న్యాయమూర్తుల పై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెట్టిన కేసు, ఈ రోజు హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా, హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ చేసిన వాదనతో హైకోర్టు ఏకీభావించటమే కాకుండా, సిబిఐ అనుసరిస్తున్న తీర్పు పై హైకోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాలో ఉంటున్న పంచ్ ప్రభాకర్, న్యాయమూర్తులు అదే విధంగా హైకోర్టు పై కూడా ప్రతి రోజు వీడియోలు పోస్ట్ చేస్తూ, దారుణమైన భాష వాడుతున్నారని, ఇది సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయని, ఈ అంశాన్ని పలు మార్లు సిబిఐ దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ, సిబిఐ అతనికి కనీసం ఒక నోటీసు కూడా ఇవ్వలేక పోయింది అంటూ, అశ్వినీ కుమార్ హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకుని వచ్చారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ప్రవర్తిస్తున్నాడని వ్యాఖ్యానించింది. ఎన్ని సార్లు ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని అశ్వనీ కుమార్ ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేక పోయారని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

cbi 28102021 2

వెంటనే రేపు ఉదయం సిబిఐ ఎస్పీని తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ లోపు పంచ్ ప్రభాకర్ పై మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో, దానికి సంబంధించిన వివరాలు కూడా హైకోర్టు ముందు ఉంచాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అలాగే ఈ అభ్యంతరకర పోస్టింగ్ లు తొలగించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ, హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది. ఎందుకు చర్యలో తీసుకోలేక పోతున్నరాక్ చెప్పాలని కోరింది. ఇదే సందర్భంలో సోషల్ మీడియా ప్లాట్ఫారంలకు నోటీసులు ఇచ్చామని చెప్పి, పంచ్ ప్రభాకర్ చేసిన వీడియోలు తొలగించాలని చెప్పి , ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు అశ్వనీ కుమార్ సూచించారు. ఇదే సమయంలో సిబిఐకి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారంలకు ఒక లేఖ రాస్తే, ఆ వీడియోలు తొలగిస్తారని కోర్టుకు తెలిపారు. హైకోర్టు కూడా ఈ విధంగా ఆదేశించింది. ఈ కేసుని రేపు ఉదయానికి పోస్టింగ్ చేస్తున్నామని, రేపు ఉదయం సిబిఐ ఎస్పీ తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

హీరో నాగార్జున ఉన్నట్టు ఉండి తాడేపల్లిలో ప్రత్యక్షం అయ్యారు. కొద్ది సేపటి క్రితం నాగార్జున ప్రత్యేక విమానంలో, గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. నాగార్జునతో పాటు నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు. వీరు కొద్ది సేపటి క్రితం గన్నవరం నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. సియం క్యాంప్ ఆఫీస్ లో, జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం క్యాబినెట్ సమావేశంలో అమరావతి సచివాలయంలో ఉన్నారు. జగన్ అక్కడ నుంచి వచ్చిన తరువాత, వీళ్ళతో భేటీ అయ్యే అవకాసం ఉంది. సాయంత్రం 5.30 గంటలకు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తో భేటీ కాబోతున్నారు. ఈ మధ్యలోనే, వీరితో భేటీ అయ్యే అవకాసం ఉంది. అయితే నాగార్జున ఎందుకు వచ్చారు అనేది మాత్రం అంతుబట్టటం లేదు. సినిమా పరిశ్రమ గురించి అయితే, ఇతర హీరోలు, ఇతర నిర్మాతలు కూడా రావాలి కానీ, ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున ఎందుకు వచ్చారు అనేది తెలియాల్సి ఉంది. మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు. ఆయన సొంత పనులు మీద వచ్చారా ? లేదా సినీ పరిశ్రమకు , జగన్ కు మధ్య ఉన్న గ్యాప్ ని చెరిపేయటానికి వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల జగన్ తీసుకున్న నిర్ణయం పై, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, సినీ పరిశ్రమ జోలికి రావద్దు అంటూ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

nag 28102021 2

మరో పక్క ఆన్లైన్ లో ఏపి ప్రభుత్వమే, సినిమా టికెట్లు అమ్మే విధానం పై కూడా విమర్శలు వస్తున్నాయి. దీని పై ఈ రోజు క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోనున్నారు. మరో పక్క బెనిఫిట్ షోల పై కూడా వివాదం ఉంది. ఈ మొత్తం అంశాల పై, సినిమా పరిశ్రమ, ఏపి ప్రభుత్వం మధ్య ఉన్న వివాదం నేపధ్యం, ఈ వివాదాలు మొత్తం నేపధ్యంలో, నాగార్జునను ముందు పెట్టి, సినీ పరిశ్రమ సమస్య పరిష్కారం చేసుకుంటుందా అనే చర్చ మొదలైంది. నాగార్జున మొదటి నుంచి జగన్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ నేపధ్యంలోనే జగన్ తో భేటీ కోసమే ఈ పర్యటనగా తెలుస్తుంది. మరి కొద్ది సేపట్లో ఈ భేటీ జరిగిన తరువాత కానీ, అసలు నాగార్జున ఎందుకు వచ్చారు అనే విషయం పై క్లారిటీ వచ్చే అవకాసం ఉంది. మరో పక్క నాగార్జున వ్యక్తిగత పని మీద వచ్చారు అనే చర్చ కూడా జరుగుతుంది. విశాఖలో స్టూడియో నిర్మాణం కోసం, భూములు కోసం, నాగార్జున జగన్ ను కలవటానికి వచ్చారా అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తంగా నాగార్జున స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు.

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, ఇప్పటికే ఆయన పై 12 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులు పై నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీటి పై తెలంగాణా హైకోర్టులో ఒక రిట్ పిటీషన్ దాఖులు అయ్యింది. మొత్తం అన్ని కేసులు కలిపి, దాదాపుగా 40 పిటీషన్లకు సంబంధించి, తెలంగాణా హైకోర్టు రోజు వారీ విచారణ చేయాలి అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రిట్ పిటీషన్లకు సంబంధించి కానీ, డిశ్చార్జ్ పిటీషన్లకు సంబంధించి కానీ, పిటీషన్లు విచారణలో జాప్యం జరుగుతూ వస్తుంది. కొన్ని పిటీషన్లలో సిబిఐ కానీ, ఈడీ కానీ కౌంటర్ దాఖలు చేయటానికి గడువు కోరుతూ ఉండటంతో, తీవ్ర జాప్యం జరుగుతుంది. సిబిఐ, ఈడీ కౌంటర్ దాఖాలు చేస్తే కానీ, డిశ్చార్జ్ పిటీషన్ల పై క్లారిటీ వచ్చే అవకాసం లేదు. మరో వైపు తెలంగాణా హైకోర్టులో దాఖలు అయిన రిట్ పిటీషన్ల విషయంలో మాత్రం, ఇక నుంచి రోజు వారీ విచారణ జరిగి, వీటిని తొందరగా తేల్చేస్తాం అంటూ, తెలంగాణా హైకోర్టు భారీ జర్క్ ఇచ్చింది. ఈ కేసులు సాగదీసి సాగదీసి, టైం వెస్ట్ చేయాలి అనే స్ట్రాటజీని పసిగట్టిన తెలంగాణా హైకోర్టు, ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 40కు పైగా ఈ తరహా పిటీషన్ల పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

jagan 28102021 2

ఈ 40కు పైగా పిటీషన్ల పై నిర్ణయం తీసుకుంటూ రోజు వారీ విచారణ చేసి, తొందరగా తేల్చి వేయాలని హైకోర్టు భావిస్తుంది. ప్రధానంగా ఈ కేసుల్లో, హెటిరో, అరబిందో, రాంకీ ఇలా వివిధ సంస్థల విషయంలో సిబిఐ అధికారులు సుదీర్ఘ విచారణ చేసి, దానికి సంబంధించిన చార్జ్ షీట్లు వేసారు. దీని ఆధారంగానే సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే టమా పేర్లు తీసి వేయాలని, పిటీషన్లు వేస్తూ, కాలం సాగ దీస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి సియం అయిన తరువాత, కేవలం ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరు అయ్యారు. ఇప్పుడు హైకోర్టులో మొదలు అయ్యే రోజు వారీ విచారణకు హైకోర్టు వ్యక్తిగతంగా జగన్ను రమ్మంటుందా, లేదా అనేది చూడాలి. ఈ రోజు నుంచి ప్రతి రోజు ఈ కేసులు విచారణ జరగనుంది. అయితే ఒక వారం గడువు కావాలని పిటీషనర్ తరుపున న్యాయవాదులు కోరగా, కోర్టు ఒప్పుకోలేదు. ఇప్పటికే ఏళ్ళ తరబడి ఆలస్యం అయ్యిందని, ఇక విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అంటూ, కోర్టు తేల్చి చెప్పింది. దీంతో కేసుని సాధ్యమైనంత ఎక్కువ సేపు సాగదీయాలి అనే పిటీషనర్ తరుపు ఎత్తుగడ వర్క్ అవుట్ అవ్వలేదని చెప్పాలి.

విజయసాయి రెడ్డి చాలా రోజుల తరువాత బయటకు వచ్చారు. ట్విట్టర్ లో కూడా ప్రతి రోజు చంద్రబాబు, లోకేష్ పై విరుచుకు పడే విజయసాయి రెడ్డి, గత రెండు నెలలుగా ఎందుకో కానీ సైలెంట్ అయ్యారు. ఏమి అయ్యిందో, ఎవరు సెటిల్ చేసారో కానీ, ఆయన ఎట్టకేలకు మళ్ళీ ఫాంలోకి వచ్చారు. గతంలో శ్రీవారి నగలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని, అలాగే వివేకకు గుండెపోటు వచ్చి చనిపోయారని, ఇలా అనేక తప్పుడు ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డి, మళ్ళీ అవే తప్పుడు ఆరోపణలతో ముందుకు వచ్చారు. తాము అధికారంలో ఉన్నామనే స్పృహ కూడా లేకుండా, ఇంకా ఇలా గాలి మాటలు చెప్తూ, ప్రజల్లో విష బీజాలు నాటుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి తోడుగా చంద్రబాబు గారికి అమిత్ షా అపాయింట్మెంట్ లేట్ అవ్వటంతో, ఇంకేముంది, పండుగ చేసుకున్నారు. చంద్రబాబుని, లోకేష్ ని తిట్టేసారు. ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసారు. గంజాయి మొత్తం లోకేష్ చేస్తున్నారని చెప్పేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ, గంజాయి విషయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, ఏపి నుంచి వస్తున్న గంజాయి పై చెప్పుకొచ్చారు.

reddy 28102021 2

ఈ వీడియోలు అన్నీ లోకేష్ నాలుగు రోజులు క్రితం పోస్ట్ చేసారు. నల్గొండ ఎస్పీ, హైదరాబాద్ సిపీ, ఢిల్లీ డీసిపీ, కేరళ పోలీస్ అధికారి, బెంగుళూరు పోలీస్ కమీషనర్, ఇలా పెద్ద పెద్ద ఐపిఎస్ లు అందరూ, గంజాయి ఎక్కడ నుంచి వస్తుంది అంటే, ఏపి నుంచి అనే విధంగా చెప్పారు. ఈ వీడియో బలంగా ప్రజల్లోకి వెళ్ళటంతో, దీనికి కౌంటర్ ఇవ్వటానికి విజయసాయి రెడ్డి వ్యూహం పన్నారు. యధావిధిగా, దీని వెనకాల చంద్రబాబు ఉన్నారు అంటూ, వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ సరిహద్దు జిల్లాలో ఉండే ఒక పోలీస్ అధికారి చంద్రబాబుకు బాగా కావలసిన మనిషి అని, టిడిపితో బాగా అనుబంధం ఉందని, ఈ అధికారే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు చెందిన తన సహచర పోలీసులతో కలిసి, ఏపిలో గంజాయి ఉంది అనే విధంగా ప్రచారం చేసారు అంటూ, విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ తెలంగాణా పోలీస్ అధికారి పై, కేసీఆర్ కు కూడా ఫిర్యాదు చేస్తానని అన్నారు. అయితే ఇది సాదా సీదా ఆరోపణ కాదు, ఇలాంటి ఆరోపణల మరి కేసీఆర్ కానీ, తెలంగాణా పోలీస్ అధికారులు కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సమాధానం చెప్పలేక, విజయసాయి రెడ్డి ఇలా ఎప్పటిలాగే చంద్రబాబు మీద తోసేసాడా, లేకపోతే, ఇందులో వాస్తవం ఏమిటి అనేది తెలంగాణా ప్రభుత్వం తేల్చి చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read