తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ విషయంలో, ప్రభుత్వం అంతా పక్కాగా స్కెచ్ వేసి, ఆయన్ను అరెస్ట్ చేపించింది. అయితే పోలీసులు చేసిన తప్పు కానీ, పైన నుంచి వచ్చిన ఆదేశాలో ఏమో కానీ, వాళ్ళు చేసిన పొరపాటుతో, కోర్టులో బెయిల్ వచ్చింది. దీంతో ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు బాగానే ఉన్నారు కానీ, పోలీసులు బలి అయిపోయారు. ఇక విషయానికి వస్తే, రాష్ట్రంలో గంజాయి విషయం పై, టిడిపి సీనియర్ నేత నక్కా ఆనంద బాబు మాట్లాడటం, ఆయనకు వెంటనే నర్సీపట్నం నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వటం, ఆ నోటీసులు పై పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి, సజ్జలను తిట్టటం, అది నన్నే తిట్టడాని జగన్ భావించటం, బీపీ పెరిగిన కొంత మంది జగన్ అభిమానాలు, పట్టాభి ఇంటి పైనా, టిడిపి ఆఫీస్ పైన దా-డి చేయటం అందరికీ తెలిసిందే. ఇక్కడ వరకు బాగానే ఉంది. పోలీసులు ఏమి చేయాలి ? పట్టాభి ఇంటి పైన విచక్షణ లేకుండా దా-డి చేసిన వారిని పట్టుకుని, లోపల వేయాలి. కానీ మనకు అంతా రివర్స్ కాబట్టి, పట్టాభి తిట్టారు అనే పాయింట్ మీద, పట్టాభి ఇంటికి వెళ్లి, ఆయన ఇంటి తలుపులు బద్దల కొట్టి, ఒక నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను అరెస్ట్ చేసారు. అయితే పట్టాబి బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో, ఈ ప్రక్రియ అంతా ఎంత డొల్లతనంగా జరిగిందో అర్ధం అయ్యింది.
పట్టాభికి పోలీసులు 41 (ఏ) సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారు. అయితే అందులో, ఖాళీలు ఉన్నాయి. ఇదే విషయం కోర్టు అడిగింది. సమాధానం లేకుండా పోయింది. ఇక రిమాండ్ రిపోర్ట్ లో పట్టాభిని అరెస్ట్ చేయటానికి వస్తే ఆయన తలుపులు వేసుకున్నారని రాసారు. అయితే 41 (ఏ) సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చాం అని ఎలా చెప్తారు, రెండు మాటలు ఎందుకు అంటూ కోర్ట్ ప్రశ్నించింది. దీనికి కూడా సమాధానం లేదు. దీంతో పట్టాభికి వెంటనే బెయిల్ వచ్చింది. ఈ నేపధ్యంలోనే, ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలటంతో, ఈ పరిస్థితికి కారణమైన పోలీసు అధికారుల పై చర్యలు మొదలు పెట్టారు. విజయవాడ పరిధిలో పని చేస్తున్న ఏసీపీ రమేష్, సీఐ నాగరాజు పై బదిలీ వేటు పడింది. ఏసీపీ రమేష్ ను డీజీపీ కార్యాలయంలో సరండర్ అవ్వాలని ఆదేశించారు. వీరి బదిలీకి ప్రధాన కారణం పట్టాభి అరెస్ట్ విషయంలో జరిగిన పొరపాట్లే అని తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దల కక్షలకు పావులుగా మారిన ఇలాంటి పోలీసులు బలి అయిపోయారు. పోలీస్ అధికారులు రూల్స్ ప్రకారం పని చేయకపోతే, ఇది నిరంతర ప్రక్రియ అవుతుంది.