విశాఖ శారదా పీఠానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు, ఈ రోజు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. ఆ కధనాల ప్రకారం స్వరూపానందకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు అర్ధం అవుతుంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో, ఈ విషయం పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. స్వరూపానంద అంటే జగన్ మోహన్ రెడ్డికి బాగా ఇష్టం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డిని గంగలో ముంచి, హిందూ ఓటర్లను ఆకర్షించటంలో స్వరూపానంద కృషి చేసారు. ఎన్నికల తరువాత జగన్ ని ఆకాశానికి ఎత్తేసారు. జగన్ గెలుపు కోసం పని చేసినట్టు ఆయనే చెప్పారు. మరి ఇంత చేసిన స్వామీజీ రుణం తీర్చుకోవటానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. ఆయన పీఠానికి 15 ఎకరాల విలువైన భూమి ఇచ్చేందుకు, సెట్ అప్ మొత్తం సెట్ అయ్యింది. ఇప్పటికే కలెక్టర్ నివేదిక కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. రేపటి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించటమే తరువాయి అని తెలుస్తుంది. ఇప్పటికే స్వరూపానందకు విశాఖలో పీఠం ఉంది. ఆ భూమి కూడా కొంత మేర ఆక్రమించుకున్న భూమి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వరూపానంద శిష్యుడే. ఆయన కూడా ఈ మధ్యనే ఆయన రుణం తీర్చుకున్నారు.

swaroopananda 27102021 2

అత్యంత విలువైన కోకాపేటలో 2.34 ఎకరాల భూమి, దాదాపుగా 12 కోట్ల విలువైన భూమిని కేవలం రెండు రూపాయలకే ఇచ్చి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న స్వరూపానంద పీఠం, ఇక పైన వేద పాఠశాల కూడా నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే, పక్కన నది, చుట్టూ కొండలు ఉండే ప్రాంతం అయితే బాగుటుందని, విజయనగరం జిల్లాలో ఒక భూమి ఎంపిక చేసుకున్నారు. అక్కడ భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనలు పక్కన పెట్టి, డైరెక్ట్ గా కలెక్టర్ చేత నివేదిక ఇప్పించి, రేపు క్యాబినెట్ మీటింగ్ లో ఈ ఫైల్ వచ్చేలా చకచకా పావులు కదిపారు అంటూ ఆ కధనం సారంశం. అయితే అక్కడ మార్కెట్ వాల్యు రూ.50 లక్షల వరకు ఉందని, మరి స్వరూపానందకు ఎంతకు ఇస్తారు ? ఉచితంగా ఇస్తారా ? లేక కేసిఆర్ లాగా, ఎకరం రూపాయికి ఇస్తారా అనేది చూడాలి. ఈ విషయం పై ఇప్పుడు రాజకీయంగా కూడా రచ్చ అయ్యే అవకాసం లేకపోలేదు.

మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నాయకులు పత్రికల్లో వచ్చిన సమాచారం కానీ, తమకు తెలిసిన సామాచారం కానీ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం పై విమర్శలు చేసారు అంటే, వెంటనే వారి ముందు పోలీసులు దిగిపోతారు. వారికి నోటీసులు ఇచ్చి, మీకు ఆ సమాచారం ఎక్కడిది, దీని పై తమకు మరింత సమాచారం ఇవ్వండి, తాము దర్యాప్తు చేస్తాం అంటూ, హడావిడి చేస్తూ, ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెడుతూ ఉంటారు. చివరకు డీజీపీ చంద్రబాబు గారికి కూడా లేఖ రాసి, వివరాలు అడిగారు అంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు మన రాష్ట్రంలో గత పది రోజులుగా జరుగుతున్న ఈ రచ్చకు కూడా ఈ నోటీసులే. గంజాయి విషయం పై నల్గొండ పోలీసులు, విశాఖ రాగా, వారి పైనే గంజాయి మాఫియా దా-డి చేయగా, నల్గొండ పోలీసులు ఫైర్ ఓపెన్ చేసారు. దీని పై టిడిపి నేత నక్కా ఆనందబాబు మీడియా సమావేశం పెట్టి, ఇంత రచ్చ జరుగుతుంది అంటే,దీని వెనుక కచ్చితంగా వైసిపి నేతల హస్తం ఉందని, అందుకే పోలీసులని కూడా లెక్క చేయటం లేదని అన్నారు. అంతే వెంటనే నర్సీపట్నం నుంచి పోలీసులు గుంటూరు వచ్చేసారు. నక్కా ఆనంద బాబుకి నోటీసులు ఇచ్చారు. దీని పైనే పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి బోస్ డీకే అని సజ్జల అనటం, సాయంత్రం టిడిపి ఆఫీస్ ల మీద బీపీ పెరిగిన జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయులు దా-డి చేయటం జరిగిపోయాయి.

dgp 27102021 2

ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అంటే, ఇలాంటి నోటీసులు, కేవలం టిడిపి నేతలకే ఇస్తారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఇలాంటి నోటీసులు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు విజయసాయి రెడ్డి మీడియా సమావేశం పెట్టారు. చాలా రోజుల తరువాత విజయసాయి రెడ్డి బయటకు వచ్చారు. ఈ మధ్య ఆయన అలిగారని, దూరం పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే అ అలక తీరిందో ఏమో కాని, ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు, లోకేష్ పై ఎదురు దాడి చేసారు. గంజాయి వ్యాపారంలో నారా లోకేష్ ఉన్నారని, అందరికీ తెలుసు అని అన్నారు. గంజాయితో లోకేష్ కి సంబంధాలు ఉన్నాయని అన్నారు. మరి అందరికీ నోటీసులు ఇచ్చినట్టే, డీజీపీ గారు పూర్తి ఆధారాలు తమకు ఇవ్వండి, లోకేష్ ప్రమేయం గురించి చెప్పండి అని, విజయసాయి రెడ్డికి నోటీసులు ఇస్తారా అనే ప్రశ్న వస్తుంది. రూల్ అఫ్ లా అంటే అందరికీ ఒకటే కాబట్టి, ఆధారాలు తీసుకుని, చంద్రబాబు, లోకేష్ పైన , డీజీపీ కేసు పెట్టచ్చు కదా ? మరి డీజీపీ గారు ఏమి చేస్తారో చూడాలి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్ది సేపటి క్రితం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసారు. చంద్రబాబు రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి, భారత రాష్ట్రపతిని కలుసుకున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలిసిన తరువాత, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసారు. అయితే అమిత్ షా మూడు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. నిన్న సాయంత్రం అమిత్ షా ఢిల్లీకి రావటం, ఆ తరువాత కూడా ముందుగా నిర్ణయించిన కౌన్సిల్ అఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండటంతో, ఆయనకు కలవటం కుదరలేదు అని చెప్పి, అమిత్ షా పేషీ అధికారులు చంద్రబాబు బృందానికి సమాచారం అందించారు. దీంతో చంద్రబాబు బృందం నిన్న సాయంత్రం బయలుదేరి అమరావతి వచ్చేశారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు తన కోసం ఎదురు చూసారని తెలుసుకున్న అమిత్ షా, కలవటం కుదరక పోయి నందుకు చంద్రబాబుకు ఫోన్ చేసారు. ముందుగా నిర్ణయం తీసుకున్న కార్యక్రమాలు ఉండటంతో కలవలేక పోయానని, మరొకసారి మీరు ఢిల్లీ వచ్చినప్పుడు కలుద్దాం అని చెప్పారు. అయితే చంద్రబాబుని ఎందుకు కలవాలి అనుకుంటున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

phone 27102021 2

అయితే తాము ఏదైతే వినతి పత్రం తయారు చేసామో అది మీకు పంపుతున్నాం అని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం జరుగుతుందని, ఇటీవల టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దా-డు-లు పరాకాష్ట అని, రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు, నేతల పై దా-డు-లు, వి-ధ్వం-సా-లు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, చంద్రబాబు ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి తీసుకుని వెళ్లారు. అదే విధంగా గంజాయి, ఇతర డ్ర-గ్స్ విషయాల పై ఆంధ్రప్రదేశ్ లో మూలాలు ఉండటం, గంజాయి దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా, ఏపి నుంచి వెళ్తూ ఉండటం, వీటి అన్నీ కూడా యువత జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాల పై అసలు పట్టించుకోవటం లేదని అన్నారు. ఇప్పటికే రాష్ట్రపతికి ఫిర్యాదు చేసామని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు, వీడియోలతో సహా పంపుతాం అని అన్నారు. వీటి అన్నిటి పై తాను కూడా వివరాలు సేకరించి, అన్ని విషయాల పై సమీక్ష చేస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు. తాను త్వరలోనే ఢిల్లీ వచ్చి కలుస్తానని చంద్రబాబు తెలిపారు. అయితే అనూహ్యంగా అమిత్ షా నుంచి చంద్రబాబుకు ఫోన్ రావటంతో, వైసీపీ ఫీజులు ఎగిరి పోయాయి. నిన్నటి నుంచి హేళన చేసిన వారికి, ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి.

అధికార పార్టీకి చెందిన మంత్రులే కాదు, వారి పుత్రరత్నాలు అయినా సరే, వారికి ప్రోటోకాల్ పంట పండినట్టే అని చెప్పాలి. రాష్ట్రంలో మంత్రుల కొడుకులకు, ప్రోటోకాల్ స్వాగతం పలుకుతున్నారు అధికారులు. నిన్న కృష్ణా జిల్లాలో మంత్రి కొడుకుకి ఇలాంటి స్వాగతమే లభించింది. నిన్న మచిలీపట్నంలో జరిగిన ఆర్టిసి కి సంబందించిన డ్రైవింగ్ స్కూల్ తొమ్మిదవ బ్యాచ్ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి, ఆర్టిసి రీజనల్ మ్యానేజర్ అతిధిగా రావలసి ఉంది. అయితే ఆయన తనకు ఒక ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్ ఉందని చెప్తూ, ఆయన రాలేదు. అయితే వెంటనే అధికారులు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టుతో ఈ శిక్షణా తరగతులు ప్రారంభించారు. అలాగే అక్కడ ఉన్న వారికి సర్టిఫికేట్ లు కూడా మంత్రి కొడుకు అందించారు. అయితే అసలు ఈయన ఏ హోదాలో అక్కడకు వచ్చారు ? ఏ హోదాలో అధికారులు ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చారు ? అసలు ఈయన ఎవరు అనే చర్చ కూడా జరిగింది. అక్కడ ఉన్న కొంత మంది వ్యక్తులు, విలేఖరులు కూడా ఇదేమి పద్దతి అంటూ అక్కడున్న ఆర్టిసి అధికారులను ఈ విషయం పై ప్రశ్నించారు. అయితే వాళ్ళు సమాధానం చెప్తూ, అధికారి అందుబాటులో లేకపోవటంతో, ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మంత్రి కొడుకుని తీసుకుని వచ్చినట్టు చెప్పారు.

perni 271020212

యువతకు ప్రోత్సాహం ఇవ్వటానికి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి, యువకుడు అయిన మంత్రి కొడుకుని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తీసుకుని వచ్చినట్టు చెప్తున్నారు. అయితే గతంలో కూడా కార్పోరేషన్ కు సంబంధించి కానీ, వివిధ ఇతర కార్యక్రమాల్లో కూడా, ప్రోటోకాల్ నిబంధనలను పూర్తిగా పక్కకు పెట్టి, మంత్రి కొడుకు ఇలాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గున్న ఫోటోలు, వీడియోలు గతంలో కూడా వైరల్ అయ్యాయి. గతంలో కూడా ఇదే అంశం పై విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షం టిడిపి కూడా ఈ అంశం పై విమర్శలు చేసింది. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా, మళ్ళీ నిన్న మంత్రి కొడుకు, అధికారిక కార్యక్రమంలో పాల్గున్నారు. పదే పదే మంత్రి కొడుకుకి, ఈ విధంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలకటం, ప్రోటోకాల్ పాటించక పోవటం పై, విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయం పై విమర్శలు చేస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని, అధికారులు కొంచెం చూసుకుని ప్రవర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read