నవంబర్ 14వ తేదీన తిరుపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. ఆ రోజున తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ హాజరు అవుతారు. కర్ణాటక ఎలాగూ బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వస్తారు, తమిళనాడు సియం కూడా వస్తారనే సమాచారం ఉంది, కేరళ ముఖ్యమంత్రి కూడా వస్తారనే సంకేతాలు ఉన్నాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి, ఎప్పుడూ అమిత్ షా మీటింగ్ మిస్ చేసుకోరు, అదీ మనది ఆతిధ్య రాష్ట్రం కాబట్టి జగన్ తప్పకుండా వస్తారు. ఇక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాక పైన మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన తిరుపతి రాక పై, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం రాలేదని తెలుస్తుంది. సహజంగా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అంటే, పక్క రాష్ట్రాలతో ఉన్న సమస్యలు చర్చిస్తారు. నీటి సమస్యలు, ఇతర ఆర్ధిక కష్టాలు, రావాల్సిన బాకీలు, ఇలా అనేక విషయాలు చర్చిస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ సమావేశంలో ఏమి చర్చిద్దాం అని కేసీఆర్ ఒక సమీక్ష కూడా పెట్టలేదు. ఉన్నతాధికారులు మాత్రం, సమావేశంలో చర్చించాల్సిన అంశాలు రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.

kcr 08112021 2

అయితే నిన్నటి కేసీఆర్ ప్రెస్ మీట్ తరువాత, ఆయన కేంద్రం పై యుద్ధం ప్రకటించారు. ఇక రేపటి నుంచి బీజేపీని చూస్తూ ఊరుకోం అంటూ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా బీజేపీని ఎండగడతాం అంటూ ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఒక సెన్సేషన్ అయ్యింది. రేపటి నుంచి కేంద్రం తీరుకి వ్యతిరేకంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం అని, అవసరం అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తాను కూడా ఢిల్లీకి వెళ్ళి కేంద్రం తీరుకి వ్యతిరేకంగా ధర్నా చేస్తాను అంటూ కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ పై, ముఖ్యంగా కేంద్రం పై నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తరువాత, ఆయన తిరుపతికి వచ్చి, అమిత్ షా నేతృత్వంలో జరిగే సమావేశానికి రావటం అనుమానం అనే చెప్పాలి. లేదా వచ్చి నిరసన తెలుపుతారా అనేది చూడాలి. కేసీఆర్ రాకపోయినా, ఉన్నతాధికారుల బృందం మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపి, తెలంగాణా మధ్య సాగు నీటి ప్రాజెక్ట్ లు, నీటి పంపకాలు, విద్యుత్ బకాయలు, రాష్ట విభజన చట్టంలో పెండింగ్ అంశాలు, ఇలా చాలా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. మరి వీటి పై ఆ సమావేశంలో ఏమి నిర్ణయం తీసుకుంటారో మరి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, తమ ప్రభుత్వంలో జరిగే ఏ ప్రజావ్యతిరేకత, చట్ట వ్యతిరేక పనులను చూస్తూ ఊరుకోవటం లేదు. ఆయన స్థాయిలో ఆయన పోరాటం చేస్తున్నారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వంతో పోరాడి, విజయం సాధిస్తున్నారు కూడా. తాజాగా ఆయన వారం రోజులు క్రిందట చేసిన ఒక ఫిర్యాదు విషయంలో కూడా విజయం సాధించారు. అలాగే ఒక బీజేపీ ఎంపీ కూడా ఈ విషయంలో ఫిర్యాదు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ కు షాక్ ఇచ్చారు రఘురామకృష్ణం రాజు. హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటులో ఒక ఉన్నతాధికారి. ఆయన గతంలో ముంబై, హైదరాబాద్ ఇలా ఇతర రాష్ట్రాల్లో పని చేసారు. అయితే ఎవరి లాబీయింగ్ చేసారో కానీ, పది రోజుల క్రితం ఆయన్ను విజయవాడలోని ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటుకు ట్రాన్స్ఫర్ చేసారు. ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటు అంటే తెలిసిందేగా. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఎలా టార్గెట్ చేస్తున్నారో చూస్తున్నాం. ఈ క్రమంలో ఏకంగా ఒక రాష్ట్ర హోంమంత్రిగా తన భార్య ఉన్నా కూడా, భర్తని అదే రాష్ట్రంలో వేయటం పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు ఆయన బాధ్యతలు స్వీకరించే రోజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకటం పై విమర్శలు వచ్చాయి.

amitshah 08112021 2

దీంతో వీటి పై బీజేపీకి చెందిన ఒక ఎంపీతో పాటుగా, రఘురామరాజు నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు. ఐటి కమీషనర్ గా హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ని విజయవాడలో నియమించటం సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకం అని తెలిపారు. అంతే కాకుండా, ఆయన బాధ్యతలు తీసుకునే సమయంలో, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు కూడా జత పరిచారు. ఏమైందో ఏమో కానీ, నిన్న హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎంత వేగంతో విజయవాడ వచ్చారో, అంతే వేగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌ వెళ్ళిపోయారు. దీని వెనుక ప్రధానంగా అమిత్ షా కు ఇచ్చిన ఫిర్యాదే కారణం అని తెలుస్తుంది. అంటే లాబీయింగ్ చేసిన వైసీపీ ఎంపీల కంటే, రఘురామరాజు, ఫిర్యాదు చేసిన మరో బీజేపీ ఎంపీ పవర్, కేంద్రం దగ్గర గట్టిగా పని చేసిందని అర్ధం అవుతుంది. మరి బదిలీ వెనుక అసలు కారణం ఏమిటో మాత్రం అధికారికంగా చెప్పలేదు.

రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలను రణరంగాన్ని సృష్టించే విధంగా మార్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరీ ముఖ్యంగా కుప్పంలో అరాచకాలు తారా స్థాయికి వెళ్ళాయి. నామినేషన్లు లాక్కుని పారిపోవటం, అభ్యర్ధులను కిడ్నాప్ చేయటం, కొట్టటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, విధ్వంసం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కుప్పంలో అరాచకాలను దీటుగా ఎదుర్కోవటానికి, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డిని టిడిపి రంగంలోకి దించింది. ఆయన ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతూ, అక్కడ ధీటుగా బదులు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు అమర్‌నాథ్ రెడ్డిని టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన పై తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. కుప్పం 14వ వార్డు అభ్యర్థి ప్రకాష్ ని అమర్‌నాథ్ రెడ్డి కిడ్నాప్ చేసారు అంటూ, తమ అనుకూల మీడియాలో ప్రచారం చేసారు. అంతే కాదు, వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూడా అమర్‌నాథ్ రెడ్డి పై ఫిర్యాదు చేసారు. అంతే కాదు, చంద్రబాబు కార్యదర్శి మనోహర్, పీఎస్.మునిరత్నం, వెంకటేష్ పైనా ఫిర్యాదు చేపించారు. బంధువులతో ఫిర్యాదు చేపించారు. అసలు టిడిపి అభ్యర్ధిని అమర్‌నాథ్ రెడ్డి ఎందుకు కిడ్నాప్ చేస్తారు అనే స్పృహ కూడా లేకుండా తప్పుడు ఫిర్యాదులు చేసి, అమర్‌నాథ్ రెడ్డిని అరెస్ట్ చేసి అడ్డు తొలగించుకునే వ్యూహం కావచ్చు.

amarnadh 07112021 1

అయితే దీని పై తెలుగుదేశం పార్టీ దీటుగా స్పందించింది. ఇవన్నీ అక్రమ కేసులు అని, అతను కిడ్నాప్ కాకపోయినా, కిడ్నాప్ అయ్యారు అంటూ తప్పుడు ప్రచారం చేసి, భయభ్రాంతులకు గురిచేసే చర్యలో భాగంగానే, ఇలా తప్పుడు ఫిర్యాదులు చేసి, అరాచకం చేస్తున్నారని అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. అయితే కొద్ది సేపటి క్రితం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేస్తూ, కుప్పం 14వ వార్డు అభ్యర్థిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని అన్నారు. నామినేషన్ కాపాడుకునేందుకు ప్రకాష్ జాగ్రత్త పడ్డాడని, నామినేషన్ల ఉపసంహరణ ముగిసే వరకు ఆయన జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. కొద్ది సేపటి క్రితం హైడ్రామాకు తెర దించుతూ వీడియో విడుదల చేసారు టీడీపీ అభ్యర్థి ప్రకాష్. సొంత పనుల మీద బయటికి వెళ్తే, కావాలనే పుకార్లు సృష్టించారని అన్నారు. అయితే ఇదే 14వ వార్డులో నాలుగు రోజుల క్రితం వెంకటేష్ అనే వ్యక్తి నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని వెళ్ళిన సంగతి తెలిసిందే.

టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే చాలు, ప్రభుత్వానికి వణుకు మొదలవుతుంది. గతంలో చేసిన అప్పు వివరాలు, అప్పు దాచటం, అప్పు దారి తప్పటం, ఇలా అనేక వివరాలకు ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి సరైన సమాధానం లేదు. ఇప్పుడు తాజాగా పయ్యావుల మరో సంచలన ఆరోపణ చేసారు. అదే సోలార్ పవర్ కొనుగోళ్ళలో గోల్ మాల్ గురించి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 9వేల మెగావాట్ల ఒప్పందం, ఆఘమేఘాల మీద 24 గంటల్లో జరిపోవటం, ఇందులో లోటు పాట్లు, తక్కువ రేటుకు వస్తున్నా, ఎక్కువ రేటు పెట్టి కొనటం, ప్రభుత్వం చెప్తున్న లెక్కలు గురించి పయ్యావుల ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. పయ్యావుల చేసిన మొదటి ఆరోపణ, యూనిట్ రూ. 2.49 పైసల కాంటే తక్కువగా ఇతర రాష్ట్రాలు కొంటుంటే, మనమెందుకు యూనిట్ రూ. 2.49 పైసల పెట్టి కొంటున్నాం ? యూనిట్ రూ. 2.49 పైసలు కూడా అబద్ధం అని, ఈ విద్యుత్ రాజస్తాన్ లో తయారు అవుతుందని, ఇది ఏపి వచ్చేసరికి రూ.4 అవుతుందని, ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుందని అన్నారు. అయితే పయ్యావుల వ్యాఖ్యల పై, మంత్రి బాలినేని ఒక ప్రకటన విడుదల చేసారు. అందులో ఆయన చెప్పింది, పయ్యావుల ఆరోపణలు తప్పు, తాము యూనిట్ రూ. 2.49 పైసలకే కొంటున్నాం అని రాసారు.

payyaavula 08112021 2

కొంటున్నారు సరే, చివరకు ఏపికి వచ్చే సరికి రూ.4 పైన అవుతుంది కదా అనే ఆరోపణలకు మంత్రిగారి సమాధానం రాలేదు. అయితే నిన్న ఆదివారం అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మీడియా సమావేశం పిలిచారు.నిజానికి శనివారమే ఈ సమావేశం ఉండాల్సి ఉండగా, మీడియాను పిలిచిన తరువాత, గంట సేపు అయిన తరువాత, మీడియా సమావేశం రద్దు చేసుకున్నారు. మళ్ళీ విమర్శలు రావటంతో, నిన్న ఆయన మీడియా సమావేశం పెట్టి వివరించారు. ఇతర రాష్ట్రాలు తక్కువకు వస్తున్నాయి అంటే, అది తమకు సంబంధం లేదని, మన రాష్ట్రానికి ఎంత కోట్ చేసారో, దాని ప్రకారమే వెళ్ళాం అని అన్నారు. ఇక యూనిట్ ధర గురించి చెప్తూ, అసలు నిజం ఒప్పుకున్నారు. ఆదానీ కంపెనీకి చెల్లించేది యూనిట్ కు రూ. 2.49 కే అని, అది ఏపికి వచ్చే సరికి కేంద్ర, రాష్ట్ర ట్రాన్స్ మిషన్ చార్జీలు, అలాగే నిర్వహణ ఖర్చులు కలిపి, మరో రూ.1.67 పైసలు అవుతుందని, అంటే మొత్తం యూనిట్ చార్జీ రూ.4.16 పైసల అవుతుందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఒప్పుకున్నారు. మంత్రి బాలినేని తెలివగా సమాధానం చెప్తే, అధికారి మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read