ఒక పక్క దేశంలో, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పతనం అవుతున్నాయని, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు అధికార పార్టీకు తొత్తులుగా మారిపోయాయి అనే ప్రచారం నడుస్తున్న నేపధ్యంలో, గత నాలుగు నెలలుగా సుప్రీం కోర్టు వ్యవహరిస్తున్న తీరు అందరికీ సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుకు, సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు బ్రేకులు వేస్తుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వచ్చిన దగ్గర నుంచి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు, దూకుడుగా వెళ్తున్న కేంద్రానికి కళ్ళెం వేస్తున్నారు. తాజాగా, దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన పెగసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో, దేశం మొత్తం ప్రశంసలు లభిస్తున్నాయి. కేంద్రం ఈ వ్యవహారం పై ఎంత తప్పించుకోవాలని చూసినా, సుప్రీం ఒప్పుకోలేదు. పెగసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇస్తూ, జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో ఈ వ్యవహారం పై నిగ్గు తేల్చాలి అంటూ కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఒకరు మాజీ ఐపిఎస్ అలోక్ జోషి, సందీప్ ఒబరేయ్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి సహాయం చేయటానికి టెక్నికల్ కమిటీ కూడా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ముగ్గురూ సాంకేతిక అంశాలు గురించి సహాయం చేస్తారు.

cji 28102021 2

ఈ మొత్తం వ్యవహారం పై జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో బృందం స్వతంత్ర్యంగా దర్యప్తుక్ జరిపి, నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎనిమిది వారాల తరువాత ఈ కేసు విచారణ మళ్ళీ జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసుని ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. ముఖ్యంగా పెగసస్ వ్యవహారం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. తమ ప్రత్యర్ధి రాజకీయ నాయకుల ఫోన్లలో చొరబడి, మొత్తం ట్యాప్ చేసారు అంటూ, ప్రతిపక్షాలు ఆరోపించారు. రాజకీయ నాయకులతో పాటు, ఇతర ప్రముఖుల ఫోన్ల కూడా ట్యాప్ అయ్యాయి. ప్రముఖ జర్నలిస్ట్ రాం ఈ వ్యవహారం పై సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే దీని పై కేంద్రం సమాధానం చెప్తూ, మేము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని, కోర్టుకు తెలిపారు. ఇంతకు మించి ఏమి సమాచారం ఇవ్వలేమని, ఇది దేశ భద్రతకు సంబందించిన అంశం అని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం సమాధానంతో సంతృప్తి చెందని చీఫ్ జస్టిస్, కమిటీ ఏర్పటు చేసి, ఈ వ్యవహారం పై తేల్చమని ఆదేశాలు ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలన నిర్ణయం తీసుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పై, దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాఖా సొంత జిల్లాలో, వైసిపీ నేతల దౌర్జన్యా కాండ పరాకాష్టకు చేరింది. ఇప్పటి వరకు ఈ రకం దౌర్జన్యాలు ప్రతిపక్షాలు, సామాన్య ప్రజల మీద చేసే వారు, ఇప్పుడు ఏకంగా ఉన్నత స్థాయి సీనియర్ అధికారుల పై కూడా బెదరింపులకు దిగుతున్నారు. ఈ అధికారులు కూడా సామాన్య అధికారులు కాదు, ఉన్నత స్థాయి అధికారులు. నిన్న ఏకంగా పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషాను, కడప వైసిపీ నేతలు, రాజోలి వీరారెడ్డి, అలాగే ఈయన పరిశ్రమల శాఖ సలహాదారుడు కూడా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ రాజోలి వీరారెడ్డి అనే వ్యక్తి ఏకంగా ప్రభుత్వ ఆఫీస్ కు వెళ్లి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషాను బెదిరించారు. నీ అంతు చూస్తాను, నిన్ను లేపెస్తాను, నాకు సంబందించిన వ్యక్తి పాత బిల్లులు చేయమంటే, సబ్సిడీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమంటే, ఇవ్వకుండా జాప్యం చేస్తావా, నిర్లక్ష్యం చేస్తావా అంటూ ఆయన పై బెదిరింపులకు దిగారు. ఇది మా ప్రభుత్వం అని, మా మనుషులు, మా పార్టీ వాళ్ళు, అడిగితే, నేను సహాయకుడిగా ఉన్న శాఖలోనే నాకు సహకరించవా, నువ్వు నాకు సహాయం చేయను వద్దు, నాకు బిల్లులు ఇవ్వను వద్దు, నిన్ను చం-పే-స్తాం, నిన్ను చంపటమే నా లక్ష్యం అంటూ, ఏకంగా సీనియర్ అధికారి అయిన, పరిశ్రమల శాఖ జీఎం పై వైసిపీ నేతలు దౌర్జన్యం చేసారు.

bhasha 28102021 2

దీంతో ఈ అరాచకాన్ని తట్టుకోలేక, వైసీపీ నేతల బెదరింపులకు లంగకుండా, పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషా, మీడియా ముందుకు వచ్చి, మొత్తం విషయం బెదిరించారు. ఈ అరాచకం పై, ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేగింది. ఒక వైసిపీ నేత, ఉన్నతాధికారులను బెదిరించటం ఏమిటి, మరీ ఇంత దారుణమా అంటూ, ప్రజలు చర్చించుకుంటున్నారు. బిల్లులు కోసం, ఇంత బెదిరింపులకు దిగుతారా అని, ఏకంగా ఆఫీస్ కు వెళ్లి, ఆ అధికారినే చం-పే-స్తాం అని చెప్పటం వైసిపీ అధికార మదానికి నిదర్శనంగా చెప్తున్నారు. ఉన్నతాధికారులకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక చిన్న స్థాయి ఉద్యోగులు, చిన్న చిన్న పనులు చేసుకునే వారు, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని మాట్లాడుకుంటున్నారు. అయితే జగన్ దగ్గర డబ్బులు లేవు, సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు అని అతను జగన్ మోహన్ రెడ్డిని కించపరిచేలా మాట్లాడారని, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ, వైసీపీ నేత సమర్ధించుకున్నారు. మొత్తానికి, వైసిపీ అరాచకం స్వైరవిహారం చేస్తుందనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. పోలీసులు, అధికార పార్టీ ఒత్తిడితో వ్యవహరిస్తున్నారు అనేదానికి ఇదే సాక్ష్యం. గత వారం కొంత మంది బీపీ పెరిగిన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానాలు, కర్రలు, రాళ్ళు, పలుగులు, సుత్తులు తీసుకుని వచ్చి, తమ బీపీ తగ్గే వరకు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి టిడిపి కార్యాలయాల పైన దా-డు-లు చేసిన సంగతి తెలిసిందే. ఇది బీపీ పెరిగి చేసారని జగన్ మోహన్ రెడ్డి అంటుంటే, చూసిన వారికి మాత్రం ఉన్మాదం పెరిగి చేసారని అర్ధం అవుతుంది. అయితే బీపీ పేషెంట్లు అనో ఏమో కానీ, దా-డి-లో పాల్గున్న వైసిపీ కార్పొరేటర్లు, ఇతర పెద్ద పెద్ద వాళ్ళను వదిలేసి, చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వారి పై కేసులు పెట్టి, నోటీసులు ఇచ్చి పోలీసులు చేతులు దులుపుకున్నారు అంటూ టిడిపి ఆరోపిస్తుంది. అదీ కాక వారి పైన మొత్తం బెయిలబుల్ కేసులే పెట్టారు. అయితే టిడిపి నేతల విషయంలో మాత్రం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, 41 ఏ నోటీస్ ఇవ్వకుండా కూడా వారిని అరెస్ట్ చేసేంత వరకు వెళ్తున్నారు. తాజాగా టిడిపి మాజీ ఎమ్మెల్యే, బొండా ఉమాకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఆయన పై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. ఈ కేసు ఏమిటో తెలిసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

bonda 27102021 2

తమ పార్టీ ఆఫీస్ పై రౌడీ మూకలు దా-డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా బొండా ఉమా ప్రసంగించారు. అయితే బొండా ఉమా ప్రసంగంలో అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ, వైసిపీ నేత గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ఫిర్యాదు చేయటంతో, బొండా ఉమా పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. 53a, 294 b, 504 , 505, 506 సెక్షన్ల కింద బొండా ఉమా పై కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు చిటిక వేస్తే, తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయం నేలమట్టం చేస్తాం అంటూ బొండా ఉమా ప్రసంగించటమే కారణం. దీని పైన వైసిపీ నేతలు మూడు రోజుల క్రిందట ఫిర్యాదు చేయగా, బొండా ఉమా పై కేసు నామోదు చేసారు. దీని పై బొండా ఉమా స్పందిస్తూ, ఈ అక్రమ కేసులు ఎదుర్కోవటానికి దేనికైనా సిద్ధమే అని ప్రకటించారు. దా-డి చేసిన వారి పైన ఒక విధంగా వ్యవహరిస్తూ, ప్రసంగాలు చేస్తుంటేనే కేసులు, అరెస్ట్ లు చేస్తున్నారు అంటూ, టిడిపి శ్రేణులు మండి పడుతున్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి నెంబర్ టు విజయసాయి రెడ్డికి ఈ మధ్య పార్టీలో హోల్డ్ పోయింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, మొత్తం నాదే అనుకున్నారు. వెంటనే విజయసాయికి చెక్ పెట్టటానికి సజ్జల రామకృష్ణా రెడ్డిని దించారు. దీంతో రాష్ట్రం మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. జగన్ ఎంత బలమైన వాడో, సజ్జల కూడా అంతే బలమైన వ్యక్తిగా పార్టీలో పేరు తెచ్చుకున్నారు. మొత్తం నాదే అనుకున్న విజయసాయి రెడ్డిని కేవలం ఉత్తరాంధ్రకు పరిమితం చేసారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కూడా గెంటేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ సీటు రెన్యువల్ కూడా జరగదనే ప్రచారం జరుగుతుంది. విజయసాయి రెడ్డి ఇక నెమ్మదిగా కనుమరుగు అయిపోవాల్సిందే అనే కామెంట్స్ వినపడ్డాయి. దీనికి తగ్గట్టే విజయసాయి రెడ్డి గత రెండు నెలలుగా సైలెంట్ అయిపోయారు. అయితే ఏమైందో ఏమో, సెటిల్మెంట్ జరిగిందో ఏమో కానీ, విజయసాయి రెడ్డి ఉన్నట్టు ఉండి నిన్న బయటకు వచ్చారు. ఒక భారీ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో, చంద్రబాబుని, లోకేష్ ని ఉతికి ఆరేసారు. అంతే కాదు గంజాయి మొత్తం లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అంటూ, తమ ప్రభుత్వం అధికారంలోనే ఉంది అనే సోయ కూడా లేకుండా, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసారు.

vsreddy 28102021 2

అసలు చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వచ్చారు, ఆ బూతులు ఏమిటి అంటూ,పట్టాభి అన్న ఆ ఒక్క మాట పట్టుకుని, నానా రభసా చేసారు. అసలు తమ పార్టీ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తమ పార్టీకి చంద్రబాబుకి పోలికే లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. విలేఖరులు సమావేశం కావటంతో, విజయసాయి రెడ్డి పప్పులు ఉడక లేదు. ఒక విలేఖరి మాట్లాడుతూ, మీరేమన్నా తక్కువ తిన్నారా, జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, మీ పార్టీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా అంటూ, వాటి పై సమాధానం చెప్పండి అనగానే, విజయసాయి రెడ్డి ఫీజులు ఎగిరి పోయాయి. తనకు అవేమి గుర్తు లేవని, వాళ్ళు ఆ వ్యాఖ్యలు ఎప్పుడు చేసారు, డేట్, టైం , ప్లేస్ ఇవన్నీ చెప్పి, ఆ వివరాలు అడిగితే, తాను స్పందిస్తాను అని, ఊరికే అడిగేస్తే తనకు ఆ వివరాలు తెలియదు అని, టైం, ప్లేస్ చెప్పి ప్రశ్నలు అడగాలి అంటూ, సమాధానం చెప్పలేక నెమ్మదిగా జారుకున్నారు. విజయసాయి రెడ్డిని మొత్తానికి, విలేఖరులు తమ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టటంతో, విజయసాయి రెడ్డి బిత్తర పోయారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు - https://www.facebook.com/SaahoChandrababu/videos/1047210066055202

Advertisements

Latest Articles

Most Read