జగన్ మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుని దించటం కోసం ప్రయత్నం చేసారు. అధికారంలోకి కూడా వచ్చారు. ఏమైందో ఏమో కానీ షర్మిలను జగన్ దూరం పెట్టారు. సడన్ గా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు. సమైఖ్యం అంటూ తిరిగిన షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టటం పై ఆశ్చర్యం వ్యక్తం అయ్యింది. అనూహ్యంగా కేసీఆర్ వైపు నుంచి కూడా విమర్శలు లేవు. తెలంగాణాకు మొత్తం సమకూర్చిన చంద్రబాబునే తెలంగాణా ద్రోహి అని రాజకీయ పబ్బం గడుపుకునే కేసీఆర్ షర్మిల విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఇక జగన్, షర్మిల అయితే, ఇద్దరికీ గొడవలు ఉన్నాయి అనే అభిప్రాయం ప్రజలకు కలిగించటంలో సక్సస్ అయ్యారు. షర్మిలను పార్టీ పెట్టవద్దు అని కోరామని సజ్జల కూడా చెప్పారు. ఏబిఎన్ తో షర్మిల దగ్గరగా ఉండటం మరో హైలైట్. ఆస్తులు గొడవలు ఉన్నాయని, ఇదని అదనీ బయటకు చెప్పుకుంటూ మొత్తానికి జగన్ కు షర్మిలకు మధ్య గ్యాప్ ఉంది అనే అభిప్రాయం సృష్టించారు. విజయమ్మ ఇక్కడ జగన్ పార్టీకి గౌరవ అద్యక్షురాలుగా ఉంటూనే, షర్మిల పార్టీలో తిరగటం మరో హైలైట్. అయితే జగన్ షర్మిల మధ్య ఏమి లేదని, అది కేలవం ప్రజల మధ్య ఆడుతున్న నాటకం అని చెప్పే వారు ఉన్నారు. అది నిజం అని కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది.

sharmila 30102021 2

షర్మిల ఇటీవల పాదయాత్ర మొదలు పెట్టారు. ఆ పాదయాత్ర ఇప్పటికే వంద కిమీ కూడా దాటింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఈ పాదయత్రలో అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గునటం ఇప్పుడు చర్చకు దారి తీసింది. మళ్ళీ ఈ కలిసిన వాళ్ళు అందరూ జగన్ సన్నిహితులు. టిటిడి చైర్మెన్, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వచ్చి హైదరాబాద్ శివార్లలో ఉన్న షర్మిలను కలిసారు. అలాగే జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కూడా వెళ్లి షర్మిలను పాదయాత్రలో కలిసారు. దాదాపుగా గంట సేపు భేటీ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డికి, షర్మిలకు నిజంగానే గొడవలు ఉంటే, జగన్ కు సన్నిహితంగా ఉండే ఈ నాయకులు ఎందుకు, వెళ్లి షర్మిలను కలుస్తారు ? ఏదో గొడవ ఉందని ఎందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు ? రాజకీయంగా షర్మిలకు తెలంగాణాలో ఇబ్బంది కాకూడదు అనే, ఈ మొత్తం ఎపిసోడ్ నడుస్తుందని, అప్పుడప్పుడు ఇలా తెలియకుండా వీళ్ళ నాటకం బయట పడుతుంది అని ప్రత్యర్ది పార్టీలు ఆరోపిస్తున్నాయి.

కుప్పం పుల‌కించింది. అభిమాన జ‌న‌సంద్ర‌మైంది. శుక్రవారం చంద్రబాబు కుప్పం పర్యటన జన జాతరను తలపించింది. జన ప్రభంజనంతో, నిన్నటి చంద్రబాబు పర్యటన ఒక ఉత్సవంలా సాగింది. కుప్పం పసుపుమయమైంది. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు, తమ అభిమాన నాయకుడి కోసం, జన సంద్రం ఉప్పొంగింది. ఇంత అనూహ్య స్పందన రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో టిడిపి శ్రేణుల్లో ఒక విధమైన ఎమోషన్ ఉంది. వైసీపీ అరాచకాలకు సమాధానం చెప్పాలి అనే కసితో ఉన్నారు. దానికి తోడు కుప్పం పైన వైసీపీ చేసిన తప్పుడు ప్రచారం. కుప్పంలో టిడిపి పని అయిపొయింది అంటూ చేసిన తప్పుడు ప్రచారానికి ధీటుగా బదులు ఇవ్వాలని టిడిపి శ్రేణులు అనుకోవటం. అలాగే మంగళగిరిలో టిడిపి కార్యాలయం పైన జరిగిన దా-డి. ఇవన్నీ క్యాడర్ లో కసిని పెంచాయి. ఇక మరో పక్క ప్రజలు. జగన్ పాలన పై విసిగి వేసారి పోయారు. తమకు అండగా ఉండే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు బయటకు రావటమే ఆలస్యం, ప్రజలు ఆయనకు తోడుగా కదిలారు. ఒక వైపు కార్యకర్తలు, మరో వైపు ప్రజలు కదం తొక్కటంతో, చంద్రబాబు కుప్పం పర్యటనకు విశేష స్పందన లభించింది. టిడిపి కూడా ఊహించని ప్రజాధరణ వచ్చింది.

kuppam 30102021 2

నిన్న ఉదయం చంద్రబాబు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి, కదం తొక్కారు. ఆయన కుప్పం చేరుకోవటానికి సుమారుగా 5 గంటలు పట్టింది. 2 గంటలకు మీటింగ్ ఉండాల్సి ఉండగా, అది కూడా ఆలస్యం అయ్యింది. మరో పక్క పోలీసులు అడ్డగింతలు, వైసీపీ కార్యకర్తల వీరంగం, ఇవన్నీ ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కుప్పం నలు మూలల నుంచి ప్రజలు వచ్చారు. దీనికి తోడు చంద్రబాబు ప్రసంగం కూడా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ఇది నా శపధం అంటూ టిడిపి శ్రేణులను ఇబ్బంది పెడుతున్న వారికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా ఆయనకు లభించిన స్వాగతం, ప్రజల్లో ఉత్సాహం ఎప్పుడూ చూడలేదని టిడిపి శ్రేణులు అంటున్నారు. కార్యకర్తల ప్రతి కదలికలో కసి కనిపించిందని, నిన్నటి పర్యటనే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ధర్మ పోరాటానికి మూలం అని, పర్యటనకు వచ్చిన స్పందన చూసి, ఉబ్బితబ్బిబ్బవుతుంది.

కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక బ్యాంకులు వెళ్ళిపోయాయి. రాజధాని పై సందిగ్ధం ఏర్పడింది. తరువాత మూడు రాజధానులు అన్నారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అయ్యింది. తరువాత రైతులు ఆందోళన బాట పట్టారు. రాజధాని అమరావతిలోనే ఎందుకు ఉండాలి అనే విషయం పై అవగాహన కల్పించారు. అమరావతి రాష్ట్రంలో మధ్యలో అందరికీ అందుబాటులో ఉంటుంది. అవసరం అయితే హైకోర్ట్ బెంచ్ ని విశాఖలో కానీ, రాయలసీమలో పెట్టుకోవచ్చు. అవసరం అయితే అసెంబ్లీ కూడా, శీతాకాలం వేరే చోట పెట్టుకోవచ్చు. ఇలాంటి ఉదంతాలు దేశంలో చాలా ఉన్నాయి. ఇది భూమి విలువల కోసం చేస్తున్న పోరాటం కాదు, రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటం. ఉమ్మడి ఏపిలో హైదరాబద్ వల్లే రాష్ట్రం బాగు పడింది. మంచి సిటీ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. అప్పుడే రాష్ట్రం బాగు పడుతుంది. ఇక్కడకు వచ్చే ముందు అమరావతిలో అన్ని నిర్మాణాలు చూసి వచ్చాను. దాదాపుగా 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. పది వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో ఏమి చేయాలి అని రైతుల్లో అనిశ్చితి ఉంది. ఇప్పుడు రైతులు మరో అడుగు ముందుకు వేసి పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో అవగాహన కల్పించటానికి రైతులు పూనుకున్నారు. ఎక్కడ చూసినా నష్టపోయేది రైతులే. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇదే జరిగింది.

jdl 29102021 2

పోలవరంలో కూడా ఇదే జరిగింది. అమరావతిలో కూడా ఇప్పుడు రైతులకు అదే జరిగింది. అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నారు. అందుకే రైతులకు మద్దతు ఇవ్వటానికి వచ్చాను. ప్రధానంగా మహిళలు ఈ ఉద్యమంలో ముందున్నారు. మన మహిళలను రోడ్డున పడేయటం మంచి విషయం కాదు. ఇది మన సంస్కృతీ కాదు. వాళ్ళ మీద బాల ప్రయోగాలు చూస్తుంటే, బాధ వేస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్య పై దృష్టి సారించాలి. ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించారు, చివరకు కోర్టుల్లో ఏమి లేదని తేలింది. ఉపాధి, ఉద్యోగాలు, అభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి సారించాలి. రైతులు పాదయాత్ర కంటే ముందే, ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుటుంది. ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు. ఇది రియల్ ప్రాజెక్ట్. మహిళలను, రైతులను ఇబ్బంది పెట్టే పాలన ఉండాలా అనేది ఆలోచించాలి. ప్రభుత్వాలు రైతుల విషయంలో యోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది 29 గ్రామాల సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్త సమస్య అని ప్రజలు గుర్తుంచుకోవాలి.

మాట్లాడితే మాది రైతు ప్రభుత్వం అంటారు. మా నాన్న రైతు పక్షపాతి అని, ఆయన పుట్టిన రోజుని ఏకంగా ఈ రాష్ట్ర రైతు దినోత్సవం చేసేసారు. పేపర్లలో పెద్ద పెద్ద యాడ్ లు ఇచ్చి మరీ, రైతులకు అది చేసాం, ఇది చేసాం అని డబ్బా కొడుతున్నారు. అసలు రైతులు ఇప్పుడే పండిస్తున్నారని, సంతోషంగా ఉన్నారని డబ్బా కొడుతున్నారు. కౌలు రైతులను కూడా ఆదుకున్నాం అన్నారు. కట్ చేస్తే సమయానికి విత్తనాలు, ఎరువులు ఇవ్వరు. ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకోరు. మద్దతు ధర ఇవ్వరు. ధాన్యం కొని, డబ్బులు ఇవ్వరు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, వ్యవసాయం మొత్తం సంక్షోభంలో పడింది. ఇదే ఇప్పుడు ప్రభుత్వ గణాంకాల రూపంలో కూడా బయట పడింది. ప్రభుత్వ లెక్కలే ఇలా ఉన్నాయి అంటే, ఇక అసలు లెక్కలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. దేశంలో వివిధ కారణాల వల్ల ఆ-త్మ-హ-త్య-లు చేసుకున్న వారి గణాంకాలను నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో విడుదల చేసింది. ఇందులో రైతుల ఆ-త్మ-హ-త్య-ల వివరాలు ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న మాటలకు, వేస్తున్న ప్రకటనలకు, చేస్తున్న హడావాడికి, నిజంగా వాస్తవంగా ఏపిలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అనే విషయం అర్ధం అవుతుంది.

ads 29102021 2

నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో లెక్కలు ప్రకారం, రైతన్నల ఆ-త్మ-హ-త్య-ల్లో, ఏపి దేశంలోనే మూడో స్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో 889 మంది రైతులు మన రాష్ట్రంలో ఆ-త్మ-హ-త్య-లు చేసుకున్నారు. ఇందులో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు కూడా ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరువాత, ఆ స్థానం ఏపి ఆక్రమించింది. అంటే రోజుకు సగటున, ఇద్దరు నుంచి, ముగ్గురు రైతులు మన రాష్ట్రంలో ఆ-త్మ-హ-త్య-లు చేసుకుంటున్నారు. ఈ గణాంకాలు చూస్తే, రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కౌలు రైతుల ఆ-త్మ-హ-త్య-ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. దేశంలో కౌలు రైతులు ఆ-త్మ-హ-త్య-ల విషయం చూస్తే, ఏపి నుంచే 22 శాతం మంది ఉన్నారు. 2018తో పోల్చితే, అంటే చంద్రబాబు హయాంతో పోల్చితే, 2020లో జగన్ హాయాంలో రైతు ఆ-త్మ-హ-త్య-లు 33 శాతం పెరిగాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే, మాది రైతు ప్రభుత్వం అని ప్రభుత్వం ఎలా డబ్బా కొడుతుందో అర్ధం కావటం లేదని టిడిపి విమర్శలు చేస్తుంది.

Advertisements

Latest Articles

Most Read