, ఎన్వీ రమణ ప్రసంగించారు. రాజ్యాంగ సృష్టికర్తలకు తల వంచి నమస్కరిస్తూ ఉపన్యాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చెప్పిన ఒక విషయాన్ని గుర్తు చేసారు, మన రాజ్యాంగం ఎంత గొప్పది అయినా, దాన్ని ఆచరణలో పెట్టే వారు చెడ్డ వారు అయితే, రాజ్యాంగం కూడా చెడుగా కనిపిస్తుందని అన్నారు. రాజ్యాంగం ఎంత చెడ్డది అయినా, దాన్ని అమలు చేసే వారు మంచి వారు అయితే, రాజ్యాంగం కూడా మంచిగా కనిపిస్తుంది అంటూ, అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. న్యాయం అనేది, కేవలం జ్యుడీషియరీ నుంచే రావాలని కోరుకోవటం కరెక్ట్ కాదని, మిగత లెజిస్లేచర్, ఎక్జిక్యూటివ్ లకు కూడా అంతే బాధ్యత ఉంటుందని అన్నారు. లెజిస్లేచర్, ఎక్జిక్యూటివ్ నుంచి డీవియేషన్లు ఉంటే, అది న్యాయవ్యవస్థకు ఇబ్బంది అవుతందని అన్నారు.

nvramana 26112021 2

రాజ్యాంగం కల్పించిన హక్కులు విషయంలో, పౌరులకు అనేక విషయాలు తెలియాలని, దీనికి ఒక పెద్ద క్యాంపెయిన్ నడపాల్సిన అవసరం ఉందని అన్నారు. అనేక కేసులు లోవర్ కోర్టుల్లో పెండింగ్ ఉంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ మధ్య కాలంలో జడ్జిల విషయంలో, ఫిజికల్ అ-టా-క్స్ తో పాటుగా, సోషల్ మీడియాలో కూడా అనేక రకాలుగా దాడి చే-స్తు-న్నా-ర-ని, ఇవి ప్రేరేపిత దా-డు-లు అని, ఇలాంటి వాటి పై పోలీస్ శాఖ దృష్టి పెట్టల్సిన అవసరం ఉంది అంటూ, ప్రధాని మోడి సమక్షంలోనే వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా సోషల్ మీడియా విషయంలో, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఈ కేసు సిబిఐ విచారణ చేస్తూ, హైకోర్టులో కూడా నడుస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉన్న సంగతి తెలిసిందే. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇప్పటికే సిబిఐ తెలిపింది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంసం అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, కాగ్ తన నివేదికను ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ ముందు ప్రవేశ పెట్టింది. ఈ నివేదికలో జగన్ ప్రభుత్వం చేసిన డొల్ల తనం మొత్తం బట్టబయలు అయ్యింది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, వనరుల నిర్వహణ పై, కాగ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అంటూ, కాగ్ కొన్ని అంశాలను ఈ నివేదికలో పొందు పరిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అనుబంధ పద్దులు వ్యయం చేసిన తరువాత, జూన్ 2020లో శాసనసభలో ప్రవేశ పెట్టారని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని కాగ్ తన నివేదికలో పేర్కొనటం జరిగింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహారాలు చోటు చేసుకున్నాయని, దీనికి సంబంధించి అసెంబ్లీ ప్రక్రియను బలహీన పరిచే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, కాగ్ తన నివేదికలో పొందు పరిచింది. అలాగే, ప్రజా వానరలు వినియోగం విషయంలో ఆర్ధిక క్రమశిక్షణ తప్పారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది అంటూ, కాగ్ ఆ నివేదికలో స్పష్టం చేసింది. దీంతో పాటుగా, శాసనసభ ఆమోదించిన కేటాయింపులు కంటే అదనంగా ఖర్చులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని కాగ్ తెలిపింది.

cag 26112021 1

అదనంగా అనేక ఖర్చులు చేసారని, తన నివేదికలో పొందు పరచటం జరిగింది. అలాగే, 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3.17 శాతం రెవెన్యూ రాబడులు తగ్గాయిని కాగ్ తెలిపింది. అంటే రాబడి చంద్రబాబు హాయాంలో కంటే తగ్గింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇంకా అప్పటికి క-రో-నా లేదు. అలాగే ఇదే సందర్భంలో ఖర్చులు మాత్రం 6.93 శాతం పెరిగాయి అంటూ కాగ్ ఆక్షేపించింది. అంటే రాబడి తగ్గింది, ఖర్చులు మాత్రం పెరిగిపోయాయి. ఇక మరో విషయం బకాయాల వివరాలు కూడా బడ్జెట్ పాత్రల్లో సరిగ్గా చూపించ లేదని, శాసనసభ వ్యవస్థను నీరుగార్చే విధంగా ఈ వ్యవహారం ఉందని కాగ్ తెలిపింది. గతంలో ఇదే అంశం పై తెలుగుదేశం కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక మరో పక్క 2018-19 నాటితో పోల్చితే 2019-20నాటికి రూ.32,373 కోట్ల మేర పెరిగిన బకాయిల చెల్లింపులు పెరిగాయని కాగ్ చెప్పింది. ఒక్క ఏడాదిలో ఇంత పెరిగాయి అంటే, మన అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 2019-20కే ఇన్ని బొక్కలు ఉన్నాయి అంటే, 2020-21లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో కడప జిల్లా జమ్మలమడుగు నేతలు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేశ్ రెడ్డి చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. "మీ అందరికీ ఒక అనుమానం ఉంది. ఎవరో పాత వాళ్ళు ఇప్పుడు పోయి, గెలుస్తాం అనే వాసన రాగానే వచ్చేస్తారు. ఎన్నికల ముందు వచ్చేసి, అందరి కంటే ముందు నాకు కనపడతారు. మీ అందరికీ ఒకటే చెప్తున్న, గుర్తు పెట్టుకోండి. కష్టాల్లో ఉండే వాళ్ళే నాకు శాస్వతం. ఈ రోజు కష్ట కాలంలో ఎవరు అయితే పోరాడుతున్నారో, వారికి కూడా గుర్తింపు ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా తీసుకోను అని మీకు హామీ ఇస్తున్నా. ఇంతకు మునుపు చాలా సార్లు ప్రయత్నం చేసినా, రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఈ సారి రికార్డు కూడా పక్కగా ఎస్టాబ్లిష్ చేస్తున్నా. మీరు అడగక పోయినా, ఎవరు అయితే కష్టపడి పని చేసారో, వారిని నేరుగా గుర్తించి వారికి అండగా ఉంటా. అలాంటి మెకానిజం మన దగ్గర ఇప్పుడు ఉంది. మీకు ఎవరికీ అనుమానాలు వద్దు. కష్టపడిన వారికే, భవిష్యత్తులో మన పార్టీలో మంచి జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా మీ అందరికీ ఈ విషయంలో హామీ ఇస్తున్నా. "అని చంద్రబాబు తేల్చి చెప్పారు.

cbn 26112021 2

ఇక కడప విషయాలు మాట్లాడుతూ, "కడప జిల్లాలో అతి విశ్వాసంతో అందరూ ఓట్లేశారు. ఇసుక మాఫియా కోసం గ్రామాలను ముంచేశారు. ఒకే ఊళ్లో 13 మంది చనిపోయారు.. 40 మంది గల్లంతయ్యారు. ముఖ్యమంత్రి చేతగాని తనం కాక ఇంకేంటి..? - తిరుపతిలోనూ శాండ్ మాఫియా ఆగడాలు. పరామర్శలకు వెళ్లలేదు గానీ.. ఫంక్షన్లకు మాత్రం వెళ్తున్నారు. తాను వెళ్తే అధికారులంతా వచ్చేస్తారని, ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం సాకులు చెప్తున్నారు. ప్రకృతితో ఆడుకుంటే మనకు ఇబ్బందులు తప్పవు. కరకట్టలన్నీ లీకైపోయాయి.. ఆ నీరంతా పొలాల్లోకి వచ్చింది. ఒక్కరిని కూడా కాపాడలేదు.. ఏ ఒక్కరికీ భోజనం పెట్టలేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం చారిత్రక అవసరం. రాష్ట్రంలో వ్యవసాయం మొత్తం సర్వనాశనమైంది. రాష్ట్రంలో రోడ్లు వేస్తే, ప్రాజెక్టులు కడితే పరిశ్రమలు వస్తాయి. రూ.2 లక్షల కోట్లు ఆదాయం వచ్చేలా 55 వేల ఎకరాలు అమరావతికి వచ్చాయి. అభివృద్ధిని చూసిన తర్వాత కూడా రూ. లక్ష కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ప్రజలు ఏమనుకుంటారో అని లేకుండా ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేస్తున్నారు.కలెక్టరేట్ ను తాకట్టు పెట్టే పెద్దమనిషిని ఎక్కడా చూడలేదు. ఈ ముఖ్యమంత్రికి అనుభవం లేదు.. అహంభావం ఉంది." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read