ఒక పక్క తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసిపోయాయి, ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్, టిడిపి మధ్య చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది. నిన్న విశాఖ వచ్చిన పవన్ కళ్యణ్, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో పాల్గుని ప్రసంగం చేసారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ, ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అంటూ, డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి పైన చేసిన కొన్ని వ్యాఖ్యలకు, టిడిపి వెంటనే కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ వాళ్ళు పార్లమెంట్ లో పోరాటం చేసే సమయంలో, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన టిడిపిని కూడా పిలవాలని, అలాగే అఖిలపక్ష సమావేశంలో కూడా, బెస్ట్ ఫ్రెండ్ టిడిపిని పిలవాలి అంటూ, వైసీపీ, టిడిపి ఫ్రెండ్ అనే విధంగా ప్రసంగం చేసారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యల పై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ రెండూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, ప్రజలకు ఎవరు ఏంటో తెలుసు అని అన్నారు. ఒకరు చెప్పవలసిన అవసరం లేదని అన్నారు. ఇన్ని ఇబ్బందులు పెడుతూ, అరెస్ట్ లు చేస్తూ, కార్యాలయాల పై దా-డు-లు చేస్తూ ఉంటే, బెస్ట్ ఫ్రెండ్స్ అని పవన్ ఎలా అంటారు అంటూ కౌంటర్ ఇచ్చారు.
అచ్చెన్నాయుడు ఏమన్నారు అంటూ, "తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఫ్రెండ్స్ అని అన్నారు. ఒకరికి చెప్పవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ రెండూ బెస్ట్ ఫ్రెండ్సా లేదా, వేరే పార్టీలు బెస్ట్ ఫ్రెండ్సా అనేది ప్రజలకు తెలుసు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వం అఖిలపక్షం అనేది పిలవాలి కదా. పిలిచిన తరువాత, మేము వెళ్తామో లేదో అప్పుడు అడగండి. పిలవక ముందే మనం ముందు ఎందుకు ఊహాల్లోకి వెళ్ళటం. మీకు ఆయన అఖిలపక్షం పిలుస్తారు అనే నమ్మకం ఉందా ? తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ థిక్ ఫ్రెండ్సో కాదో ప్రజలకు తెలుసు. 5 కోట్ల మంది ఆంధ్రులకు తెలుసు. మాకు వాళ్ళు థిక్ ఫ్రెండ్స్ అయితే మా మీద కేసులు ఎందుకు పెడతారు ? మా ఆఫీస్ పైన ఎందుకు దా-డు-లు చేస్తారు ? మా అందరి మీద కేసులు పెట్టారు కదా ? కేసులు పెట్టని వాడు ఎవరైనా ఉన్నారా ? ఆస్తులు ధ్వం-సం కాని వారు ఎవరైనా ఉన్నారా ? అన్నీ అయిపోయాయి, చివరకు ఈ ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, ఒక పార్టీ కార్యలయలం మీద దా-డి చేస్తే, వారు మాకు థిక్ ఫ్రెండ్ ఏంటి ? ప్రజలు ఇవ్వన్నీ గమనిస్తారు." అని అన్నారు.