ఆయనది 42 ఏళ్ళ రాజకీయ అనుభవం. ఎనిమిది సార్లు ఎమ్మెల్యే, మూడు సార్లు ముఖ్యమంత్రి, మూడు సార్లు ప్రతిపక్ష నాయుకుడు, రాష్ట్రపతినే నియమించిన చరిత్ర ఉండి, ఇద్దరు ప్రధానమంత్రులను నియమించిన చరిత్ర ఆయనది, రెండు కేంద్ర ప్రభుత్వాలను ఆదుకున్న చరిత్ర ఆయనది. అలాంటి వ్యక్తి మీద బాంబులు వేసినా, బూతులు తిట్టినా, హేళన చేసినా, మానసికంగా ఇబ్బందులు పెట్టినా, ఆయన ఎప్పుడూ లెక్క చేయలేదు. చివరకు తన సహచరులు మరణం చెందిన సమయంలో కూడా, ఎమోషన్ కంట్రోల్ చేసుకునే వారు. ఎప్పుడైనా ఎమోషన్ అయినా వెంటనే తేరుకునే వారు. అలాంటి చంద్రబాబు నేడు వెక్కి వెక్కి ఏడ్చారు. ఆయన్ను అన్నందుకు కాదు, రాజకీయంగా తిట్టినందుకు కూడా కాదు. తన సహాధర్మచారిని బజారులో పడేసినందుకు. ఎన్టీఆర్ లాంటి మొహన్నతమైన వ్యక్తికి కుమార్తెగా ఉన్నామెను కూడా రాజకీయాల్లోకి లాగి, ఆమె వ్యక్తిత్వాన్ని లాగినందుకు. చంద్రబాబు గారిని ఎలాగైనా టార్గెట్ చేయాలని, ఆయన ఆత్మస్థైర్యం దెబ్బ తీయాలని మొదటి నుంచి జగన్ బ్యాచ్ భావిస్తూ వచ్చింది. నిన్న కూడా చంద్రబాబుని చూడలని ఉంది అంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన హేళనలు అందరూ చూసారు. చంద్రబాబు గారు ఈ రోజు ధైర్యంగా అసెంబ్లీకి వచ్చారు.

cbn 19112021 2

ఆయన వచ్చిన దగ్గర నుంచి రెచ్చగోడుతూనే ఉన్నారు. ఉదయం చంద్రబాబు గారు వస్తూ ఉండగా, మార్షల్ ఫోటోలు తీసారు. ఎందుకు తీసావని అడిగితే సమాధానం లేదు. వెంటనే స్పీకర్ కు చంద్రబాబు ఫిర్యాదు చేసారు. తరువాత నుంచి చంద్రబాబు పై మాటల దాడి ప్రారంభించారు. కొడాలి నాని చేత తిట్టించారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇస్తూ, నా పై వ్యక్తిగత దా-డి చేస్తున్నారని, ఇలాగే చేయాలంటే, బాబాయ్ దగ్గర నుంచి మొదలు పెడదాం అని అన్నారు. తరువాత అంబటి మాటలు తెలిసిందే. అంతే కాదు, మైక్ లో కాకుండా, పక్క నుంచి కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, లోకేష్ పుటక గురించి జుబుక్సాకరంగా మాట్లాడించారు. చంద్రబాబు ఆ మాటలు తట్టుకోలేక పోయారు. వెంటనే అసెంబ్లీలో దండం పెట్టి, ఇక ఈ సభకు రాను అని చెప్పి వచ్చేసారు. తరువాత ప్రెస్ మీట్ లో, తన భార్య గురించి మాట్లాడిన మాటలు విని, చంద్రబాబు విలపించారు. ఇక్కడ వైసీపీ వ్యూహం ఫలించింది, రాజకీయంగా చంద్రబాబుని ఎంత టార్గెట్ చేసినా ఆయన చలించడు అని అర్ధం అయ్యింది. అందుకే ఆయన్ను పర్సనల్ గా, నీచాతి నీచంగా, ఆయన కుమిలిపోయే విధంగా టార్గెట్ చేసి, ఈ రోజుకి చంద్రబాబుని ఏడిపించారు. రేపటి నుంచి చంద్రబాబు, ఎలాంటి రాజకీయం చేస్తారో చూడాలి.

అసెంబ్లీ సమావేశం, రెండో రోజు ప్రారంభం అయ్యాయి. అయితే అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్ను. శాసనసభ ప్రాంగణంలో ఒక మార్షల్ చేసిన ఓవర్ ఆక్షన్ తో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ లోపలకి ప్రవేశిస్తున్న సమయంలో, ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు అసెంబ్లీలోకి వెళ్తూ ఉండగా, చంద్రబాబుని ఫోన్ తో విజువల్స్ తీసాడు ఒక మార్షల్. అయితే ఈ పరిణామంతో, ఒక్కసారిగా చంద్రబాబు సిబ్బంది అలెర్ట్ అయ్యారు. మార్షల్ ఫోటో తీసిన వెంటనే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కడ ఉన్న టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబుని ఫోటోలు తీసిన మార్షల్ ను చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు సెక్యూరిటీ అదుపులోకి తీసుకోవటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అలెర్ట్ అయిన చీఫ్ మార్షల్ చంద్రబాబు వద్దకు వచ్చి క్షమాపణ చెప్పారు. చీఫ్ మార్షల్ క్షమాపణ చెప్పటంతో, అతన్ని వదిలి పెట్టారు అయితే మార్షల్ తీరు పై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అతను ఎందుకు ఫోటోలు తీసాడు, ఎవరు తీయమంటే తీసారు అనే విషయం తేల్చాలి అంటూ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.

mashal 19112021 2

సభలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు, ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. బుచ్చయ్య చౌదరి ముందుగా ఈ విషయం పై, స్పీకర్ వద్ద లేవనెత్తారు. ఇన్నాళ్ళు సభలో ఉన్నాం అని ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదని అన్నారు. దీని పై విచారణ చేయాలని అన్నారు. చంద్రబాబు కూడా మాట్లాడతూ, అసలు ఇలా ఏందుకు జరిగిందో తేల్చాలని, మీరు ఫోటోలు తీయమన్నారా చెప్పండి అంటూ స్పీకర్ ని ప్రశ్నించారు. చంద్రబాబు నిలదీయటంతో, స్పీకర్ మాట్లాడుతూ, దీని పై తనకు సమాచారం లేదని, అసలు ఇది ఎందుకు జరిగిందో, తను ఎందుకు ఇలా చేసారో నేను కనుక్కుని, తగిన చర్యలు తీసుకుంటాం అంటూ స్పీకర్ చెప్పారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన విరమించారు. నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబుని హేళన చేస్తూ మాట్లాడుతున్న మాటలు అందరికీ తెలిసిందే. చంద్రబాబుని చూడాలని ఉంది అంటూ జగన్ మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్తూ, చంద్రబాబుని హేళన చేస్తాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ అధికారులతో పాటుగా, జిల్లా విద్యా శాఖ అధికారులు విచిత్రమైన సర్క్యులర్లు, ఆదేశాలు ఇస్తున్నారు. రేపు వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా, స్కూల్స్ లో ఉండే హెడ్ మాస్టర్లు, టీచర్లు, తల్లిదండ్రుల కమిటీకి చెందిన వారు, వీరందరూ రేపు స్కూల్స్ కి రావాలని, అక్కడ టాయిలెట్లను వీరంతా పరిశుభ్రంగా కడగాలని, ఆదేశాలు జారే చేసారు. ఈ టాయిలేట్లు కడిగే కార్యక్రమంలో అందరూ పాల్గునాలని కూడా విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు అనంతపురంలో, విద్యా శాఖ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ బయటకు వచ్చింది. దీంతో పాటు రాష్ట్ర విద్యా శాఖ నుంచి కూడా వాట్స్ ఆప్ లో సందేశాలు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు కూడా వెళ్లాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. విద్యా శాఖ జారీ చేసిన ఈ సర్క్యులర్ పై తీవ్ర చర్చ జరుగుతుంది. రేపు శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా, అందరికీ ఆప్షనల్ హాలిడే ఉందని, కార్తిక పౌర్ణమిని అందరూ శ్రద్ధతో జరుపుకుంటారని, ఈ తరుణంలో వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా, టీచర్లు అందరూ టాయిలెట్లు కడగాలని, ఈ సర్క్యులర్లు పంపించటం ఏమిటి అంటూ, విద్యా శాఖ లో ఉండే అధికారులు, టీచర్లు, హెడ్ మాస్టర్లు వీరందరూ కూడా ప్రభుత్వ జారీ చేసిన ఈ ఆదేశాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

teachrs 18112021 2

ఉపాధ్యా సంఘాలు అయితే మాత్రం, ఈ పరిణామం పై మండి పడుతున్నాయి. ఆప్షనల్ హాలిడేని, టాయిలెట్లు కడగటం కోసం టీచర్లను, రమ్మనటం, అదీ కాక రేపు కార్తీక పౌర్ణమి అని కూడా గుర్తు చేస్తున్నారు. ఏపిటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ ఆదేశాల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏదైతే విద్యా శాఖ పంపించిన వాట్స్ అప్ సందేశం కానీ, దాంతో పాటుగా, ఇచ్చిన జిల్లా విద్యా శాఖ అధికారులు ఇచ్చిన సర్క్యులర్లు కానీ, ఇవి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ విధంగా సర్క్యులర్లు ఇస్తూ, బడులలో ఉండే టీచర్లను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, ఉపాధ్యాయులు టాయిలెట్లు కడిగే కార్యక్రమం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మరుగుదొడ్లు రోజు ఫోటోలు తీసి యాప్ లో పెట్టాలి అనే నిబంధనతో టీచర్లు ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు ఏకంగా దొడ్లు కడగాలని చెప్పటంతో, టీచర్లు అవాక్కయ్యారు. మరి ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెనక్కు తీసుకుంటుందో లేదో మరి.

మెగాస్టార్ చిరంజీవి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లోని యోధ లైఫ్‌లైన్‌ డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో, ఉపరాస్ట్రపతి వెంకయ్యతో పాటుగా, చిరంజీవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రసంగంలో భగంగా చిరంజీవి మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి వెంకయ్య పై, పొగడ్తల వర్షం కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య తెలుగుదానానికే నిర్వచనం అని చిరంజీవి అన్నారు. క్రమశిక్షణకు మారు పేరు మన వెంకయ్య నాయుడు అని చిరంజీవి చెప్తూ, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఎన్నో సేవలు ఈ దేశానికి అందించారని అన్నారు. దివంగత నందమూరి తారక రామారావు గారి ద్వారా, తెలుగువారికి ప్రపంచ స్థాయి ఖ్యాతి దక్కిందని, గుర్తింపు లభించిందని చెప్పిన చిరంజీవి, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారి ద్వారా తెలుగువారి నిర్వచనం, నిలువెత్తు నిర్వచనం అని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగానే చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు వారు మరింత గర్వించేలా, ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు, త్వరలోనే రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి, వెంకయ్య నాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటంతో, అక్కడ ఉన్న వారు అంతా చిరంజీవి మాటలకు సమర్ధిస్తూ, చప్పట్లు కొట్టారు.

venkaiah 18112021 2

అయితే తరువాత మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవి మాటలకు సమాధానం ఇచ్చారు. చిరంజీవి తనకు రాష్ట్రపతి పదవి రావాలని కోరుకుంటున్నారని, ఆయన కోరుకున్నాట్టు రాష్ట్రపతి పదవి నాకు వస్తుందని అనుకోవటం లేదని అన్నారు. ప్రస్తుతం రాజకీయం అంత బాగోలేదని వెంకయ్య తన మనసులో మాట చెప్తూ, ఇక ఏ పదవి వద్దు అనే విధంగా స్పందించారు. ప్రస్తుత రాజకీయాల తీరు చూస్తే బాధ వేస్తుందని, ఈ రాజకీయాల పై ఎక్కువ మాట్లాడటం తనకు ఇష్టం లేదని, వెంకయ్య సూటిగా చెప్పేసారు. చిరంజీవి కూడా రాజకీయాల నుంచి తప్పుకుని మంచి పని చేసారని, వెంకయ్య అన్నారు. అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి. చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు అంటూ, ఈ మధ్య ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి మాట్లాడిన మాటలు, దానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఇచ్చిన సమాధానం, రాజకీయాలు ఇప్పుడు బాగోలేదు అని చెప్పిన తీరు, ఈ మొత్తం వ్యవహారం పై, ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read