తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించటం పై, తిరుపతికి చెందిన బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో పై హైకోర్టులో సవాల్ చేసారు. దీని పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, హైకోర్టు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భారత వైద్యమండలి మాజీ ఛైర్మన్ కేతన్‍దేశాయ్‍ను, ఈ పాలకమండలిలో సభ్యుడుగా ఎలా నియమిస్తారు అని చెప్పి ప్రశ్నించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న హైకోర్టు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గతంలో కేతన్‍దేశాయ్ పై జరిగిన సిబిఐ దా-డు-లు, ఆ తరువాత అతన్ని భారత వైద్యమండలి నుంచి తొలగించటం వంటి సంఘటనలను ఈ సందర్భంగా లాయర్ అశ్వనీ కుమార్ గుర్తు చేసారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న హైకోర్టు ధర్మాసనం కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నారా అని ప్రశ్నించింది. దీంతో జీవోలో ఉన్న కేతన్‍దేశాయ్ పేరు కూడా అశ్వినీ కుమార్ హైకోర్టుకు చూపించారు. దీంతో ఇది చాలా దారుణం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యక్తులను పాలక మండలిలో, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాల్లోని పాలకమండలిలో నియమించటం పై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
దీంతో హైకోర్టు స్పందిస్తూ, దీని పై సమాధానం చెప్పాలి అంటూ, ప్రతివాదులుగా ఉన్న దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటుగా, టిటిడి ఈవో, ఈ ఇరువురిని కూడా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, ప్రతివాదులుగా చేర్చారు. ఈ జీవో ఏదైతే ఉందో, ఈ జీవో నియమించిన సభ్యులలో దాదాపుగా, పది మంది నుంచి, 12 మంది పై నేర చరిత్ర ఉందని, ఇటువంటి వారిని దేవుడికి సేవ చేసే పేరుతో, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నియమించటం చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం, ధరం విరుద్ధం అని కూడా ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ ఈ రోజు హైకోర్టులో విచారణ అనంతరం, ఆ నియామకం పై, ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ కార్యనిర్వహణాధికారికి నోటీసులు జారీ చేసింది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి.