151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబు భజన తప్ప వేరేది ఉండదు. అంత మందికీ చంద్రబాబే టార్గెట్. చంద్రబాబు రాజకీయంగా కుంగిపోడు. ఎందుకు అంటే ఆయనకు గెలుపు అయినా ఒక్కటే, ఓటమి అయినా ఒక్కటే. రాజకీయ విమర్శలు అసలు పట్టించుకోరు. రాజకీయంగా పెట్టే ఇబ్బందులు, ఎదురుండి పోరాడతారు. ఈ రెండున్నరేళ్ళలో జరిగింది అదే. చంద్రబాబు ఎదురొడ్డి పోరాటం చేసారు. ధీటుగా నిలబడ్డారు, కలబడ్డారు. చివరకు తన సొంత ఊరిలో, కుప్పంలో, టార్గెట్ పెట్టి మరీ, దొంగ ఓట్లు వేసి మరీ, గుద్దుకుని గెలిచినా, హేళన చేసినా, ఆయన తొణకలేదు. అందుకే వైసీపీ రెండో రోజే వ్యూహం మార్చింది. చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టలేం అని అర్ధం అయ్యింది. అందుకే మానసికంగా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసారు. చంద్రబాబుని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్లాన్, కొంత మంది చేతిలోనే పెట్టారు. ఆ కొంత మందిలో చాలా కమాన్ పాయింట్ లు ఉన్నాయి. ఆ కొంత మందిలో అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, కొడాలి నాని అన్నారు. వీరి నలుగురిలో ఒకే కామన్ పాయింట్ ఉంది. అందుకే వైసీపీ పెద్దలు వీరిని సెలెక్ట్ చేసుకున్నారు. జుబుక్సాకరంగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసారు. సైకోలులాగా ఆయన మీద పడి, మానసిక హిం-సకు దిగారు.
వీరి నలుగిరిలో, కొడాలి నానికి మంత్రి పదవి ఉంది. త్వరలో మంత్రి పదవి ఊడిపోతుందనే ప్రచారం జరుగుతుంది. మిగతా ముగ్గురూ మంత్రి పదవుల కోసం, పెర్ఫోరమన్స్ ఇరగ దీస్తుంటే, కొడాలి నాని మాత్రం, మంత్రి పదవి ఊడిపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. తమ అధినేతను సొంతోష పెట్టటమే వీరి టార్గెట్. అందుకే అధినేతిని మంచి చేసుకుని, తమకు మంత్రి పదవులు ఇస్తాడు అనే ఆశతో రెచ్చిపోతున్నారు. ఇక మరో కామన్ పాయింట్. అందరికీ కూతుళ్ళు ఉన్నారు. రోజా ఏకంగా ఆమె మహిళ. అయినా సరే, జుబుక్సాకరంగా పుట్టుకుల గురించి, రాజకీయాలతో సంబంధం లేని మహిళలను లాగారు. ఆమె క్యారెక్టర్ దెబ్బ తినేలా బజారులో పెట్టారు. పవిత్రమైన అసెంబ్లీలో పాకీ మాటలు మాట్లాడారు. ఇంకేముంది, ఆ పెద్దాయన చలించిపోయాడు. క్లమైర్ మైన్స్ పేల్చినా చలించని గుండె, భార్యని అంటే తట్టుకోలేక పోయింది. అంత పెద్ద మనిషి, బోరున విలపించటంతో, మానవత్వం ఉన్న అందరూ రాజకీయాలకు అతీతంగా ఆయనకు సంఘీభావం తెలిపారు. మృగాలు మాత్రం, ఎప్పటి లాగే, ఆయన పై వేసుకుని పడ్డారు. ఇంత పెఫోర్మన్సు ఇచ్చిన వారికి, పాపం మంత్రి పదవులు వరిస్తాయో లేదో.