జగన్ మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుని దించటం కోసం ప్రయత్నం చేసారు. అధికారంలోకి కూడా వచ్చారు. ఏమైందో ఏమో కానీ షర్మిలను జగన్ దూరం పెట్టారు. సడన్ గా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు. సమైఖ్యం అంటూ తిరిగిన షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టటం పై ఆశ్చర్యం వ్యక్తం అయ్యింది. అనూహ్యంగా కేసీఆర్ వైపు నుంచి కూడా విమర్శలు లేవు. తెలంగాణాకు మొత్తం సమకూర్చిన చంద్రబాబునే తెలంగాణా ద్రోహి అని రాజకీయ పబ్బం గడుపుకునే కేసీఆర్ షర్మిల విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఇక జగన్, షర్మిల అయితే, ఇద్దరికీ గొడవలు ఉన్నాయి అనే అభిప్రాయం ప్రజలకు కలిగించటంలో సక్సస్ అయ్యారు. షర్మిలను పార్టీ పెట్టవద్దు అని కోరామని సజ్జల కూడా చెప్పారు. ఏబిఎన్ తో షర్మిల దగ్గరగా ఉండటం మరో హైలైట్. ఆస్తులు గొడవలు ఉన్నాయని, ఇదని అదనీ బయటకు చెప్పుకుంటూ మొత్తానికి జగన్ కు షర్మిలకు మధ్య గ్యాప్ ఉంది అనే అభిప్రాయం సృష్టించారు. విజయమ్మ ఇక్కడ జగన్ పార్టీకి గౌరవ అద్యక్షురాలుగా ఉంటూనే, షర్మిల పార్టీలో తిరగటం మరో హైలైట్. అయితే జగన్ షర్మిల మధ్య ఏమి లేదని, అది కేలవం ప్రజల మధ్య ఆడుతున్న నాటకం అని చెప్పే వారు ఉన్నారు. అది నిజం అని కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది.
షర్మిల ఇటీవల పాదయాత్ర మొదలు పెట్టారు. ఆ పాదయాత్ర ఇప్పటికే వంద కిమీ కూడా దాటింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఈ పాదయత్రలో అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గునటం ఇప్పుడు చర్చకు దారి తీసింది. మళ్ళీ ఈ కలిసిన వాళ్ళు అందరూ జగన్ సన్నిహితులు. టిటిడి చైర్మెన్, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వచ్చి హైదరాబాద్ శివార్లలో ఉన్న షర్మిలను కలిసారు. అలాగే జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కూడా వెళ్లి షర్మిలను పాదయాత్రలో కలిసారు. దాదాపుగా గంట సేపు భేటీ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డికి, షర్మిలకు నిజంగానే గొడవలు ఉంటే, జగన్ కు సన్నిహితంగా ఉండే ఈ నాయకులు ఎందుకు, వెళ్లి షర్మిలను కలుస్తారు ? ఏదో గొడవ ఉందని ఎందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు ? రాజకీయంగా షర్మిలకు తెలంగాణాలో ఇబ్బంది కాకూడదు అనే, ఈ మొత్తం ఎపిసోడ్ నడుస్తుందని, అప్పుడప్పుడు ఇలా తెలియకుండా వీళ్ళ నాటకం బయట పడుతుంది అని ప్రత్యర్ది పార్టీలు ఆరోపిస్తున్నాయి.