కొండపల్లి మునిసిపాలిటీ చైర్మెన్ ఎన్నిక, రెండో రోజు కూడా ఒక హైటెన్షన్ వాతావరణం మధ్య కొనసాగుతుంది. నిన్న జరగాల్సిన ఎన్నిక వైసీపీ చేసిన విధ్వంసంతో, ఈ రోజుకి ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు కొద్ది సేపటి క్రితం, ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయినా, నిన్న ఏ విధంగా అయితే వైసీపీ నాయకులు వ్యవహరించారో, ఈ రోజు కూడా అలాగే వ్యవహరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, వైసీపీ నేతలు అరాచకం చేస్తున్నారు. అయితే లోపల రెండో రోజు కూడా బల్లలు విసిరిగోట్టినట్టు తెలుస్తుంది. ఇక బయట నుంచి కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమికూడి ఉన్నాయి. వారి వాహనాల్లో కర్రలు కూడా ఉన్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. తమ పైన ఎలాగైనా దా-డి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టిడిపి ఆరోపిస్తుంది. మరో పక్క, కొండపల్లి, ఇబ్రహింపట్నంలో, కొడాలి నాని, నందిగం సురేష్, జోగిరమేశ్ మకాం వేసినట్టు కూడా టిడిపి నేతలు వీడియోలు విడుదల చేసారు. అయితే ఈ రోజు కూడా ఎన్నిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఈ పిటీషన్ పై కోర్టు మరి కాసేపట్లో విచారణ చేయనుంది.
news
మరో అనూహ్య నిర్ణయం, యూ-టర్న్ తీసుకున్న జగన్... ఈ రోజు అసెంబ్లీలో బిల్లు...
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో యూ-టర్న్ కు సిద్ధం అయ్యింది. నిన్న రాజధానికి సంబంధించిన మూడు రాజధానుల బిల్లును, నిన్న ఉపసంహరించుకున్న ప్రభుత్వం, ఈ రోజు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. శాసనమండలిని రద్దు చేయాలని గతంలో, ఏపి ప్రభుత్వం కేంద్రానికి పంపిన తీర్మానాన్ని, మరో తీర్మానం ద్వారా ఈ రోజు ఉపసంహరించుకునేందుకు సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించి గతంలో, 2020 జనవరి 27వ తేదీన, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కూడా తీర్మానం చేస్తూ, శాసనమండలిని వెంటనే రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న శాసనమండలి, ఈ రాష్ట్రానికి అవసరం లేదు అని చెప్పి, కెంద్ర ప్రభుత్వానికి చెప్పి, శాసనసభ తీర్మానం చేసింది. క్యాబినెట్ చేసిన తీర్మానం, శాసనసభ తీర్మానం మేరకు, ఈ బిల్లుని కేంద్రానికి పంపింది. అయితే అప్పట్లో మూడు రాజధానుల బిల్లును , శాసనమండలి వ్యతిరేకించటంతో పాటుగా, సెలెక్ట్ కమిటీకి కూడా పంపాలని కూడా తీర్మానం చేసింది. అయితే ఈ తీర్మానం నేపధ్యంలో, తమకే ఎదురు చెప్తారా అనే ఉద్దేశంతో, శాసనమండలినే రద్దు చేసి పడేసింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి శాసనమండలిలో బలం ఉండటంతో, వీళ్ళు మన మాట వినరు అనే ఉద్దేశంతో, జగన్ మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేసారు.
అయితే అప్పట్లో జగన్ కి ఎంత మంది చెప్పినా వినలేదు. మళ్ళీ ఆరు నెలల్లో మనకే మెజారిటీ వస్తుందని చెప్పినా, జగన్ మోహన్ రెడ్డి వినలేదు. తన మాటకు ఎదురు చెప్పిన మండలి ఉండటానికి వీలు లేదని తీర్మానించారు. అంతే కాదు, అసలు శాసనమండలి వెస్ట్ అని, ఒక్క రూపాయి కూడా దీని పైన ఖర్చు అనవసరం అని అన్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి బలం వచ్చింది. దీంతో జగన్ మడమ, మాట తిప్పేసి, యూ-టర్న్ తీసుకుని, అప్పట్లో ఇచ్చిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు అసెంబ్లీలో మరో బిల్లు పెట్టి, ఆ బిల్లుని కేంద్రానికి పంపనున్నారు. ఈ నెల 29 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పూర్తి మెజారిటీ వస్తుందని భావించి, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న శాసనమండలి రద్దు బిల్లు కనుక కేంద్ర ఆమోదిస్తే, పూర్తిగా బకరాలు అవుతాం అని ఆశించిన జగన్ మోహన్ రెడ్డి, ఈ బిల్లు పైన కూడా మాట తప్పి, మడమ తిప్పేసి, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చీకటి పడిన తరువాత హైడ్రామా.. పక్కా సమాచారం ఉండటంతో, వ్యూహం మార్చిన కేశినేని నాని...
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉదయం నుంచి అనేక మలుపులు తిరుగుతూ, చివరకు ఏమి జరగకుండానే వాయిదా పడింది. ఇప్పటికే కొండపల్లిలో టిడిపికి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే ఎలాగైనా కొంత మంది టిడిపి నేతలను తమ వైపు తిప్పుకుని, గెలిచేయలని వైసీపీ ప్లాన్. ఈ రోజు ఉదయం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే, కౌన్సిల్ హాల్‌లో వైసీపీ కౌన్సిలర్లు వీరంగం చేసారు. ఎన్నిక జరగకుండా ప్లాన్ వేసారు. దీంతో అక్కడ ఉన్న ఎన్నికల అధికారి ఎన్నికను వాయిదా వేసారు. ఒక పక్క కోర్టు ఈ రోజే ఎన్నిక జరపాలని ఆదేశాలు ఇచ్చినా వాయిదా వేసారు. దీంతో టిడిపి ఆందోళనకు దిగింది. ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నారో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరింది. అప్పటి వరకు కౌన్సిల్ హాల్ నుంచి కదలం అంటూ కూర్చున్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేస్తాం అంటూ వచ్చారు. దీంతో టిడిపి వ్యూహం మార్చుకుంది. అరెస్ట్ పేరుతో, వారిని వైసీపీ శిబిరానికి తరలించే ప్లాన్ వేసారని తెలిసి, టిడిపి కౌన్సిలర్లను మళ్ళీ క్యాంప్ కు తీసుకుని వెల్లూర్. దేవినేని ఉమా నివాసంలోనే వీరికి క్యాంప్ ఏర్పాటు చేసారు. వారితో పాటు కేశినేని నాని కూడా అక్కడే ఉన్నారు. కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ, మొత్తం వీడియో ఫూటేజ్ కోర్టు కు ఇస్తాం అని, రేపటి వాయిదా వేసారో, లేక ఎప్పటికి వాయిదా వేసారో కూడా చెప్పలేదని అన్నారు.మొత్తానికి ఎన్నిక ఉత్కంఠ ఇంకా విడలేదు. ఎన్ని ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయో చూడాలి.
చంద్రబాబు ప్రకటనతో టిడిపి శ్రేణులు హ్యాపీ... చంద్రబాబు బ్యాక్ టు వర్క్..
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రోజు నుంచి ప్రజల బాట పట్టనున్నారు. గత వారం ఆయన సతీమణి పై హేయమైన భాషతో, అసెంబ్లీలో వైసీపీ చేసిన రచ్చకి చంద్రబాబు బాధపడిన విషయం తెలిసిందే. చంద్రబాబుని అలా చూసిన అనేక మంది చలించిపోయారు. భువనేశ్వరి పై చేసిన వ్యాఖ్యలతో, వైసీపీ ఎలాంటి పార్టీ అనేది మరోసారి రుజువు అయ్యింది. అయితే చంద్రబాబు అలా బాధ పడటం చూసి, ఆయన మళ్ళీ మామూలు రాజకీయాలు చేయటానికి సమయం పడుతుందని అందరూ భావించారు. అయితే అనుకోని పరిస్థితిలో వరదలు రావటంతో, నాలుగు జిల్లాల ప్రజలు అల్లడిపోతున్నారు. అటు పక్క ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీంతో ప్రాధాన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు రంగంలోకి దిగారు. పార్టీ ముఖ్య నాయకులతో టెలి-కాన్ఫరెన్స్ తీసుకున్నారు. అసెంబ్లీలో మనకు జరిగిన అవమానం పై మనకు బాధ ఉందని, అయినా దాన్ని పక్కన పెట్టి, ప్రజల కోసం మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిలాల్లో, తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్న చంద్రబాబు, తాను నేరుగా రంగంలోకి దిగితే కానీ, ప్రభుత్వంలో చలనం రాదనీ, వరద ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తానని చెప్పారు.
ఈ రోజు నుంచి చంద్రబాబు పర్యటన ఉండనుంది. చంద్రబాబు ప్రకటనతో, టిడిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తమ అధినేతను ఎప్పుడూ లేనిది, బాధ పడుతూ చూసిన టిడిపి శ్రేణులు, ఆయనే ప్రకటిస్తూ, మన బాధ పక్కన పెట్టాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పటంతో, సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే టిడిపి శ్రేణులతో పాటు, ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా రంగంలోకి దిగింది. వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, అనేక సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా రంగంలోకి దిగటంతో, ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా, ప్రజలను అప్రమత్తం చేయటం, డ్యాంల దగ్గర, కట్తల దగ్గర సరైన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోలేదని టిడిపి విమర్శిస్తుంది. ఇంత భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం, మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదని, అయినా జగన్ మోహన్ రెడ్డి గాల్లో తిరిగుతూ, చేతులు దులుపెసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు పర్యటన రెండు రోజుల పాటు, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో కొనసాగనుంది.