ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. నేరస్థులను రక్షించే ఉద్దేశం మీకు ఉందా అంటూ, హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. తమకు మీతో ఎలా వ్యవహరించాలో తెలుసు అంటూ, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో, రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం పైన సీరియస్ అయ్యింది. డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో మత్తు డాక్టర్ గా పని చేసేవారు. క-రో-నా సమయంలో మాస్కు ఇవ్వటం లేదని,మీడియాతో చెప్పినందుకు, ఆయన్ను సస్పెండ్ చేసారు. తరువాత ఇది పెదా విషయం అవ్వటంతో, ఆయన్ను వేధించటం మొదలు పెట్టారు. తరువాత కొన్ని రోజులకు ఆయనను విశాఖ వీధుల్లో కొడుతూ ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కేసు విషయంలో వీడియో క్లిపింగ్స్ జత చేస్తూ, టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత హైకోర్ట్ కు ఉత్తరం రాయటంతో, ఆధారాలు పరిశీలించిన కోర్టు, సుమోటో గా కేసు నమోదు చేసి, సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసు విచారణ జరుగుతూ ఉండగానే, డాక్టర్ సుధాకర్ మరణించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే, డాక్టర్ సుధాకర్ కేసు కేసు, నిన్న హైకోర్టు ముందుకు మళ్ళీ విచారణకు వచ్చింది. సిబిఐ న్యాయవాదులు కోర్టు ముందుకు హాజరు అయ్యారు.

sudhakar 25112021 2

వాళ్ళు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసినట్టు కోర్టుకే తెలిపారు. అయితే ఎ సందర్భంగా సిబిఐ కోరిన పోలీస్ ఆఫీసర్లను ప్రాసిక్యూట్ చేయటానికి ప్రభుత్వం అనుమతి ఇస్తే, మరింత ముందుకు వెళ్తాం అని కోర్టుకు చెప్పారు. దీంతో కోర్ట్ సీరియస్ అయ్యింది. సిబిఐ కోరిన విధంగా ఎందుకు పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వలేదని ప్రశ్నించింది. నేరస్థులను రక్షించేందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాగే కొనసాగితే, తమకు ఎలా వ్యవహరించాలో కూడా తెలుసు అంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది. అయితే పోలీస్ అధికారుల తరుపున న్యాయవాది స్పందిస్తూ, సిబిఐ కోరుతున్న పోలీస్ వారిని విచారణ చేయటానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని చెప్పారు. దీనికి స్పందించిన కోర్టు, ఆ విషయం మెమో రూపంలో దాఖలు చేయాలని, ఈ కేసు విచారణను వారం రోజులుకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ రోజు మూడో రోజు ఆయన, నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. గత రెండు రోజులుగా ఆయన చూసిన ప్రజల బాధలు, ప్రభుత్వ వైఫల్యం గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరదల వల్ల ప్రజలు ఎదురుకున్న ఇబ్బందులు, ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు గురించి చంద్రబాబు వివరించారు. ఇదే సందర్భంలో, చంద్రబాబు మాట్లాడిన తరువాత, కొంత మంది విలేఖరులు చంద్రబాబున ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఒక విలేఖరి, ఈ మధ్య ముద్రగడ రాసిన లేఖ గురించి చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ముద్రగడ రాసిన లేఖను మీరు చూసే ఉంటారు, మిమ్మల్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల పై, మీ స్పందింన ఏమిటి అంటూ, ఆ విలేఖరి చంద్రబాబుని ప్రశ్నించారు. దీని పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ప్రశ్నకు ఇది సందర్భామా అని ప్రశ్నించారు. ఆ విలేఖరి మళ్ళీ మళ్ళీ రెట్టించి అడగగా, కాపులకు రిజర్వేషన్ లు ఇచ్చింది మేము, విదేశీ విద్య ఇచ్చింది మేము, మాకు లేఖలు రాస్తాడు కానీ, ఇవి ఎత్తేసిన వారికి మాత్రం లేఖలు రాయడు అంటూ సమాధానం చెప్పారు.

mudrgada 25112021 2

చంద్రబాబు మాట్లాడింది యధావిధగా "రిజర్వేషన్ పెట్టిన వాడి పైన లేఖలు రాస్తాడు. విదేశీ విద్య పెట్టిన వాడి పైన లేఖలు రాస్తాడు. అదే రిజర్వేషన్ లు ఎత్తేసిన వాడి పైన లేఖలు రాయడు. విదేశీ విద్య ఎత్తేసిన వాడి పైన లేఖలు రాయడు. మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రశ్నలకు, ఇలాంటి వాళ్ళ చేష్టలకు నేను డైవర్ట్ కాను. నేను ఇక్కడకు వచ్చింది వరదలు కోసం వచ్చాను. వరదల్లో రాని వారిని మీరు అడగాలి. అలాంటి వారిని మీరు ప్రశ్నించండి. ఇలాంటి వాటి పైన కాదు." అంటూ చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో వైసీపీ నాయకులు తిట్టటంతో, చంద్రబాబు బాధపడిన విషయం తెలిసిందే. చంద్రబాబుని మరింతగా రెచ్చగొట్టటానికి, వైసీపీ పైడ్ ఆర్టిస్ట్ లు అందరూ రంగంలోకి దిగారు. అందులో ముద్రగడ క్యారక్టర్ కూడా ఎంటర్ అయ్యి, చంద్రబాబుని ప్రశ్నిస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు జగన్ బాధలో ఉన్నా బయటకు వచ్చే ముద్రగడ, కాపులకు జరుగుతున్న అన్యాయం విషయంలో మాత్రం నోరు ఎట్టకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తులు, అదే విధంగా హైకోర్టుని సోషల్ మీడియాలో దూషిస్తూ, కించపరిచిన కేసుకు సంబంధించి, సిబిఐ చేస్తున్న దర్యాప్తు కీలక దశకు చేరుకుంటుంది. ఈ రోజు సిబిఐ, ఈ కేసుకు సంబంధించి, ఒక అఫిడవిట్ ను రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ ని పిటీషనర్ కు కూడా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అఫిడవిట్ లో కీలక సమాచారం ఉందని తెలుస్తుంది. మొత్తం వివరాలతో 26 పేజీల అఫిడవిట్ ని సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ దాఖలు చేసారు. ఇటీవల కాలంలో పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేయాలని చెప్పి, హైకోర్టు ఆదేశించిన సందర్భంలో, సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ, కేంద్ర హోం మంత్రి శాఖ ద్వారా విదేశాల్లో ఉంటున్న పంచ్ ప్రభాకర్, అలాగే మరి కొంత మంది పై లుక్ అవుట్ సర్క్యులర్ లు జారీ చేసామని అందులో పేర్కొన్నారు. ఈ లుక్ అవుట్ సర్క్యులర్ల ఆధారంగా ఇంటర్ పోల్ బ్లూ నోటీసులు జారీ చేయటం, ఆ బ్లూ నోటీసులు ఆధారంగా అతని అడ్డ్రెస్ లు తీసుకుని, ఫెడరల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే ఎఫ్బిఐ , ఇండియాలో ఉన్న సిబిఐ, పంచ్ ప్రభాకర్ అడ్డ్రెస్ తమకు పంపించిందని, సిబిఐ కోర్టుకు తెలిపింది. ఎఫ్బిఐ ఇచ్చిన వివరాలను కూడా సిబిఐ అఫిడవిట్ లో పెట్టి, హైకోర్టుకు సమర్పించింది. ఇది కీలక పరిణామం అనే చెప్పాలి.

punch 25112021 21

ఎఫ్బిఐ ఇచ్చిన సమాచారం మేరకు, స్థానికంగా ఉండే కోర్టులో అరెస్ట్ వారెంట్ తీసుకుని, ఆ అరెస్ట్ వారెంట్ ఆధారంగా అతనికి సంబంధించి, ఇంటర్ పోల్ కి మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పంపించామని, అరెస్ట్ చేయాలని ఇంటర్ పోల్ కి రిక్వెస్ట్ పెట్టినట్టు కోర్టుకు తెలిపింది సిబిఐ. ఇక దీంతో పాటుగా, ఈ మొత్తం కేసులో, మొత్తం 16 మందిన నిందితులుగా పేర్కొనగా, ఇప్పుడు పంచ్ ప్రభాకర్ ని 17వ వ్యక్తిగా చార్జ్ షీట్ లో, సిబిఐ పెట్టింది. ఇక ఈ కేసుకు సంబంధించి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ని కూడా విచారణ చేసినట్టు సిబిఐ తెలిపింది. సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నాం అని, దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు ఇస్తామని పేర్కొంది. అలాగే వైసీపీ సోషల్ మీడియా సెల్ కి సంబంధించి కీలక వ్యక్తులను కూడా విచారణ చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. అయితే మళ్ళీ సోషల్ మీడియాలో పంచ్ ప్రభాకర్ మళ్ళీ వీడియోలు పెట్టటం పై, యూట్యూబ్ కు తీసేయమని కోరినట్టు తెలిపారు.

జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు ఉన్నా సరే, ఇక్కడ క్షేత్ర స్థాయిలో పర్యటన చేయకుండా, ఆయన పెళ్లిళ్లకు, భోజనాలకు వెళ్ళటం పై, సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణా వెళ్లి మరీ, విందుల్లో పాల్గునటం, ఇక్కడ ప్రజలను గాలి వదిలేయటం పై, విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయట పడింది. మొన్న ఆదివారం జగన్ మోహన్ రెడ్డి, హైదరాబాద్ పెళ్లికి వెళ్లారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన పెళ్లికి, జగన్, కేసీఆర్ కూడా హాజరు అయ్యి, పక్క పక్కనే కూర్చున్న విషయం తెలిసిందే. జగన్ పక్కనే, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కూర్చున్న ఫోటోలు, తరువాత అందరూ కలిసి భోజనం చేసిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి క-రో-నా సోకినట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఆయన ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. అయితే తనకు కాంటాక్ట్ లో వచ్చిన వారి అందరినీ టెస్ట్ చేయించుకోమని ఆయన కోరారు. మూడు రోజుల క్రితమే జగన్, కేసీఆర్ ఆయన పక్కన కూర్చుని ఉండటంతో, ఇప్పుడు వీరు కూడా టెస్ట్ లు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఎవరికీ మాస్కులు లేకపోవటం కూడా ఇక్కడ గమనించాలి. గత వరం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా క-రో-నా బారిన పడిన సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read