ఒక పక్క దేశంలో, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పతనం అవుతున్నాయని, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు అధికార పార్టీకు తొత్తులుగా మారిపోయాయి అనే ప్రచారం నడుస్తున్న నేపధ్యంలో, గత నాలుగు నెలలుగా సుప్రీం కోర్టు వ్యవహరిస్తున్న తీరు అందరికీ సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుకు, సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు బ్రేకులు వేస్తుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వచ్చిన దగ్గర నుంచి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు, దూకుడుగా వెళ్తున్న కేంద్రానికి కళ్ళెం వేస్తున్నారు. తాజాగా, దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన పెగసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో, దేశం మొత్తం ప్రశంసలు లభిస్తున్నాయి. కేంద్రం ఈ వ్యవహారం పై ఎంత తప్పించుకోవాలని చూసినా, సుప్రీం ఒప్పుకోలేదు. పెగసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇస్తూ, జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో ఈ వ్యవహారం పై నిగ్గు తేల్చాలి అంటూ కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఒకరు మాజీ ఐపిఎస్ అలోక్ జోషి, సందీప్ ఒబరేయ్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి సహాయం చేయటానికి టెక్నికల్ కమిటీ కూడా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ముగ్గురూ సాంకేతిక అంశాలు గురించి సహాయం చేస్తారు.
ఈ మొత్తం వ్యవహారం పై జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో బృందం స్వతంత్ర్యంగా దర్యప్తుక్ జరిపి, నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎనిమిది వారాల తరువాత ఈ కేసు విచారణ మళ్ళీ జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసుని ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. ముఖ్యంగా పెగసస్ వ్యవహారం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. తమ ప్రత్యర్ధి రాజకీయ నాయకుల ఫోన్లలో చొరబడి, మొత్తం ట్యాప్ చేసారు అంటూ, ప్రతిపక్షాలు ఆరోపించారు. రాజకీయ నాయకులతో పాటు, ఇతర ప్రముఖుల ఫోన్ల కూడా ట్యాప్ అయ్యాయి. ప్రముఖ జర్నలిస్ట్ రాం ఈ వ్యవహారం పై సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే దీని పై కేంద్రం సమాధానం చెప్తూ, మేము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని, కోర్టుకు తెలిపారు. ఇంతకు మించి ఏమి సమాచారం ఇవ్వలేమని, ఇది దేశ భద్రతకు సంబందించిన అంశం అని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం సమాధానంతో సంతృప్తి చెందని చీఫ్ జస్టిస్, కమిటీ ఏర్పటు చేసి, ఈ వ్యవహారం పై తేల్చమని ఆదేశాలు ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలన నిర్ణయం తీసుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పై, దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.